Live Updates: ఈరోజు (సెప్టెంబర్-21) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 21 సెప్టెంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు సోమవారం | 21 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | చవితి ఉ. 7-41వరకు పంచమి తె. 5.24వరకు తదుపరి షష్ఠి | విశాఖ నక్షత్రం తె. 3-06 వరకు తదుపరి అనూరాధ | వర్జ్యం ఉ.9-54 నుంచి 11-24 వరకు | అమృత ఘడియలు: సా. 6-52 నుంచి 8-22 వరకు | దుర్ముహూర్తం: మ. 12-18 నుంచి 1-07 వరకు తిరిగి 2-43 నుంచి 3-32 వరకు | రాహుకాలం: ఉ. 7-30 నుంచి 9-00 వరకు | సూర్యోదయం: ఉ.5-52 | సూర్యాస్తమయం: సా.5-57
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 21 Sep 2020 12:30 PM GMT
Nizamabad updates: వర్ని తహసీల్దార్ కార్యాలయం ఎదుట CITU ఆధ్వర్యంలో నిరహార దీక్ష..
నిజామాబాద్ జిల్లా:
-నిజామాబాద్ జిల్లా వర్ని తహసీల్దార్ కార్యాలయం ఎదుట CITU ఆధ్వర్యంలో నిరహార దీక్ష
-శాసనసభలో ఆశా వర్కర్ల సమస్యలపై చర్చించాలని డిమాండ్ చేస్తూ,
-వర్ని తహసీల్దార్ కార్యాలయం ఎదుట CITU ఆధ్వర్యంలో నిరహార దీక్షలు చేపట్టారు
- 21 Sep 2020 12:28 PM GMT
Telangana updates: తెలుగుదేశం పార్టీ జాతీయ కమిటీ తో పాటు తెలంగాణ రాష్ట్ర కమిటీని ప్రకటించే అవకాశం..
-ఈనెల 27న తెలుగుదేశం పార్టీ జాతీయ కమిటీ తో పాటు తెలంగాణ రాష్ట్ర కమిటీని ప్రకటించే అవకాశం..
-ఎల్ రమణ అధ్యక్షులు గా దాదాపు 80 మందితో కూడిన రాష్ట్ర కమిటీ జాబితా సిద్ధం..
-ఆఖరి ప్రయత్నం చేస్తున్న ఎల్ రమణ వ్యతిరేక వర్గం.
-ఏడేళ్లుగా ఒక్కడే అదేక్షుడిగా ఉండడంతో పార్టీలో భారీగా వెతిరేకిస్తున్న నేతలు.
- 21 Sep 2020 12:25 PM GMT
Telangana ESI Scam Updates: దేవికారాని కి బెయిల్ మంజూరు చేసిన ఏసీబీ కోర్ట్.
ఈఎస్ఐ స్కామ్ అప్ డేట్స్....
-ఇన్సూరెన్స్ మెడికల్ స్కామ్ కేసులో దేవికారాని కి బెయిల్ మంజూరు చేసిన ఏసీబీ కోర్ట్..
-దేవికారాని తో పాటు జాయింట్ డైరెక్టర్ పద్మ, ఫార్మసీస్ట్ వసంత, మరో ఇద్దరు ఫార్మా ఉద్యోగుల కు బెయిల్ ఇచ్చిన ఏసీబీ కోర్ట్...
- 21 Sep 2020 12:03 PM GMT
Hyderabad updates: త్రిదండి చినజీయర్ స్వామిని కలిసిన మంత్రి వేణుగోపాలకృష్ణ..
హైదరాబాద్..
-హైదరాబాద్ లో త్రిదండి చినజీయర్ స్వామిని కలిసిన ఆంద్రప్రదేశ్ బీసి వెల్పేర్ మంత్రి వేణుగోపాలకృష్ణ.
-రాష్ట్రంలో ప్రస్తుత పరిస్ధితులను అడిగి తెలుసుకున్న చినజీయర్ స్వామి.
-అనంతరం చినజీయర్ స్వామి ఆశీస్సులు తీసుకున్నమంత్రి వేణుగోపాలకృష్ణ.
- 21 Sep 2020 11:49 AM GMT
Komaram Bheem: కుమ్రంబీమ్ జిల్లా పెంచికల్ పెట మండలం గూడెం లో పోలీసుల అప్రమత్తత..
కుమ్రంబీమ్ జిల్లా..
-మావోయిస్టులు సరిహద్దు దాటకుండా బారీగా పోలీసు బలగాల మోహరింపు..
-ప్రాణహిత సరిహద్దు ప్రాంతంలో కోనసాగుతున్నా కూంబింగ్..
-తప్పించుకున్న మావోయిస్టు నాయకుడు బాస్కర్, కమీటి సభ్యులు పారిపోకుండా బలగాల మోహరింపు
- 21 Sep 2020 11:45 AM GMT
Hyderabad updates: కృష్ణ కుమార్ తో సమావేశమైన మాజీ ఎంపీ నగేష్, పార్టీ అధికార ప్రతినిధి బాలూరి గోవర్ధన్ రెడ్డి..
హైదరాబాద్..
-హైదరాబాద్ లో హైవే అథారిటీ ఇండియా రీజినల్ ఆఫీసర్ కృష్ణ కుమార్ తో సమావేశమైన మాజీ ఎంపీ నగేష్, పార్టీ అధికార ప్రతినిధి బాలూరి గోవర్ధన్ రెడ్డి
- ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలోని 44వ జాతీయ రహదారులపై సర్వీస్ రోడ్, స్లీప్ రోడ్ల నిర్మాణం చేపట్టాలని కోరిన మాజీ ఎంపి
-సర్వీస్ రోడ్డు, స్లీప్ లు లేకపోవడం ప్రమాదాలు జరుగుతున్నాయి
-పనులు చేపట్టాలని వినతి పత్రం ఇచ్చిన. మాజీ ఎంపి
- 21 Sep 2020 11:41 AM GMT
Youth Congress Elections: యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో భారీ స్కామ్..
యూత్ కాంగ్రెస్ నేతలు..
-ఏజెన్సీలను కొనుగోలు చేసి మెంబర్ షిప్ చేసారని ఆరోపిస్తున్న సీనియర్ నేతలు.
-నలుగురు ప్రెసిడెంట్ అభ్యర్థులకు గట్టి పోటీ ఉండడంతో లక్షల్లో మెంబర్ చేసిన యూత్ కాంగ్రెస్ నేతలు.
-నిన్నతో మెంబర్ తేదీ ముగియడంతో ఆధారకార్డు ఉంటేనే మెంబర్ షిప్ అనుమతించాలని డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేతలు.
-స్క్రోట్ని లో ఆధార్ కార్డు లింక్ లేకుండా మెంబర్ షిప్ రద్దు చేయాలని డిమాండ్.
-ఓ మాజీ కేంద్ర మంత్రి పార్టీ గాంధీ భవన్ లో అభ్యంతరం.
-టీపీసీసీ ఈ సమస్య పరిష్కరించకపోతే అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని హెచ్చరిక.
- 21 Sep 2020 11:17 AM GMT
CM KCR Comments: రెవెన్యూ రికార్డులను పారదర్శకంగా నిర్వహించడానికి ‘ధరణి‘ పోర్టల్ రూపకల్పన జరగాలని సీఎం కెసిఆర్ ఆకాంక్షించారు.
సీఎం కెసిఆర్..
-దేశంలోనే మొదటి సారిగా, విప్లవాత్మకంగా చేపట్టిన రెవెన్యూ సంస్కరణల్లో భాగంగా..
-రెవెన్యూ రికార్డులను పారదర్శకంగా నిర్వహించడానికి ‘ధరణి‘ పోర్టల్ రూపకల్పన జరగాలని సీఎం కెసిఆర్ ఆకాంక్షించారు.
-ధరణి పోర్టల్ రూపకల్పన పై మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు.
-అధికారులు ఈ సమావేశానికి సమగ్ర సమాచారం తో రావాలని సీఎం కెసిఆర్ ఆదేశించారు.
- 21 Sep 2020 10:59 AM GMT
Telangana updates: టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తోన్న సొంత పార్టీ నేతలు..
టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ..
-ప్రస్తుత టీటీడీపీ అధ్యక్షుడిని మార్చాలని డిమాండ్
-తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని మార్చాలని ఇప్పటికే చంద్రబాబును కోరిన పలువురు సీనియర్లు
-నాయకత్వ మార్పుపై జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు లేఖ
-7ఏళ్లుగా ఒక్కరే అధ్యక్షుడిగా ఉండటంతో పార్టీ పరిస్థితి దిగజారుతోదంటోన్న పలువురు నాయకులు
-తమ జీవితాలతో ఆడుకోవద్దంటోన్న పలువురు నేతలు
-నాయకత్వ మార్పు కోరుతూ.. చంద్రబాబుకు లేఖ రాసిన పార్లమెంటు పార్టీ ఇంఛార్జ్ లు, పలువురు నేతలు
- 21 Sep 2020 9:50 AM GMT
Telangana Jana Samithi: యువజన విద్యార్థి జన సమితిల కార్యాచరణ ప్రణాళిక..కోదండరాం..
టీజేఏస్ రాష్ట్ర అధ్యక్షులు కోదండరాం ఆదేశాల మేరకు __
-YJS & VJS సంయుక్తంగా నిరుద్యోగ సమస్య పరిష్కారం కొరకు ఈ నెల 21 న "హాలో నిరుద్యోగి _ ఛలో అసెంబ్లీ" కార్యక్రమానికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే...
-ఈ సందర్భంలో నిన్న (సెప్టెంబరు 19 న) యువజన, విద్యార్థి జన సమితి రాష్ట్ర ముఖ్య నాయకుల సమావేశం జూమ్ లో జరిగింది...
-నిరుద్యోగ సమస్యపై భవిష్యత్తులో చేసే పోరాటంపై కూలంకషంగా చర్చించడం జరిగింది...
-పట్టభద్రుల ఎన్నికలలో నిరుద్యోగ అంశం ప్రధాన ఎజెండా ఉంచడం కోసం, ఎన్నికల వరకు నిరుద్యోగ సమస్యపై వరుస నిరసన కార్యక్రమాలు చేయాలనే మెజార్టీ అభిప్రాయాలు రావడం జరిగింది...
-ఈ కార్యాచరణలో భాగంగా కొన్ని నిరసన కార్యక్రమాలను చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ...
-సెప్టెంబరు 22, 23, 24 తేదీలలో రెండవ విడత నిరుద్యోగుల బతుకుదెరువు సాధన యాత్ర చేయడం....
-సెప్టెంబరు 26 వ తేదీన రాష్ట్ర కార్యాలయంలో "నిరుద్యోగుల నిరసన దీక్ష" చేయడం. దీనికి కొనసాగింపుగా ఇదే రోజు అన్నీ జిల్లాలో నిరసన దీక్ష చేయడం....
-సెప్టెంబరు 27 నుండి అక్టోబర్ 1 వరకు "నిరుద్యోగుల శాంతి ర్యాలీ" విజయవంతం చేయడం కోసం ప్రచారం...
-గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2 న హైదరాబాదులో శాంతి ర్యాలీ....
-అక్టోబర్ 3 లేదా 4 న మళ్లీ YJS, VJS ముఖ్య నాయకులతో సమావేశం. భవిష్యత్తు కార్యాచరణ రూపకల్పన...
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire