Live Updates: ఈరోజు (21 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 21 అక్టోబర్, 2020 : హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు బుధవారం | 21 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | పంచమి మ.02-47 వరకు తదుపరి షష్టి | జేష్ఠ నక్షత్రం ఉ.08-21 వరకు తదుపరి మూల | వర్జ్యం: సా.04-02 నుంచి 05-34 వరకు | అమృత ఘడియలు రా.01-14 నుంచి 02-52 వరకు | దుర్ముహూర్తం: ఉ.11-23 నుంచి 12-10 వరకు | రాహుకాలం: మ.11-23 నుంచి 12-10 వరకు | సూర్యోదయం: ఉ.05-57 | సూర్యాస్తమయం: సా.05-35
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 21 Oct 2020 2:30 PM GMT
Visakha updates: విశాఖ ఎయిర్ పోర్ట్ లో కలకలం..
విశాఖ..
-ఢిల్లీ నుంచి వచ్చిన ఫ్లైట్ ప్రయాణీకుడుని అదుపులోకి తీసుకున్న ఇన్కమ్ టాక్స్ అధికారులు
-భారీ మొత్తంలో నగదు అక్రమ రవాణా సాగిస్తున్నట్లు అధికారులకు సమాచారం
-ప్రయాణీకుదుని అదుపులోకి తీసుకొని నగదు కు సంబంధించి ప్రశ్నిస్తున్న ఆదాయపన్ను శాఖ అధికారులు
- 21 Oct 2020 2:28 PM GMT
Vellampalli Srinivas: సీఎం దుర్గ గుడి అభివృద్ధి నిధులు మంజూరు చేయడం హర్షణీయం..
విజయవాడ
--దేవదాయ ధర్మదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు
--రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సీఎం జగన్మోహన్రెడ్డి దుర్గ గుడి అభివృద్ధి 70 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయడం హర్షణీయం
--ముఖ్యమంత్రి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
--దేవాలయాల అభివృద్ధి పట్ల సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధికి ఇది నిదర్శనం..
- 21 Oct 2020 2:23 PM GMT
National updates: ఉద్యోగులకు బోనస్‌ను అందించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర..
జాతీయం..
--కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బోనస్‌ను అందించేందుకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదముద్ర .
--బోనస్‌ను అందించేందుకు తక్షణం రూ 3737 కోట్లను విడుదల చేసేందుకు నిర్ణయం
--కేబినెట్ నిర్ణయంతో 30 లక్షలకు పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ధి.
--కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బోనస్ జారీతో పండుగ సీజన్‌లో డిమాండ్ పుంజుకుంటుందని భావిస్తున్న కేంద్ర ప్రభుత్వం
--దసరా లోపు బోనస్ ఉద్యోగుల ఖాతాల్లో ఒకే వాయిదాలో జమవుతుందని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ వెల్లడి.
--కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో రైల్వేలు, పోస్ట్ ఆఫీసులు, ఈపీఎఫ్‌ఓ, ఈఎస్‌ఐసీ వంటి ప్రభుత్వ రంగ సంస్ధల్లో పనిచేసే 17 లక్షల మంది నాన్ గెజిటెట్ ఉద్యోగులతో పాటు, మరో 13 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు ఉత్పాదకతతో సంబంధంలేని బోనస్
- 21 Oct 2020 2:19 PM GMT
Kurnool district updates: కోడుమూరు లో భారీ వర్షం..
కర్నూల్
* కోడుమూరు లో ఉరుములు మెరుపులతో కూడుకున్న భారీ వర్షం
* చెరువులను తలపిస్తున్న వీధులు, కాలువలు
* కొన్ని వీధుల్లో ఇళ్లలోకి చేరుతున్న వర్షపు నీరు
- 21 Oct 2020 2:15 PM GMT
Vijayawada durgamma updates: ఇంద్రకీలాద్రి పై దర్శనాలు!
విజయవాడ..
// ఇంద్రకీలాద్రి పై దర్శనాలను పునరుద్ధరించిన దుర్గగుడి అధికారులు
// క్యూలైన్లలో పోటెత్తిన భక్తులు
- 21 Oct 2020 12:43 PM GMT
Durgamma temple updaets: కొండచరియలు పడిన సంఘటనను సీఎం పరిశీలించారు..
విజయవాడ
-దుర్గగుడి పాలక కమిటీ చైర్మన్, పైలా సోమినాయుడు
-రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం జగన్ పట్టువస్త్రాలు సమర్పించారు
-లడ్డు ప్రసాదం తయారుచేసే పోటుకి, కొండమీద రివిటింగ్ కి, సోలార్ సిస్టం కి 70కోట్లు ప్రకటించారు
-సీఎం త్వరితగతిన నిధులు ప్రకటించారు
-మరింతగా నిధులు ఇస్తే ఇంకా ప్లానింగ్ లో ఉన్న అభివృద్ధి పనులు చేస్తాం
-ఈఓ సురేష్, ఇంద్రకీలాద్రి దుర్గగుడి మల్లేశ్వర స్వామి గుడి, కేశఖండన శాలకు కూడా సీఎం ప్రకటించిన నిధులు వినియోగిస్తాం
-కొండచరియలు పడతాయని సమాచారం లేదు
-కొండచరియల క్రింద ఎవరూ లేరనుకుంటున్నాం
- 21 Oct 2020 12:32 PM GMT
Vijayawada updates: అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం..
విజయవాడ..
// విరిగిపడ్డ కొండచరియలు పరిశీలించిన సీఎం
// ఇంద్రకీలాద్రి నుంచి తాడేపల్లి నివాసానికి బయల్దేరిన సీఎం
- 21 Oct 2020 12:29 PM GMT
Guntur district updates: ఎక్సైజ్ సి.ఐ. వేదింపులు!
గుంటూరు జిల్లా , గురజాల
--ఎక్సైజ్ సి.ఐ. వేదింపులు తాళలేక షేక్.లాల్ భీ అనే మహిళ పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం....
--దాచేపల్లికి చెందిన షేక్.లాల్ భీ ఇటీవల అక్రమ మద్యం అమ్ముతు పట్టుబడింది....
--అపుడు కేసునమోదు చేసి రిమాండ్ కు పంపిచిన పోలీసులు....
--జైలు నుంచి వచ్చినప్పటినుంచి మద్యం అమ్మడం మానేసి పోలం పనులు చేసుకుంటున్న మహిళా...
--గత రాత్రి లాల్ బీ కుమారులను మద్యం అమ్ముతున్నారంటూ మీపై
--పి.డి.యాక్ట్ పెడతానంటూ ఎక్సైజ్ సిఐ బెదిరింపులు.....
--మనస్థాపం చెంది పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం..స్థానిక.ఆసుపత్రికి తరలింపు
- 21 Oct 2020 12:25 PM GMT
Amaravati updates: భారీగా వాహన జరిమానాలు పెంచుతూ ఎపి ప్రభుత్వం ఉత్తర్వులు..
అమరావతి
//బైక్ నుండి 7 సిటర్ కార్ల వరకు ఒక విధమైన జరిమానా
//ఇతర వాహనాలకు మరింత అధిక జరిమానా
//జరిమానాలు..
//వాహన చెకింగ్ విధులకు ఆటంకం కలిగిస్తే - రూ. 750
//సమాచారం ఇవ్వడానికి నిరాకరించినా - రూ. 750
//అనుమతి లేని వ్యక్తులకి వాహనం ఇస్తే - రూ. 5000
//అర్హత కంటే తక్కువ వయస్సు వారికి వాహనం ఇస్తే - రూ. 5000
//డ్రైవింగ్ లైసెన్స్ పొందే అర్హత లేని వారికి వాహనం ఇస్తే - రూ. 10000
//రూల్స్ కి వ్యతిరేకంగా వాహనాల్లో మార్పులు చేస్తే - రూ. 5000
//వేగంగా బండి నడిపితే - రూ. 1000
//సెల్ ఫోన్ డ్రైవింగ్, ప్రమాదకర డ్రైవింగ్ - రూ. 10000
//రేసింగ్ మొదటిసారి రూ. 5000, రెండో సారి రూ. 10000
//రిజిస్ట్రేషన్ లేకున్నా, ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకున్నా - మొదటిసారి రూ. 2000, రెండో సారి రూ. 5000
//పర్మిట్ లేని వాహనాలు వాడితే - రూ. 10000
//ఓవర్ లోడ్ - రూ.20000 ఆపై టన్నులు రూ. 2000 అదనం
//వాహనం బరువు చెకింగ్ కోసం ఆపక పోయినా - రూ. 40000
//ఎమర్జెన్సీ వాహనాలకు దారి ఇవ్వకుంటే - రూ. 10000
//అనవసరంగా హారన్ మోగించినా - మొదటిసారి రూ. 1000, రెండోసారి రూ. 2000 జరిమానా
//రూల్స్ కి వ్యతిరేకంగా మార్పు చేర్పులు చేస్తే తయారీ సంస్థలకు లేదా డీలర్లకు, అమ్మినినవారికి - రూ. లక్ష
- 21 Oct 2020 12:22 PM GMT
Y.S.Jagan Comments: ఇది చాలా పెద్ద కార్యక్రమం, గొప్ప కార్యక్రమం...
అమరావతి..
‘వైయస్సార్ బీమా’ పథకం ప్రారంభం సందర్భంగా సీఎం వైయస్ జగన్ కామెంట్స్ ..:
-ఏ ఒక్క కుటుంబం బాధ పడొద్దు
– ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా నిండు నూరేళ్లు బ్రతకాలని కోరుకునే ప్రభుత్వం మాది.
– ఒక నిరుపేద కుటుంబం, సంపాదించే వ్యక్తిని కోల్పోతే ఆ కుటుంబం బాధ పడొద్దన్న ఉద్దేశంతో పథకం అమలు.
కేంద్రం తప్పుకున్నా..:
– గతంలో ఉన్నట్లుగా కాకుండా పథకం నుంచి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా తప్పుకున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం భరిస్తూ పథకం అమలు చేస్తోంది.
– ఏటా రూ.510 కోట్ల ఖర్చుతో బియ్యం కార్డు అర్హత ఉన్న 1.41 కోట్ల కుటుంబాలకు ఉచిత బీమా రక్షణ కల్పిస్తోంది.
పారదర్శకంగా:
– పథకంలో లబ్ధిదారుల ఎంపిక పూర్తి పారదర్శకంగా చేశారు. గ్రామ వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించారు.
– ఆ జాబితాలను గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించమని కోరాము.
– అర్హత ఉండి కూడా ఎవరి పేర్లు అయినా ఆ జాబితాలో లేకపోతే వారు తమ పేర్లు వెంటనే నమోదు చేసుకోవచ్చు.
బీమా ప్రయోజనాలు:
– పథకంలతో 18–50 ఏళ్ల మధ్య ఉన్న లబ్ధిదారులు సహజ మరణం సంభవిస్తే వారి కుటుంబానికి రూ.2 లక్షల సహాయం
– 18–50 ఏళ్ల మధ్య ఉన్న వారు ప్రమాదవశాత్తూ మరణించినా లేక శాశ్వత అంగ వైకల్యానికి గురైనా రూ.5 లక్షల పరిహారం.
– ఇక 51–70 ఏళ్ల మధ్య ఉన్న వారు ప్రమాదవశాత్తూ చనిపోయినా లేక శాశ్వత అంగ వైకల్యానికి గురైతే రూ.3 లక్షల సహాయం.
– ఇంకా 18–70 ఏళ్ల మధ్య ఉన్న వారికి పాక్షిక లేదా శాశ్వత అంగ వైకల్యం సంభవిస్తే రూ.1.5 లక్షల పరిహారం ఇస్తారు.
నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో:
– పథకంలో ప్రీమియమ్ మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తారు.
– బ్యాంకర్లు ఆ నగదును తొలుత లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసి, ఆ తర్వాత బీమా కంపెనీలకు ప్రీమియమ్‌గా చెల్లిస్తారు.
– ఆ తర్వాత ఒక వారంలో వాలంటీర్లు ఇళ్లకు వెళ్లి లబ్ధిదారులకు బీమా కార్డులు అందజేస్తారు.
– పథకం లబ్ధిదారులకు ఏ సమస్య వచ్చినా గ్రామ, వార్డు సచివాలయాలు రెఫరల్ పాయింట్‌గా ఉంటాయి.
తక్షణమే రూ.10 వేలు:
– ఏదైనా ప్రమాదం జరిగి, కుటుంబ పెద్ద చనిపోతే, క్లెయిమ్ పొందడానికి 15 రోజులు పడుతుంది.
– ఆలోగా ఆ కుటుంబానికి తక్షణ సహాయంగా రూ.10 వేలు ఇస్తారు.
– ఇది పథకంలో లేకపోయినా, కొత్తగా అమలు చేయబోతున్నాము.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire