Live Updates: ఈరోజు (21 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు పంచాంగం
ఈరోజు బుధవారం | 21 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | పంచమి మ.02-47 వరకు తదుపరి షష్టి | జేష్ఠ నక్షత్రం ఉ.08-21 వరకు తదుపరి మూల | వర్జ్యం: సా.04-02 నుంచి 05-34 వరకు | అమృత ఘడియలు రా.01-14 నుంచి 02-52 వరకు | దుర్ముహూర్తం: ఉ.11-23 నుంచి 12-10 వరకు | రాహుకాలం: మ.11-23 నుంచి 12-10 వరకు | సూర్యోదయం: ఉ.05-57 | సూర్యాస్తమయం: సా.05-35
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 21 Oct 2020 12:17 PM GMT
Vijayawada updates: అపోలో హాస్పిటల్ నుంచి డిఛార్జ్ అయిన మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు..
విజయవాడ..
//మంత్రి వేలంపల్లి..
//ఇటీవల మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ అపొలో హాస్పటల్ లో చేరిన మంత్రి
//నాపై అభిమానం తో నాకు అండగా నిలిచిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మరియు సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు అభిమానులకు పెరు పేరున ధన్యవాదాలు
//అమ్మ వారి కృపతో కోవిడ్ మహమ్మారి నుండి క్షేమంగా బయటపడ్డాను,,
- 21 Oct 2020 12:12 PM GMT
Anantapur updates: జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రెస్ మీట్!
అనంతపురం:
//రాష్ట్రంలో జరుగుతుందని పడుకున్న వాళ్లను తీసుకు వెళ్లి లోపల వేశారు.
//కర్ణాటక లో ఎందుకు లోకాయుక్త లో వేశారు.
//రాష్ట్రంలో హక్కుల ఉల్లంఘన జరుగుతుంది
//రాష్ట్రానికి, మరో రాష్ట్రానికి న్యాయం తేడా గా ఉంది.
//ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి స్వయంగా అక్కడ కేసు వేశారు
//రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు
//నా పేరుతో వాహనాలు లేవు... నాపై ఎలా కేసులు పెడతారు
//మాది ప్రొఫెషనల్ ట్రాన్స్పోర్టర్స్... అనవసరంగా కేసులు పెడుతున్నారు.
//ఇక్కడ బతకానీయకపోతే మరోచోటకు వెళతారు.
//ఇక్కడి లాగా కర్ణాటక లో జరగదు.. అక్కడ ప్రొసీజర్ ఫాలో అవుతారు.
//ఇక్కడ ఏమి చేయకపోయినా కేసులు పెట్టి లోపల వేస్తున్నారు.
//కేంద్ర ప్రభుత్వ చట్టాలు అందరికీ ఒకేలా ఉంటాయి
//28 శాతం జిఎస్టీ కట్టి వాహనాలు కొనుగోలు చేసాం
//స్పెషల్ స్టేటస్ వున్న రాష్ట్రల్లో పన్ను మినహాయింపు వుంటుంది. అందుకే ఆ రాష్ట్రాల్లో వాహనాలు కొనుగోలు చేస్తున్నాం.
//అశోక్ లే లాండ్ వాళ్ళను ఎందుకు విచారించడం లేదు.
- 21 Oct 2020 12:03 PM GMT
Visakha updates: ఆంధ్ర - ఒడిశా సరిహద్దులో గల మల్కాన్గిరి జిల్లాలో విషాదం...
విశాఖ..
--ఆంధ్ర - ఒడిశా సరిహద్దులో గల మల్కాన్గిరి జిల్లాలో... ఇన్ఫార్మర్ నెపంతో గిరిజనుడి హత్య
--మల్కాన్గిరి జిల్లా కట్ ఆఫ్ ఏరియాలో గల జోడం పంచాయతీ ఖజిరిపుట్ గ్రామoలో దాస్ కీముడు అనే 25 ఏళ్ల యువకుడిని హత్య చేసిన మావోయిస్టు
--ఇటీవల మావోయిస్టులు... భద్రత బలగాలు లక్ష్యంగా పాతి పెట్టిన 7 మందుపాతరలు గురించి పోలీసులకు సమాచారం ఇవ్వటంతో హత్య
--అదే గ్రామనికి చెందిన మరో ఇద్దరు వ్యక్తులను సైతం మావోయిస్టులు గాయపరిచినట్లు సమాచారం.
--ఘటనతో కట్ ఆఫ్ ఏరియాలోని గిరిజనులు భయాందోళనలకు గురవుతున్నారు.
- 21 Oct 2020 11:59 AM GMT
Vijayawada updates: ఇంద్రకీలాద్రిపై విరిగిపడిన కొండ చరియలు..
విజయవాడ..
-కొండ చర్యలు విరిగిపడటంతో విరిగిన షెడ్డు...
-కొండ రాళ్లు విరిగిపడిన చోటే మీడియా పాయింట్...
-శిధిలాల కింద ఎవరైనా ఉన్నారో అన్న కోణంలో సహాయక చర్యలు...
-నిలిపివేసిన అమ్మవారి దర్శనం...
-కాసేపట్లో ముఖ్యమంత్రి జగన్ పర్యటన ఉన్న దృష్టా అధికారులు ఏర్పాట్లు...
-కొనసాగుతున్న సహాయక చర్యలు...
-సీఎం పర్యటన దృష్ట్యా దర్శనం నిలిపివేయడంతో తప్పిన పెను ప్రమాదం
- 21 Oct 2020 11:56 AM GMT
Vijayawada updates: ఇంద్రకీలాద్రిపై కొండ చరియలు విరిగిపడ్డ ప్రదేశంలో వేదపండితులు సంప్రోక్షణ చేసారు..
విజయవాడ..
-కొండచరియలు పడిపోవడంతో మొత్తం అంతా పక్కకి జరిపారు
-సీఎం పట్టు వస్త్రాలు సమర్పించడానికి వస్తుండడంతో అన్ని ఏర్పాట్లు చేసారు
-ప్రమాదం సంభవించినా ఆలయ మర్యాదలు కాపాడుతూ సీఎం జగన్ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు
-మరికొద్దిసేపట్లో సీఎం జగన్ ఇంద్రకీలాద్రికి రానున్నారు
- 21 Oct 2020 11:53 AM GMT
Vijayawada updates: ఇంద్రకీలాద్రికి చేరుకున్న సీఎం జగన్..
విజయవాడ
-- ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన సీఎం
-- సీఎం కు పూర్ణకుంభ స్వాగతం పలికిన ఆలయ అధికారులు
- 21 Oct 2020 10:15 AM GMT
Amaravati updates: తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోకి ప్రభుత్వ ఉత్తర్వులు..
అమరావతి..
-తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోకి మరో 13 మండలాలను కలుపుతూ ప్రభుత్వ ఉత్తర్వులు
-నగరి మున్సిపాలిటీ సహా మరో 13 మండలాలను విలీనం చేస్తూ ఆదేశాలు జారీ చేసిన పురపాలక శాఖ
-తుడా పరిధిలోకి కొత్తగా 3260 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని కలుపుతూ ఉత్తర్వులు జారీ
-వరదాయపాలెం, సత్యవేడు మండలాల్లో విస్తరించిన శ్రీసిటీ సెజ్ ఉన్న11 గ్రామాలను మినహాయిస్తూ ఉత్తర్వులు
-శ్రీసిటీ సెజ్ ప్రస్తుతం నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోఉన్నందున తుడా నుంచి మినహాయిస్తూ ఆదేశాలు
-నగరి మున్సిపాలిటీ సహా 13 మండలాలు కొత్తగా వచ్చి చేరటంతో 4472 చదరపు కిలోమీటర్లకు పెరిగిన తుడా పరిధి
- 21 Oct 2020 10:11 AM GMT
Amaravati updates: చంద్రన్న బీమా కి నకలే వైఎస్సార్ బీమా..
అమరావతి..
-టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా
-తెలుగుదేశం పార్టీ పథకాలే పేరు మార్చి వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తోంది
-దేశంలో మొదటి సారి పేద ప్రజలకు మేలు చేసే పథకాలు పెట్టింది చంద్రబాబే
-బీమా పథకాన్ని గత 17 నేలల నుంచిచనిపోయిన వారి కుటుంబాలకు కూడా అమలు చేయాలి
-సీఎం జగన్ ఎన్నికల ముందు హామీ ఇచ్చిన విధంగా 3 వేల రూపాయలు పించన్ చెల్లించాలి
-కాపు, బ్రాహ్మణ కార్పొరేషన్లలను నిర్వీర్యం చేశారు
-కాపు,బ్రాహ్మణ కార్పొరేషన్ లకు తక్షణమే నిధులు మంజూరు చేయాలి
- 21 Oct 2020 10:02 AM GMT
Visakha updates: బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం కొనసాగుతోంది..
విశాఖ..
-దానికి అనుబంధంగా 7.6 కిలో మీటర్ల ఎత్తున తుపాను ఆవర్తనం నెలకొంది.
-ఇది రానున్న 24 గంటల్లో కోస్తాంధ్రకు సమీపంగా పశ్చిమమధ్య బంగాళాఖాతంలోకి పయనించి మరింత స్పష్టమైన అల్పపీడనంగా మారుతుంది.
-ఆతర్వాత 24 గంటల్లో ఉత్తర ఈశాన్యంగా పయనిస్తూ బలపడి వాయుగుండంగా మారి వాయవ్య బంగాళాఖాతంలో ఒడిసా పశ్చిమబెంగాల్ తీరాల్లో కేంద్రీకృతమవుతుంది.
-దీని ప్రభావంతో కోస్తాంధ్ర తెలంగాణ రాయలసీమల్లో రానున్న రెండు రోజుల్లో అక్కడక్కడ భారీ జల్లులతో ఓ మోస్తరు వర్షాలు పడతాయి. ఆ తర్వాత వర్ష తీవ్రత ఒడిసా, ఆవలి ప్రాంతాలకు మరలుతుంది.
-ఈనెల 22 వరకూ మత్స్యకారులు మధ్య బంగాళాఖాతంలోనికి పోరాదు.
-కర్నాటకలో కూడా రానున్న రెండు మూడు రోజుల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయి.
- 21 Oct 2020 10:00 AM GMT
Vijayawada updates: ఇంద్రకీలాద్రి పై పొంచి ఉన్న ప్రమాదం..
విజయవాడ..
--కొండపైన మౌన స్వామి ఆలయం వద్ద విరిగిపడేందుకు సిద్ధంగా ఉన్న కొండ చరియలు
--గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల దాటికి నాలుగు అంగులాల మేర బీటలు వారిన కొండ
--ఇప్పటికే చిన్న చిన్న రాల్లు దొర్లి పడుతుండడంతో అప్రమత్తమైన ఇంజనీరింగ్ అధికారులు
--రెండు మూడు రోజుల్లోనే కొండ చరియలు విరిగిపడే ప్రమాదముందని ఆలయ అధికారులకు బాబు సమాచార మందించిన ఇంజనీరింగ్ అధికారులు
--సాయంత్రం ముఖ్యమంత్రి రాకతో తర్జన బర్జనలో దుర్గగుడి అధికారులు
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire