Live Updates: ఈరోజు (22 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు పంచాంగం
ఈరోజు గురువారం | 22 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | షష్టి మ.01-09 వరకు తదుపరి సప్తమి | మూల నక్షత్రం ఉ.07-22 వరకు తదుపరి పూర్వాషాఢ | వర్జ్యం: ఉ.05-50 నుంచి 07-22 వరకు తిరిగి సా.04-44 నుంచి 06-18 వరకు | అమృత ఘడియలు రా.02-05 నుంచి 04-12 వరకు | దుర్ముహూర్తం: ఉ.09-48 నుంచి 10-35 వరకు తిరిగి 02-28 నుంచి 03-15 వరకు | రాహుకాలం: మ.01-30 నుంచి 03-00 వరకు | సూర్యోదయం: ఉ.05-57 | సూర్యాస్తమయం: సా.05-35
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 22 Oct 2020 12:20 PM GMT
Visakha updates: గాజువాక లో ఏసీబీ అధికారులు తనిఖీలు..
విశాఖ
//గాజువాక షీలానగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు
//రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తి తమకు డాక్యుమెంట్ ఇవ్వలేదు అని , లంచం ఇవ్వనందుకే డాక్యుమెంట్ ఇవ్వలేదు అని స్పందన లో కంప్లయింట్
//దీని ఫై ఏసీబీ అధికారులు షీలానగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో తనిఖీలు
//డాక్యుమెంట్ ఫైల్ ఉండటం తో రిజిస్ట్రార్ మన్మధ రావు వివరణ అడిగిన ఏసీబీ dsp రంగరాజు
- 22 Oct 2020 12:14 PM GMT
East godavari updates: అంతర్వేదిలో నూతన రథం నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి..
తూర్పుగోదావరి
// మంత్రి చెల్లుబోయిన వేణు..
//ఎ.పి దేవాదాయశాఖ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో అంతర్వేదిలో నూతన రథం నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి
//25 రోజుల్లోనే రథం చక్రాలతోపాటు రెండు ఫ్లోర్ల నిర్మాణం పూర్తయ్యింది
//ఫిబ్రవరి నెలలో కళ్యాణోత్సవాలకు ముందే కొత్త రథం సిద్ధం కావాలనే భక్తుల కోరిక నెరవేరేలా పనులు జరుగుతున్నాయి
- 22 Oct 2020 10:52 AM GMT
Amaravati updates: నారా లోకేష్ అనంతపురం జిల్లా పర్యటన వివరాలు...
అమరావతి..
*రేపు అనంతపురం జిల్లా గుంతకల్లు, తాడిపత్రి, శింగనమల, రాప్తాడు నియోజకవర్గాల్లో పర్యటించనున్న టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్...
*భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలు పరిశీలించి నష్టపోయిన రైతులను పరామర్శించనున్న లోకేష్
*గుంతకల్ నియోజకవర్గం
*కరిడికొండ గ్రామం, గుత్తి మండలం
*తాడిపత్రి నియోజకవర్గం
*మిడుతూరు గ్రామం, పెదవడుగూరు మండలం
*శింగనమల నియోజకవర్గం
*రాందాస్ పేట గ్రామం, గార్లదిన్నె మండలం
*రాప్తాడు నియోజకవర్గం
*కామారుపల్లి గ్రామం, అనంతపురం రూరల్ మండలం
- 22 Oct 2020 10:39 AM GMT
Vijayawada updates: అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన శ్రీకాళహస్తి ఆలయ ఈవో చంద్రశేఖరరెడ్డి..
//చంద్రశేఖర్ రెడ్డి, ఈవో కాళహస్తి దేవస్థానం
//దసరా ఉత్సవాల్లో కాళహస్తి దేవస్థానం తరుపున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించము.
//అమ్మవారిని దర్శించుకోవడం చాలా సొంతోషంగా ఉంది.
//ఈ కరోనా మహమ్మారిని పరాతోలి ప్రజలు అందరు సుఖసంతోషాలతో ఉండాలి అని కోరుకున్నాము.
- 22 Oct 2020 10:09 AM GMT
Vijayawada durgamma updates: అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పణ...
విజయవాడ
*దసరా మహోత్సవాల సందర్భంగా కాళహస్తి దేవాలయం నుండి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పణ...
- 22 Oct 2020 10:07 AM GMT
Vijayawada updates: నాయిని మృతి పట్ల ఎపి గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ సంతాపం..
విజయవాడ:
*మాజీ మంత్రి నాయిని నరసింహ రెడ్డి మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసిన గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్
*నాయిని నరసింహరెడ్డి కార్మిక నాయకుడిగా తన జీవితాన్ని ప్రారంభించి ఆ తర్వాత రాజకీయాల్లో ఉన్నతస్థాయి కి చేరార ని గుర్తు చేసుకున్న గవర్నర్.
*దివంగత నాయిని ఆత్మ ప్రశాంతంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థించిన గవర్నర్,
*నరసింహ రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం .
- 22 Oct 2020 9:57 AM GMT
Nellore district updates: టీడీపీ కార్యాలయంలో అబ్దుల్ అజీజ్ మీడియా సమావేశం...
నెల్లూరు/:--
-- నెల్లూరు టీడీపీ కార్యాలయంలో పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ మీడియా సమావేశం.
--ప్రభుత్వ చేతగాని ఇసుక విధానాలవల్లే భవన నిర్మాణకార్మికులు రోడ్డున పడ్డారు..
-- ఇసుక పాలసీలో వైసీపీ నేతలు అందిన మేర దోచుకుంటున్నారు.
-- వైఎస్సార్ భీమా నగదును తగ్గించడం దారుణం.
-- టీడీపీ హయాంలో ఇచ్చిన నగదు, వయస్సును వైసీపీ ప్రభుత్వం తగ్గించేసింది.
- 22 Oct 2020 9:55 AM GMT
Vijayawada updates: రోడ్ సేఫ్టీ కోసం ఈ షెడ్యూల్ ఆధారంగా రేట్లు పెంచాం..
విజయవాడ
*హెచ్ఎం టీవీతో ఏపీ ట్రాన్స్‌పోర్ట్ జాయింట్ కమీషనర్, ప్రసాదరావు
*కేంద్ర ప్రభుత్వం చేసిన అమెండ్మెంట్ ద్వారా ఛార్జీలు పెంచాం
*నేరాలు చేసే వారి మీదే జరిమానాలు వసూలు చేస్తాం
*సామాన్యుడి పైన ఎలాంటి ప్రభావం చూపదు
*లారీ ఓనర్లు కూడా ఓవర్ లోడింగ్ జరిమానాలపై ఎలాంటి మార్పు చెప్పలేదు
*వాహనదారుల కంటే కూడా తయారీదారులకే వాహనాల మార్పులపై జరిమానాలు ఉంటాయి
*అన్ని ట్రాఫిక్ నిబంధనలు అనుసరిస్తే జరిమానాలు ఎలా ఉన్నా ఫర్వాలేదు
- 22 Oct 2020 9:52 AM GMT
Kurnool district updates: కలెక్టరేట్ ఎద్దుట రైతులు ఆందోళన!
కర్నూల్...
అధిక వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలంటూ రైతు సంఘాల ఆదర్యంలో కలెక్టరేట్ ఎద్దుట రైతులు ఆందోళన...
ఎకరాకు 25000 పంట నష్ట పరిహారం మరియు 2018 సంవత్సరం పంట నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్..
- 22 Oct 2020 9:50 AM GMT
Kurnool updates: జెఎసి విద్యార్టీ సంఘాల నాయకులు ఆందోళన!
కర్నూల్...
*డీఈఓ ఎస్ ఎస్ ఏ లో జరుగుతున్న అక్రమల పై విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ నగరంలోని కలెక్టరేట్ ఎదుట రాయలసీమ జెఎసి విద్యార్టీ సంఘాల నాయకులు ఆందోళన...
*జిల్లా విద్యాశాఖ కార్యాలయం అవినీతికి అడ్డగా మారిందని జెఎసి నాయకులు విమర్శించారు..
*ఔట్ సోర్సింగ్ రెగ్యులర్ ఉద్యోగుల పేరుతో అక్రమాలకు పాలు పడుతున్నారు..
*వెంటనే రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్ చొరవ తీసుకోవాలని డిమాండ్ ..
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire