Live Updates: ఈరోజు (సెప్టెంబర్-22) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు పంచాంగం
ఈరోజు మంగళవారం | 22 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | షష్టి రా. 3-09వరకు తదుపరి సప్తమి | అనూరాధ నక్షత్రం రా. 1-36 వరకు తదుపరి జేష్ఠ | వర్జ్యం ఉ.6-45 నుంచి 08-15 వరకు | అమృత ఘడియలు: ఉ. 3-45 నుంచి 6-22 వరకు | దుర్ముహూర్తం: ఉ. 08-17 నుంచి 09-06 వరకు తిరిగి రా. 10-44 నుంచి 11-33 వరకు | రాహుకాలం: మ. 3-00 నుంచి 4-30 వరకు | సూర్యోదయం: ఉ.5-52 | సూర్యాస్తమయం: సా.6-00
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 22 Sep 2020 11:13 AM GMT
CM Jagan in Delhi: ఢిల్లీ చేరుకున్న ఏపీ సీఎం జగన్..
జాతీయం..
ఢిల్లీ:
-కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను కలవనున్న సీఎం
-రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను చర్చించనున్న సీఎం
-పోలవరం ప్రాజెక్టుకు నిధులు, తాజా పరిస్థితులను చర్చించనున్న సీఎం
- 22 Sep 2020 10:56 AM GMT
Nellore updates: టి టి డి నిధులు ఇష్టానుసారం మళ్లించే అధికారం ప్రభుత్వాలకు లేదు..కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి..
నెల్లూరు..
నెల్లూరు నూడా మాజీ చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి మీడియా సమావేశం.
-- తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనానికి అన్య మతస్తులకు డిక్లరేషన్ అవసరం లేదని టి టీ డి చైర్మన్ ప్రకటించడంతో ఆంతర్యం ఏమిటి?.
-- 23 న తిరుమలకు వస్తున్న ముఖ్యమంత్రి జగన్ కోసం మినహాయింపు లిస్తారా..
-- బ్రిటిష్ హయాం నుంచి వస్తున్న సంప్రదాయాన్ని మార్చే డానికి మీకు ఎవరు అధికారం ఇచ్చారు.
-- దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కన్నా ముఖ్యమంత్రి జగన్ అతీతులా !
-- అనాదిగా వస్తున్న హిందూ సంప్రదయాల్ని గౌరవించడానికి జగన్ కు కలిగిన ఇబ్బందులు ఏమిటి.
--తిరుమల తిరుపతి దేవస్థానం సంప్రదయాల్ని మార్చే హక్కు 2 సంవత్సరాలు వుండే పాలకమండళ్లకు 5 సంవత్సరాలు అధికారంలో ప్రభుత్వాలకు లేదు.
-- ఇప్పటికే రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న దేవలయాలపై దాడులతో హిందువుల మనోభావాలు దెబ్బతిని ఆందోళనలో వున్నారు.
-- కొత్తగా తిరుమల వెంకన్న నిధులను ఐదు వేల కోట్ల రూపాయలను ప్రభుత్వ సంస్థలలో బాండ్ల రూపంలో పెట్టుబడి పెడతామంటున్నారు.
-- అన్య మతస్తులు ఎవరు తిరుమల దర్శనానికి వచ్చినా హిందూ ధర్మం మీద నాకు నమ్మకం ఉంది కాబట్టే నేను వెంకటేస్వర స్వామిని దర్శించకోవడానికి వచ్చాను అని ఎంతటి వారైనా.. చివరకు అమెరికా అధ్యక్షుడు వచ్చినా డిక్లరేషన్ ఇచ్చి తీరాల్సిందే.
-- వెంటనే టి టి డి చైర్మైన్ తన నిర్ణయాన్ని ఉపసంహరించుకొని తిరుమల సనాతన సంప్రదాయాలను కాపాడాలి డిమాండ్ చేస్తున్నాము.
-- ఇక ఏ పార్టీ అయినా ఏ చైర్మన్ అయినా భవిష్యత్తులో ఇలాంటి అనైతిక నిర్ణయాలకు పాల్పడితే రాజకీయంగా కనుమరుగై పోతారని హెచ్చెరిస్తున్నాము
- 22 Sep 2020 9:53 AM GMT
Chittoor updates: పెద్దతిప్పసముద్రం మండలం లో విషాదం..
చిత్తూరు..
- కరోనా కు గురై క్వారంటైన్ కు తరలిస్తుంటే మార్గమధ్యంలో భయంతో మృతి చెందిన భర్త అబ్దుల్ రెహ్మాన్
- భర్త మృతిని జీర్ణించుకోలేక భార్య గుండెపోటు తో మృతి.
- సైదానీ(69), అబ్దుల్ రెహ్మాన్(74) భార్య భర్తలు ఇద్దరికీ కరోనా పాజిటివ్
- పాజిటివ్ కు గురైన వారిని మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే ఇద్దరూ మృతి
- 22 Sep 2020 9:30 AM GMT
Andhra Pradesh High Court: చీరాల దళిత యువకుడి కేసులో ఏపీ సర్కార్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు..
అమరావతి (హైకోర్టు)..
-చీరాల దళిత యువకుడు కిరణ్‌కుమార్ మృతి కేసులో ఏపీ ప్రభుత్వం, పోలీసుల తీరుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
-విచారణ సందర్భంగా ఈ కేస్‌ను సీబీఐకి ఎందుకు ఇవ్వకూడదు అని న్యాయస్థానం ప్రశ్నించింది.
-విచారణ పట్ల కిరణ్ కుమార్ తల్లిదండ్రులు సంతృప్తి చెందారని కేస్ కొట్టేయాలని ప్రభుత్వం తరపు న్యాయవాది విజ్ఞప్తి చేశారు.
-తమ ప్రభుత్వంలో ఎవరినైనా మీరు సంతృప్తి పరచగలరంటూ హైకోర్టు వ్యాఖ్యానించింది.
-కిరణ్ కుమార్‌తో పాటు ఉన్న సహ నిందితుడి ఫోన్ కాల్ రికార్డ్ ఇస్తామని న్యాయవాది శ్రవణ్ తెలుపగా.. అవసరం లేదని హైకోర్టు పేర్కొంది.
-ఈ కేసులో స్వాతంత్ర సంస్థ సీబీఐతో ఎంక్విరీ చేయించే అర్హత కలిగి ఉందని కోర్టు స్పష్టం చేశారు.
-ప్రభుత్వం తరపు పూర్తి వివరాలు అందించేందుకు రెండు వారాలు సమయం కోరింది.
-దీంతో హైకోర్టు తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది.
-కిరణ్ కుమార్ తరపున మాజీ ఎంపీ హర్షకుమార్ పిటిషన్ వేశారు.
-బాధితుడి తరపున హైకోర్టు న్యాయవాది జాడా శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు.
- 22 Sep 2020 9:26 AM GMT
CM Jagan Tour to Delhi: గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి..
కృష్ణాజిల్లా..
- తాడేపల్లి నుండి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.
- గన్నవరం నుండి ఢిల్లీ బయలుదేరిన సీఎం జగన్మోహన్ రెడ్డి.
- 22 Sep 2020 9:22 AM GMT
Visakha updates: డాక్టర్ శ్యామల మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న భర్త, కుటుంబ సభ్యులు..
విశాఖ ...
- అనకాపల్లి లో గత 48 రోజుల క్రితం తాళ్లపాలెం దగ్గర పోలవరం కాలవ లో పడి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన డాక్టర్ శ్యామల మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న భర్త, కుటుంబ సభ్యులు..
- పోలీసుల విచారణ తమ అనుమానాలకు నివృత్తి చేసేలా లేనందున ఈ కేసును CBCID కి అప్పగించాలని డిమాండ్ చేస్తూ నిరసన...
- శ్యామల కుటుంబ సభ్యులకు బీసీ సంఘాల సంఘీభావం...
- ఈ కేసులో నిజాలు బయటకు రావాలంటే సిఐఢీ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేసిన కుటుంబ సభ్యులు..
- 22 Sep 2020 9:19 AM GMT
Visakha updates: గతంలో లాగ మావోలు ఉనికి చాటుకోనే పరిస్థతి లేదు..ఎస్పీ కృష్ణారావు..
విశాఖ..
-hmtv తో విశాఖ ఎస్పీ కృష్ణారావు..
-గిరిజనులు మావోయిస్ట్ సిద్ధాంతినికి దూరంగా ఉంటున్నారు.
-ముమ్మరంగా కూంబింగ్ ఆపరేషన్స్ చేస్తున్నాము.
-మావోయిస్ట్ వారోత్సవాలు జరగకుండా అడ్డుకట్ట వేస్తాం.
-మన్య ప్రజలకు మంచి జరగకుండా మావోలు అడ్డుకుంటున్నారు.
-ఎవరు మేలు చేస్తున్నారో గిరిజనులు గ్రహించాలి.
-గిరుజనులు అన్నం తిని, ఇన్ ఫార్మర్ అనే నేపంతో మావోలు అమాయక ప్రజలను పొట్టనపెట్టుకుంటున్నారు.
- 22 Sep 2020 8:56 AM GMT
Rajahmundry updates: మంత్రి గుమ్మనూరు జయరాంపై ఏసీబీకి ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు..
తూర్పుగోదావరి - రాజమండ్రి..
- మంత్రి గుమ్మనూరు జయరాంపై రాజమండ్రి- లో ఏసీబీకి ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు..
- ఈఎస్‌ఐ స్కామ్‌లో కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్ అలాగే అతడి తనయుడు ఈశ్వర్ ప్రమేయం ఉందని ఆరోపిస్తూ వారిపై తగు విచారణ చేయాలని కోరుతూ ఏబీసీ కి ఫిర్యాదు
- రాజకీయకక్ష సాధింపుతో మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే కింజారపు అచ్చెన్నాయుడిపై ఉద్దేశపూర్వకంగా ఈఎస్‌ఐ స్కామ్‌లోకి లాగారని, నిజానికి, ఆంధ్రప్రదేశ్ లేబర్, ఎంప్లాయ్‌మెంట్, ట్రైనింగ్ అండ్ ఫ్యాక్టరీస్ శాఖా మంత్రి గుమ్మనూరు జయరామ్, ఆయన తనయుడు ఈశ్వర్‌లు ఈ కుంభకోణంలో పాత్రదారులని పేర్కొన్నారు.
- నగర టీడీపీ ప్రధాన కార్యదర్శి రెడ్డి మణేశ్వరరావు, తెలుగుదేశం నాయకులు, మజ్జి రాంబాబు, కడలి రామకృష్ణ, నగర తెలుగు యువత అధ్యక్షులు నక్కా దేవీవరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు
- 22 Sep 2020 8:42 AM GMT
Nellore updates: సంగం(మం),పెరమన సమీపంలో ముంపునకు గురైన వరి పంటను పరిశీలించిన కేంద్ర బృందం..
నెల్లూరు..
కేంద్ర బృందం..
తడిసిన ధాన్యాన్ని పరిశీలించి.. నమూనాలను సేకరించిన కేంద్ర బృందం.-
రైతుల నుండి సమస్యలు తెలుసుకున్న కేంద్ర బృందం.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా పంట నష్టాన్ని పరిశీలిస్తున్నాం.
జరిగిన పంట నష్టం గురించి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తాం....నష్ట పోయిన ప్రతీ రైతుకు నష్ట పరిహారం అందేటట్లు చర్యలు...
- 22 Sep 2020 8:12 AM GMT
Anantapur updates: మడకశిర కి చెందిన ఓ యువకుడు పోలీస్ స్టేషన్ ఎదుట ఆత్మహత్య యత్నం..
అనంతపురం :
* మడకశిర మండలం చీపులేటి గ్రామానికి చెందిన ఓ యువకుడు పోలీస్ స్టేషన్ ఎదుట ఆత్మహత్య యత్నం..
* తన పై అక్రమ కేసులు బనాయించారని మనస్థాపం చెంది Police Station ఎదుట పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకుయత్నం.
* అడ్డగించి కాపాడిన పోలీసులు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire