Live Updates: ఈరోజు (సెప్టెంబర్-21) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు పంచాంగం
ఈరోజు సోమవారం | 21 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | చవితి ఉ. 7-41వరకు పంచమి తె. 5.24వరకు తదుపరి షష్ఠి | విశాఖ నక్షత్రం తె. 3-06 వరకు తదుపరి అనూరాధ | వర్జ్యం ఉ.9-54 నుంచి 11-24 వరకు | అమృత ఘడియలు: సా. 6-52 నుంచి 8-22 వరకు | దుర్ముహూర్తం: మ. 12-18 నుంచి 1-07 వరకు తిరిగి 2-43 నుంచి 3-32 వరకు | రాహుకాలం: ఉ. 7-30 నుంచి 9-00 వరకు | సూర్యోదయం: ఉ.5-52 | సూర్యాస్తమయం: సా.5-57
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 21 Sep 2020 9:44 AM GMT
Hyderabad updates: ఓపెన్ నాలాల పై క్యాపింగ్ నిర్మాణానికి 300 కోట్లతో ప్రత్యేక కార్యక్రమం..
పత్రికా ప్రకటన..
మంత్రి కే తారకరామారావు..
-హైదరాబాద్ ఓపెన్ నాలాల పై క్యాపింగ్ (capping) (బాక్స్ డ్రైనేజీల) నిర్మాణానికి 300 కోట్లతో ప్రత్యేక కార్యక్రమం
-రెండు మీటర్ల కన్న తక్కువ వెడల్పు ఉన్న నాళాల్ని క్యాపింగ్ (బాక్స్ డ్రైనేజీల నిర్మాణం) చేస్తాం అన్న మంత్రి కేటీఆర్
-రెండు మీటర్ల కన్నా వెడల్పు అయిన నాలల పైన గ్రీ న్ ట్రిబ్యునల్ మరియు సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు
- 21 Sep 2020 9:40 AM GMT
Ponnam Prabhakar Comments: కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వ్యవసాయ బిల్లులు పూర్తిగా వ్యవసాయ, రైతు వ్యతిరేక బిల్లులు..పొన్నం ప్రభాకర్..
పొన్నం ప్రభాకర్.. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్.
-కార్పొరేట్లకు అండగా నిలబడేందుకు దేశంలోని రైతుల ప్రయోజనాలు పణంగా పెట్టి పార్లమెంట్ లో రాజ్యాంగ విరుద్దంగా ప్రభుత్వం బిల్లులను ఆమోదించుకుంది..
-12 రాజకీయ పార్టీ లు వ్యతిరేకిస్తున్న మూజువాణి ఓటు తో ప్రభుత్వం బిల్లులు ఆమోదింప జేయడం రాజ్యాంగ విరుద్ధం..
-రైతులకు నిజంగా మేలు చేయాలని ఉంటే భూముల పరీక్షలు చేయాలి. నాణ్యమైన విత్తనాలు అందజేయాలి, ఎరువుల ధరలు తగ్గించాలి అలా కాకుండా తన కార్పొరేట్ మిత్రులకు దేశంలోని వ్యవసాయాన్ని అందించాలనే లక్ష్యంతో మోడీ వ్యవసాయ బిల్లులు తెచ్చారు..
-బిల్లుల విషయంలో తన మిత్ర పక్షం కూడా వ్యతిరేకించి మంత్రి పదవికి కూడా రాజీనామా చేసింది..
-పంజాబ్, హర్యానా లో రైతులు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నారు, రైతుల వ్యతిరేక బిల్లును ప్రభుత్వం వెంటనే ఉపశరించుకోవాలి..
-క్షేత్ర స్థాయిలో రైతులతో కలిసి ఉద్యమాలు చేస్తాం...రైతుల హక్కులను, ప్రయోజనాలకు భంగం కలిగించే ఏ చర్యను కాంగ్రెస్ సమర్థించదు..
-ఎట్టి పరిస్థితులలో బీజేపీ రైతు వ్యతిరేక విధానాలపై ఉద్యమించి ప్రభుత్వ చర్యలను అడ్డుకుంటాం.
- 21 Sep 2020 9:33 AM GMT
Yadadri updates: చౌటుప్పల్ లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై టిఆర్ఎస్ కార్యకర్తలతో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అవగాహన కార్యక్రమం....
యాదాద్రి :
-పల్ల రాజేశ్వర్ రెడ్డి కామెంట్స్..
-దేశం లోనే ఇంటింటికీ నీళ్లు ఇచ్చిన ఘనత తెలంగాణ లో టిఆర్ఎస్ ప్రభుత్వమని, ఈ విషయం పార్లమెంట్ లోనే కేంద్ర మంత్రి వెల్లడించారు.
-మునుగోడు లో సాగు నీటి ప్రాజెక్టు లు త్వరలోనే వేగంగా పూర్తి చేస్తాం.
-దేశంలోని అత్యధికంగా పంటలు పండించిన రాష్ట్రం తెలంగాణ..
-టిఆర్ఎస్ పాలన లో రాష్ట్రంలో సంక్షేమ పథకాలు పార్టీలకు అతీతంగా అందుతున్నాయి.
-దేశంలోని అన్ని రాష్ట్రాలకంటే అన్ని రంగాలలో తెలంగాణ ముందుంది.
-రాష్ట్రంలో ఏ ఎన్నిక వచ్చిన టిఆర్ఎస్ గెలుస్తుంది. రాబోయే పట్టభద్రుల శాసన మండలి ఎన్నిక లలో కూడా టిఆర్ఎస్ అభ్యర్థి గెలుపు ఖాయం.
-ప్రతి ఒక్క టిఆర్ఎస్ కార్యకర్త గ్రామాలలోని పట్టభద్రులు ఓట్లు నమోదు చేసుకునే విధంగా టిఆర్ఎస్ కార్యకర్తలు కృషి చేయాలి.
- 21 Sep 2020 9:26 AM GMT
Sripada Yellampalli project updates: శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుండి బారీగా చేరుతున్న వరదనీరు..
మంచిర్యాల శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు:
-ప్రస్తుతం నీటిమట్టం 147.56
-గరిష్ట నీటిమట్టం148.00 M
-ప్రస్తుతం నీటి నిల్వ 18.9529
-పూర్తి స్థాయి నీటినిల్వ 20.175 TMC*
-ఇన్ ప్లో :206409 c/s*
-ఇరవై గేట్లను ఎత్తి 206409 క్యూసెక్కుల నీటిని బయటకు వదులుతున్నా అదికారులు
- 21 Sep 2020 8:40 AM GMT
KTR Meeting on Rainfall: వర్షాలపైన మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సమీక్ష సమావేశం..
హైదరాబాద్..
# హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రంలోని పురపాలక పట్టణాల్లో ఉన్న పరిస్థితులపై ఆరా
# ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు
# రానున్న రెండు వారాలపాటు అధికారులకు సెలవులు రద్దు
#నిరంతరం క్షేత్రంలో ఉంటూ ఆకస్మిక తనిఖీలు చేస్తూ పర్యవేక్షణ చేయాలని సూచన
# కేవలం పది రోజుల్లోనే యాభై నాలుగు సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైందని తెలిపిన అధికారులు
# భారీ వర్షంలోనూ సాధ్యమైనన్ని ఎక్కువ సహాయక చర్యలు చేపడుతున్నామన్న అధికారులు
# వర్షాలకు పాడైన రోడ్ల మరమ్మత్తుల పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆదేశం
#వర్షాలు తగ్గగానే అన్ని మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలను మరింతగా పెంచాలి
#మున్సిపల్ శాఖ, జిహెచ్ఎంసి, జలమండలి ఉన్నత అధికారులతో మంత్రి సమీక్ష.
- 21 Sep 2020 7:34 AM GMT
Kamareddy District updates: కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో ఇంటి పన్ను వసూలు చేసే మహిళా ఉద్యోగి రోజా పై మరో ఉద్యోగి దాడి...
కామారెడ్డి :
-మహిళా ఉద్యోగి రోజా కు తీవ్ర గాయాలు..
-దాడి చేసిన ఉద్యోగి బోధన్ మున్సిపల్ లో సీనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న రామకృష్ణ .
-గతంలో కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేసిన రామకృష్ణ. దాడి చేసిన రామకృష్ణుని అదుపులోకి తీసుకున్న పోలీసులు.
- 21 Sep 2020 7:27 AM GMT
Telangana Latest news: మోడీ ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లుతో కెసిఆర్ ఉలిక్కిపడ్డాడు..ధర్మపురి అరవింద్..
ధర్మపురి అరవింద్, బిజెపి ఎంపీ..
-రైతు పండించిన పంట కోరిన మార్కెట్లో అమ్ముకునే అవకాశం కల్పించే ఈ బిల్లు రైతుల పాలిట వరం.
-అదే రోజు రైతుకు డబ్బు చెల్లించే విధానాన్ని కొత్త బిల్లు కల్పిస్తుంది.
-మార్కెట్ యార్డ్ ఫీజు, మధ్యవర్తుల కమిషన్లు లేకుండా రైతుకు 5 శాతం డబ్బు మిగిలేలా ఈ బిల్లు చూస్తుంది.
-కెసిఆర్ ఫామ్ హౌస్ లో పండించే పంటలు రిలయన్స్ వంటి కార్పొరేట్ల తో ఒప్పందం చేసుకొని అమ్మట్లేదా.
-కెసిఆర్ లాగా రైతు కూడా కార్పొరేట్ల తో ఒప్పందం చేసుకుని అమ్ముకోవద్ధా?
-కెసిఆర్ కి బిల్లులోనీ మంచి విషయాలు తెలిసినప్పటికీ రైతులను మభ్య పెట్టే అబద్ధాల గురువు గా మారాడు.
-KST టాక్స్ తగ్గుతుందనే బాధ తోనే వ్యవసాయ బిల్లును వ్యతిరేకిస్తున్నారు.
-కెసిఆర్ అడుగులకు మడుగు లోత్తకుండా కేశవరావు తన స్థాయిని నిలబెట్టుకోవాలి.
- 21 Sep 2020 5:10 AM GMT
Nizamabad updates: మహారాష్ట్ర నుంచి జిల్లాకు అక్రమంగా దేశీ దారు రవాణా..
నిజామాబాద్ :
-కోప్పర్గ- నీలా రహదారి పై పోలీసుల తనిఖీల్లో 48 దేశిదారు మద్యం పట్టివేత.
-అక్రమంగా దేశిదారు తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్.
- 21 Sep 2020 5:08 AM GMT
Nizam Sagar Project updates: నిజాం సాగర్ ప్రాజెక్టు కు స్వల్పంగా కొనసాగుతున్న వరద..
కామారెడ్డి :
-1428 క్యూసెక్కుల మేర ఇన్ ఫ్లో..
-పూర్తి స్థాయి నీటి మట్టం 1405 అడుగులు..
-ప్రస్తుతం 1392 అడుగులకు చేరుకున్న నీటి మట్టం..
-ఐదు టి.ఎం.సి లకు చేరిన నీటి నిల్వ..
-రైతుల్లో చిగురిస్తున్న ఆశలు..
- 21 Sep 2020 4:57 AM GMT
Sriram Sagar Project updates: శ్రీరాం సాగర్ ప్రాజెక్టు కు కొనసాగుతున్న వరద..
నిజామాబాద్..
-ఇన్ ఫ్లో 134 364 క్యూసెక్కులు
-ఔట్ ఫ్లో 134364 క్యూసెక్కులు
-పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులకు చేరిన జలాశయం
-32 వరద గేట్లు ఎత్తి 1 12500 క్యూసెక్కుల దిగువకు విడుదల.
-కాలువల ద్వారా కూడా కొనసాగుతున్న ఔట్ ఫ్లో
-గోదావరి లోకి 54 టీఎంసీ లు విడుదల..
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire