Live Updates: ఈరోజు (22 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 22 అక్టోబర్, 2020 : హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు గురువారం | 22 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | షష్టి మ.01-09 వరకు తదుపరి సప్తమి | మూల నక్షత్రం ఉ.07-22 వరకు తదుపరి పూర్వాషాఢ | వర్జ్యం: ఉ.05-50 నుంచి 07-22 వరకు తిరిగి సా.04-44 నుంచి 06-18 వరకు | అమృత ఘడియలు రా.02-05 నుంచి 04-12 వరకు | దుర్ముహూర్తం: ఉ.09-48 నుంచి 10-35 వరకు తిరిగి 02-28 నుంచి 03-15 వరకు | రాహుకాలం: మ.01-30 నుంచి 03-00 వరకు | సూర్యోదయం: ఉ.05-57 | సూర్యాస్తమయం: సా.05-35
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 22 Oct 2020 3:08 PM GMT
Tirumala updates: శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ముగింపుదశకు చేరుకున్నయి...
తిరుమల...
*ఏడవ రోజు రాత్రి చంద్రప్రభవాహనంపై వెన్న కృష్ణుడి అలంకారంలో దర్శనమిచ్చిన శ్రీమలయప్పస్వామి వారు
*రేపు ఉదయం స్వర్ణ రథం బదులుగా సర్వభూపాల వాహనం నిర్వహించనున్న టీటీడీ
- 22 Oct 2020 2:58 PM GMT
Nimmakayala Chinarajappa: జగన్ అధికారంలోకి వచ్చాకా రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు పెరిగిపోయాయి..
తూర్పుగోదారి :
నిమ్మకాయల చినరాజప్ప....
--పెద్దాపురం ఎన్టీఆర్ కాలనిలో ఒరిస్సాకు చెందిన మహిళపై వైసీపీ నాయకుడు అత్యాచారాయత్నం కేసులో పోలీసుల తీరుపట్ల మాజీమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఫైర్....
--నిందితుడు రంగనాధం జీవాను అరెస్టు చెయ్యకుండా కేసును రాజీ చేసేందుకు పోలీసులు సహకరిస్తున్నారు..
--జీవాపై కేసు నమోదైనప్బటికి అధికారిక అక్షరాభ్యాసం కార్యక్రమంలో పాల్గొనేలా పోలీసులు సహకరించారు.
--డీజీపీ మాటలకు చేతలకు చాలా తేడా ఉంది.. కక్షసాధింపు చర్యలపై ఉన్న దృష్టి అత్యాచార నిందితులను అరెస్టు చెయ్యడంలో లేదు..
--ఇప్పటికైనా నిందితుడిని అరెస్టు చేసి బాధితురాలికి న్యాయం చేయాలి..
- 22 Oct 2020 2:47 PM GMT
Nellore district updates: ప్లాస్మా థెరపీ సెంటర్ ని పరిశీలించిన మంత్రి అనీల్..
నెల్లూరు :--
అనిల్ కుమార్ యాదవ్ ఇరిగేషన్ శాఖ మంత్రి...
*నెల్లూరు నగరంలోని రెడ్ క్రాస్ సంస్థలో ప్లాస్మా థెరపీ సెంటర్ ని పరిశీలించిన మంత్రి అనీల్
*కరనా సమయంలో నెల్లూరు రెడ్ క్రాస్ సంస్థ ఎన్నో కార్యక్రమాలు చెప్పటింది
*ప్లాస్మా డొనేషన్ లో దేశంలోనే రెండో స్థానంలో నిలవడం సంతోషించదగ్గ విషయం, భవిష్యత్తులో మొదటి స్థానానికి రావాలని కోరుకుంటున్న
- 22 Oct 2020 2:43 PM GMT
Telangana updates: విజయదశమి సందర్భంగా 26 అక్టోబర్ ను తెలంగాణ ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాలి..
#టీఎన్జీవో అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి రాయికంటి ప్రతాప్
#తెలంగాణ ప్రజలకు అత్యంత ప్రీతి పాత్రమైన పండుగ బతుకమ్మ, దసరా పండుగలు
#దసరా రోజు తమ స్వగ్రామాలకు వెళ్లి కుటుంబ సభ్యులతో కలిసి ,తల్లిదండ్రులు , పెద్దల ఆశీస్సులు తీసుకొని అత్యంత ప్రేమతో జరుపుకుంటారు.
#తెలుగు క్యాలెండర్ ప్రకారం విజయదశమి రోజు సోమవారం 26 అక్టోబర్ 2020 నాడు జరుపుకోవాల్సినదిగా ఆగమ శాస్త్ర పండితులు తెలియజేస్తున్నారు.
#విజయదశమి సోమవారం బదులు ఆదివారమే జరుపుకునేట్లు ఇప్పటికే సెలవు ప్రకటించి ఉన్నది.
#విజయదశమి సోమవారం జరుపుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం తమ ఉద్యోగులకు 26 అక్టోబర్ 2020 క్లోజ్డ్ సెలవు దినంగా ప్రకటించినంది.
#తెలంగాణ ప్రభుత్వం కూడా సోమవారం రోజు ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని విజ్ఞప్తి చేసాము.
# ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి సోమవారం సెలవు దినంగా ప్రకటించడం కోసం నిర్ణయం తెలియజేస్తామని హామి ఇచ్చారు.
- 22 Oct 2020 2:38 PM GMT
CPI Ramakrishna: భారీ వర్షాలకు రైతులు చాలా పంటలు నష్టపోయారు...
ప్రకాశం :
--సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ కామెంట్స్..
--రాష్ట్రంలో కృష్ణా, గోదావరి డెల్టా ప్రాంతంలో భారీ వర్షాలకు రైతులు చాలా పంటలు నష్టపోయారు..
--రైతులు దివాళా తీసే పరిస్థితి వచ్చినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంది..
--గత ఏడాది పంట నష్టపోయిన రైతులకు సీఎం జగన్ ఏరియల్ సర్వేలు మాత్రమే వెళ్తున్నారు కానీ స్వయంగా వెళ్లి పరిశీలించడం లేదు..
--వరదలకు నష్టపోయిన రైతులను ప్రభుత్వమే పూర్తిస్థాయిలో ఆదుకోవాలి..
--ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం నుండి రావాల్సిన నిధులను అడిగి తెచ్చుకునే పరిస్థితి లేదు..
--పోలవరంను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినా 55 వేల కోట్ల రూపాయలు కావాలని కోరితే తూతూమంత్రంగా నిధులు విదిలిస్తున్నారు..
--ఆర్థిక మంత్రి బుగ్గన గత ముఖ్యమంత్రి చంద్రబాబు సరిగ్గా నివేదికలు పంపలేదని చెప్తున్నారు..
--బుగ్గన ఇప్పుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అనుకుంటున్నట్లున్నారు..
--ఇళ్ల స్థలాలు ఎందుకు పెండింగ్ పెడుతున్నారో అర్ధం కావటం లేదు..
--పేదలకు సరిపడా స్థలంలో ఇల్లు నిర్మించి ఇవ్వాలి..
--మీరేమో భారీ సౌదాల్లో నివాసాలు ఉంటూ పేదలకు మాత్రం 44 గజాల్లో ఇల్లు కట్టుకోమంటున్నారు..
--అమరావతి రాజధానికి శంకుస్థాపన చేసి ఐదేళ్లయ్యింది..
--ఢిల్లీ కంటే పెద్ద నగరాన్ని నిర్మిస్తామన్న ప్రధాని మోదీ దీనిపై స్పందించాలి..
--శంకుస్థాపనలో పాల్గొన్న కేంద్ర నాయకులకు అమరావతి పై భాద్యత లేదా..
--సీఎం జగన్ అమరావతిని ధ్వంసం చేయాలని కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు..
--ఏపీ రాజధానిగా అమరావతి కొనసాగుతుందని కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయాలి..
- 22 Oct 2020 2:31 PM GMT
K Narayana: రెండు తెలుగు రాష్ట్రాల్లో వరద ఉధృతి తీవ్రంగా ఉంది..
ప్రకాశం :
*సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కామెంట్స్..
*భారీ వర్షాల వల్ల నష్టాన్ని కేంద్రం జాతీయ విపత్తుగా గుర్తించాలి..
*హైదరాబాద్ వరదల్లో కూడా ఓట్ల రాజకీయాలు చేయటం శవాలపై పేలాలు ఏరుకున్నట్లుగా ఉంది..
*కోవిడ్ పై ప్రధాని మోదీ రోజుకో మాట చెప్తూ ప్రజల్ని ఏమారుస్తున్నారు..
*కేంద్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించడం లేదు..
*వలస కూలీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి ఎటువంటి సాయం అందటం లేదు..
*కోవిడ్ సమయంలో ట్యాక్సులు రద్దు చేయటం వల్ల కార్పొరేట్ సెక్టార్ ఒక్కటే బాగుపడింది..
*కేంద్రం కేవలం అంబానీలు, ఆధానీల కోసమే పనిచేస్తుంది..
*ట్రంప్, మోదీ ఇద్దరి నాటకాలు చూస్తుంటే ప్రపంచ ఉత్తమ కళాకారులుగా మించి పోతున్నారు..
*వ్యవసాయం మీద కేంద్రం తీసుకు వచ్చిన బిల్లులు రైతులకు అత్యంత ప్రమాదకరంగా మారుతున్నాయి..
*విద్యుత్ ను ప్రయివేటికరించటం వల్ల పబ్లిక్ సెక్టార్ పూర్తిగా దెబ్బతింటుంది..
*రాష్ట్రాలకు రావాల్సిన జీఎస్టీ మొత్తాన్ని కూడా రాష్ట్రాలకు ఇవ్వకుండా ఫెడరల్ స్ఫూర్తిని దెబ్బ తీస్తున్నారు..
*కేంద్రం ప్రజలకు వ్యతిరేకంగా తీసుకువచ్చే బిల్లులను జగన్ వ్యతిరేకించడం లేదు..
*కేంద్రం అడక్కుండానే పార్లమెంటులో వారు ప్రవేశపెట్టిన బిల్లులకు మద్దతునిస్తున్నారు..
*దేశంలో మత రాజకీయల బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకోవాలని చూస్తుంది..
*రాజ్యాంగానికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాదకరంగా మారబోతున్నారు..
- 22 Oct 2020 1:10 PM GMT
Vijayawada updates: బెజవాడలో టర్కీ కరెన్సీ పట్టివేత!
విజయవాడ
--ముఠాను పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు
--నిందితుల దగ్గర 3 కోట్లు విలువ చేసే టర్కీ కరెన్సీ స్వాధీనం
--విజయవాడ అజిత్ సింగ్ నగర్ పరిధిలో టర్కీ కరెన్సీ కలిగి ఉన్న ఐదుగురు వ్యక్తులని అదుపు లోకి తీసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు...
--ముఠా సభ్యుల నుండి సుమారు రూ 3 కోట్లు ఖరీదు చేసే టర్కీ కరెన్సీ స్వాధీనం
--ముఠాకి చెందిన ఇన్నోవా కారు, ఓలా ధ్విచక్రవాహనం, 5 సెల్ ఫోన్లు స్వాధీనం..
- 22 Oct 2020 1:07 PM GMT
Vijayawada durgamma updates: టీటీడీ నుంచి అమ్మవారికి పట్టువస్త్రాలు...
విజయవాడ
//పాలకమండలి సభ్యులు, MLA పార్థసారథి టీటీడీ పట్టువస్త్రాలు సమర్పన.
//పార్థసారథి, టీటీడీ బోర్డ్ మెంబర్
//నవరాత్రుల సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం తరుపున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించము.
//అమ్మవారిని దర్శించుకోవడం చాలా సొంతోషంగా ఉంది.
//అమ్మవారి దీవెన, వేంకటేశ్వర స్వామి అసిస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి.
//అమ్మవారు, వేంకటేశ్వరస్వామి ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలి.
//ఇంకా మెరుగైన పాలన సీఎం జగన్ ప్రజలకు అందించాలి అని కోరుకున్నాము.
//ఈ కరోనా మహమ్మారిని పారద్రోలి ప్రజలు అందరు సుఖసంతోషాలతో ఉండాలి అని కోరుకున్నాము.
- 22 Oct 2020 12:38 PM GMT
Vijayawada updates: చెక్కు పంపిన సీఎం జగన్!
విజయవాడ
-చెప్పిన 48 గంటల్లోనే చెక్కు పంపిన సీఎం జగన్
-సీఎం జగన్ ఉదారతకు కృతజ్ఞతలు తెలిపిన దివ్య తలిదండ్రులు జోసెఫ్, కుసుమ
-ప్రభుత్వం తరఫున పదిలక్షల చెక్కు అందజేసిన దేవినేని అవినాష్
-విజయవాడ తూర్పు నియొజకవర్గ వైసీపీ ఇంఛార్జ్, దేవినేని అవినాష్
-సీఎం జగన్ దివ్య తేజస్విని తలిదండ్రులకు భరోసా ఇచ్చారు
-సీఎం జగన్ ప్రకటించిన పదిలక్షల చెక్కు దివ్య తలిదండ్రులకు అందజేసాం
-చక్కగా చదువుకునే దివ్య జీవితం నాశనం చేసిన నాగేంద్రకు కఠిన శిక్ష పడుతుంది
-ప్రభుత్వం తరఫున, పార్టీ తరఫున అండగా ఉంటాం
-దివ్య తండ్రి, జోసెఫ్
-సీఎం జగన్ చేసిన సహాయం మరువలేనిది
-మా బాధను విని మాకు సీఎం జగన్, హోంమంత్రి సుచరిత మాకు ధైర్యాన్నిచ్చారు
-ఆరోజు నుంచీ ఈరోజు వరకూ అందరూ మాకు అండగా ఉన్నారు
- 22 Oct 2020 12:24 PM GMT
Amaravati updates: ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు ఏమి చేశారు..
అమరావతి...
* మంత్రి బొత్స సత్యనారాయణ
* అమరావతి శంకుస్థాపన చేసి ఐదు సంవత్సరాలు అయిందని పాదయాత్ర చేశారు
* ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరం ఏడు నెలలు అయ్యింది
* చంద్రబాబు కరకట్ట రోడ్డు కూడా వేసుకోలేక పోయారు
* సచివాలయ భావనలకు స్క్వేర్ ఫీట్ కు పది వేలు కర్చు చేసి తాత్కాలికం అన్నారు
* చంద్రబాబు ఆవేదన అంత తన బినామీలు, బందువులు, చుట్టలా కోసమే
* ఇన్సైడర్ ట్రేడింగ్ వల్ల ఉపయోగం లేకుండా పోయింది అని చంద్రబాబు ఆవేదన
* చంద్రబాబు అమరావతి కనీసం 50 శాతం పూర్తి చేసినా బాగుండేది కేవలం 5 శాతం మాత్రమే పూర్తి చేశారు
* జగన్ మళ్లీ సీఎం కావాలని అందరూ కోరుతుంటే... ఇదే మాకు ఆఖరి చాన్స్ అని చంద్రబాబు అంటున్నారు
* అమరావతి పోరాటం అసలు ఎక్కడ జరిగింది?
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire