Live Updates: ఈరోజు (సెప్టెంబర్-22) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 22సెప్టెంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు మంగళవారం | 22 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | షష్టి రా. 3-09వరకు తదుపరి సప్తమి | అనూరాధ నక్షత్రం రా. 1-36 వరకు తదుపరి జేష్ఠ | వర్జ్యం ఉ.6-45 నుంచి 08-15 వరకు | అమృత ఘడియలు: ఉ. 3-45 నుంచి 6-22 వరకు | దుర్ముహూర్తం: ఉ. 08-17 నుంచి 09-06 వరకు తిరిగి రా. 10-44 నుంచి 11-33 వరకు | రాహుకాలం: మ. 3-00 నుంచి 4-30 వరకు | సూర్యోదయం: ఉ.5-52 | సూర్యాస్తమయం: సా.6-00
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 22 Sep 2020 12:25 PM GMT
Visakha updates: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాసిన టీడీపీ ఎమ్మెల్యే గణబాబు..
విశాఖ..
-సంక్షేమ పథకాలు చంద్రన్న భీమా (ఇప్పుడు వైస్సార్ భీమా ), .భీమా అనేది గతంలో మాదిరిగా ప్రతి కుటుంబంలో పని చేసే ప్రతిఒక్కరికి అందాలి అంతే కానీ ఇంటికి ఒక్కరికే అనే వైఖరి సబబు కాదు
-మా ప్రాంతంలో మగవారు , ఆడవారు ఇద్దరు కూడా పనులకు వెళ్తారు, ఇంటి పెద్దకి మాత్రమే భీమా వర్తింపచేయాలని నిర్ణయం మార్చుకోవాలి
-డ్వాక్రా గ్రూపులు విషయంలో వైస్సార్ ఆశ్ర పేరిట రుణ మాఫీ గతంలో మాదిరిగా అందరికి సమానంగా వర్తించకుండా కొన్ని గ్రూపులకు ఎక్కువ ,కొన్ని గ్రూపులకు త్రక్కువ చేసి రుణ మాఫీ చేసారు
-మీ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ఏర్పడిన కొత్త గ్రూపులకు ఈ సంక్షేమ పథకాలు ఇంకా వర్తించటంలేదు
-ఇటీవల కాలంలో మొదట ఇసుక కొరత , విద్యుత్ చార్జీలు , కరోనా వలన అనేక పరిశ్రమలు చతికిలపడ్డాయి
-ఇటువంటి సమయంలో ప్రభుత్వం పన్నులు తగ్గించి ప్రజలకు ఉపశమనం కలిగించాలని ఇప్పటికే మీకు రెండుమార్లు లేఖ వ్రాయడం జరిగింది
-గత మూడు వారాలుగా రాష్టంలో రోజుకు కనీసం ఒక్కటి రెండు చోట్లయినా ప్రార్థన ప్రదేశాలపై దాడులు జరగడం దారుణం
-ఒక్క బాధ్యులను శిక్షించకపోగా , ఇప్పుడు రాష్ట్ర మంత్రి స్థాయిలో ఇటువంటి సంఘటనలను వక్రీకరించి ఒక మతాన్ని కించపరిచే విధంగా ఉన్నాయి
-ఇదే ప్రభుత్వ వైఖరి అనే విధంగా మీ మౌనం సందేశం ఇస్తుంది
- 22 Sep 2020 12:22 PM GMT
Vijayawada updates: వ్యవసాయ బిల్లులపై మోదీ సర్కారుకు ధన్యవాద తీర్మానం..
విజయవాడ..
-రాష్ట్ర పదాధికారుల సమావేశం లో బీజేపీ తీర్మానాలు.
-తిరుమల దర్శనం లో హోదాలకు సంబంధం లేకుండా, ఎవరైనా డిక్లరేషన్ ఇవ్వాలని బీజేపీ తీర్మానం
-హిందూ దేవలయాల రక్షణ విషయం లో పోరాటం కొనసాగించాలని సమావేశం లో నిర్ణయం
-తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో బీజేపీ- జనసేన తరుపున పోటీలో దిగాలని నిర్ణయం
-తిరుపతి ఉప ఎన్నికను సవాల్ గా తీసుకోవాలని నిర్ణయం
-టీటీడీ డిపాజిట్ లపైన బీజేపీ సమావేశం లో నిర్ణయం
-Ttd డిపాజిట్ లు మల్లింపు ప్రభుత్వ ఎత్తుగడ గా అభిప్రాయ పడ్డ నేతలు.
- 22 Sep 2020 12:16 PM GMT
East Godavari updates: అనపర్తి సూర్య శ్రీ థియేటర్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో అగ్నిప్రమాదం..
తూర్పుగోదావరి :
-సీలింగ్ కు వ్యాపించిన మంటలు గమనించి ఫైర్ స్టేషన్ కు సమాచారం ఇచ్చిన సిబ్బంది..
-ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసిన ఫైర్ సిబ్బంది..
- 22 Sep 2020 12:13 PM GMT
Visakha updates: జిల్లాలో ఇద్దరు కలెక్టర్లు ఉండగా ప్రభుత్వ పెద్దలు పనులు చేయడం కోసం కొత్తగా మూడో జె సి ని తీసుకువచ్చారు..అయ్యన్న పాత్రుడు..
విశాఖ..
మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు కామెంట్స్
-22 ఏ ప్రభుత్వ భూములు ఎన్ని ఫైలును ఇప్పటివరకు మీరు వచ్చిన తర్వాత నడిపించారు
-జె సీ వేణుగోపాల్ రెడ్డి వచ్చిన తర్వాత జిల్లాలో ఎక్కడ ఇసుక దొరకలేదు
-మైనింగ్ పర్మిషన్ ఇవ్వడానికి ఆయనే స్వయంగా ఆ ప్రాంతాల సందర్శించి కొలతలు వేయడం వెనక మర్మమేమిటి
-ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ఈ విషయాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది
- 22 Sep 2020 12:04 PM GMT
Kodali Nani Comments: నేను ఎవరికీ అదరను, బెదరను..కొడాలి నాని..
విజయవాడ..
హెచ్ఎంటీవీతో మంత్రి కొడాలి నాని ;
-తిరుమలలో డిక్లరేషన్ పై నేను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నాను..
-6 కోట్ల ప్రతినిధిగా ముఖ్యమంత్రి జగన్ బ్రహ్మోత్సవాలకు హాజరవుతున్నారు తప్ప వ్యక్తిగతంగా కాదు...
-స్వామి దర్శనానికి డిక్లరేషన్ అవసరమే లేదు
-విగ్రహాల ధ్వంసం పై నేను చేసిన వ్యాఖ్యల్ని టిడిపి, బీజేపీలు వక్రీకరించాయి.
-నేను హిందువుగా నా మతాన్ని అభిమానిస్తాను..ప్రజాప్రతినిధిగా ఇతర మతాల్ని గౌరవిస్తాను.
-హిందూమతానికి ద్రోహం అంటూ చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబే.
-చంద్రబాబు పూజలు చేయటం వల్లే అమరావతికి ఈ పరిస్థితి వచ్చింది.
-రఘురామకృష్ణం రాజు లాంటి వ్యక్తులు నాలుక కోస్తామంటున్నారు..ఇక్కడెవరూ ఖాళీగా లేరు.
-దుర్గగుడిలో సింహాల బొమ్మలు పోవటానికి అక్కడ సైకిల్ బెల్లులు ఎత్తుకెళ్లిన టిడిపి దొంగలే కారణం..
-విపక్షాలు మా ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయి.
- 22 Sep 2020 11:48 AM GMT
Vijayawada updates: కేశినేని నాని తమ్ముడి పేరిట మోసాలు..
విజయవాడ..
- ఎంపీ కేశినేని నాని తమ్ముడిని అంటూ డబ్బులు వసూలు చేసిన కేశినేని రమేష్
- HRM ఫైనాన్స్ ఎండీ, గెట్ వే హోటల్ పార్ట్ నర్ అంటూ పలువురిని బురిడీ కొట్టించిన కేశినేని రమేష్
- 3 కోట్లు రుణం పేరిట గుంటూరు జిల్లా నల్లపాడు స్థలంపై సేల్ డీడ్ చేస్తా అని దూడల ఋషికేశ్వర్ నుంచి 20 లక్షలు వసూలు చేసిన కేశినేని రమేష్
- 80 లక్షలు చెల్లని చెక్కు ఇచ్చి పరారైన కేశినేని రమేష్
- విజయవాడల పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు...
- 22 Sep 2020 11:45 AM GMT
Vijayawada updates: విజయవాడ బీసెంట్ రోడ్డులో హాకర్స్ మధ్య చెలరేగిన ఆధిపత్య పోరు...
విజయవాడ..
ఘర్షణ..
- రాళ్లు విసురుకున్న ఇరు వర్గాలు...
- జ్యుస్ దుకాణం, చెప్పుల వ్యాపారుల మధ్య ఈ ఉదయం చెలరేగిన ఘర్షన...
- చెప్పులు వేసుకుని దుకాణంలోకి రావద్దని చెప్పుల దుకాణ దారుడిని అడ్డుకున్న పండ్ల రసాల వ్యాపారి...
- ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం...
- ఒకరికొకరు రాళ్ళ దాడి చేసుకోవడం తో రంగంలోకి దిగిన పోలీసులు...నలుగురికి గాయాలు...
- ఇరువర్గాలకు చెందిన 8 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు...
- సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కార్యాలయం సమీపంలో ఘటన...
- 22 Sep 2020 11:42 AM GMT
Vijayawada-Durgamma updates: దుర్గమ్మ వెండి రథం ప్రతిమలు చోరీ కేసు..
విజయవాడ..
-శివాలయం దగ్గర పనులు చేసిన వర్కర్ల ను విచారిస్తున్న పోలీసులు
-పంజాబ్, మధ్యప్రదేశ్, బీహార్, యూపీల నుంచి వర్కర్లను తీసుకువచ్చిన తాపీ మేస్త్రి
-నలుగురు మెస్ర్టీల నుంచి వివరాలు సేకరిస్తున్న పోలీసులు
-లాక్ డౌన్ ముందు లాక్ డౌన్ తర్వాత 21 నెలల పాటు పనులు చేసిన కార్మికులు
- 22 Sep 2020 11:37 AM GMT
Srikakulam updates: చంద్రబాబు పై స్పీకర్ తమ్మినేని సీతారాం ఫైర్..
శ్రీకాకుళం జిల్లా..
తమ్మినేని సీతారాం..
-గతంలో పేదవాడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలంటే కాళ్ళు అరిగిపోయేలా తిరగాల్సి వచ్చేది..
-ఇప్పుడు ఆ పరిస్థితి లేదు..
-పేదవాడి ఇంటివద్దకే ప్రభుత్వ పథకాలు అందేలా సీఎం జగన్ పాలన వికేంద్రీకరణ చేశారు..
-30 లక్షల మందికి ఇళ్ళు ఇవ్వాలని ముఖ్యమంత్రి సంకల్పిస్తే..
-కళ్ళు, చెవులు లేని ప్రతిపక్షం కోర్టుకు పోయి అడ్డుకుంది..
-26 కేసుల్లో కోర్టుల నుంచి స్టే తెచ్చుకుని చంద్రబాబు బ్రతుకుతున్నారు..
-చంద్రబాబుని ఎప్పుడు మూసేస్తారో తెలియదు..
-ఎంతకాలం స్టేలు తెచ్చుకుంటారు..
-ఎంతకాలం 30 లక్షల మందికి ఇళ్ళు ఇవ్వకుండా ఆపుతారు..
-ఏదో ఒకరోజు ప్రజలు రోడ్డెక్కుతారు..
-అందుకే బాధ్యతగా వ్యవహరించండి..
- 22 Sep 2020 11:34 AM GMT
Vijayawada updates: రాష్ట్రం లో హిందువుల విశ్వాసాలను దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోంది..విష్ణువర్ధన్ రెడ్డి..
విజయవాడ..
విష్ణువర్ధన్ రెడ్డి, బీజేపీ ప్రధాన కార్యదర్శి
-రాష్ట్రం లో దేవాలయాల పై దాడుల వెనుక కుట్ర కనపడుతోంది.
-రుద్రాక్ష లతో ఒక స్వామీజీ గా మంత్రి కొడాలి నాని కనిపిస్తారు.
-మేడిపండు చందంగా కొడాలి ఆహార్యం ఉంటుంది.
-కొడాలి వ్యాఖ్యల వ్యక్తిగత వ్యాఖ్యలుగా చూడలేం.
-అంతర్వేది ఘటనలో కేసులు ఎత్తివేసేంతవరకు ప్రభుత్వాన్ని వదిలి పెట్టేది లేదు
-కేంద్ర పధకాల పేర్లను మార్చి గత ప్రభుత్వం మాదిరి ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది
-ఆంధ్రప్రదేశ్ ఎజెండానే బిజెపి ఎజెండా
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire