Live Updates:ఈరోజు (ఆగస్ట్-19) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు పంచాంగం
ఈరోజు బుధవారం, 19 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, కృష్ణపక్షం అమావాస్య(ఉ. 8-22 వరకు) తదుపరి పాడ్యమి; మఘ నక్షత్రం (తె. 4-08 వరకు) తదుపరి పుబ్బ నక్షత్రం, అమృత ఘడియలు ( రా. 1-49 నుంచి 3-22 వరకు), వర్జ్యం (సా. 4-35 నుంచి 6-07 వరకు) దుర్ముహూర్తం (ఉ. 11-38 నుంచి 12.28 వరకు తిరిగి మ.03-00 నుంచి 3-50 వరకు) రాహుకాలం (మ. 12-00 నుంచి 1-30 వరకు) సూర్యోదయం ఉ.05-46 సూర్యాస్తమయం సా.06-21
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 19 Aug 2020 8:51 AM GMT
Road Accident in Kurnool: నేషనల్ హైవే పై రెండు వేరువేరు ప్రమాదాలు.
కర్నూలు జిల్లా: డోన్ నేషనల్ హైవే కొత్తపల్లె భారత్ పెట్రోల్ బంక్ వద్ద రోడ్డు పక్కనే నిద్రిస్తున్న వ్యక్తిపై దూసుకెళ్లిన లారీ వ్యక్తి మృతి.
వెల్దుర్తి మండలం నేషనల్ హైవే అమెజాన్ హోటల్ వద్ద బైకు యాక్సిడెంట్ ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలుకు తరలించారు.
బైక్ లో చున్ని ఇరుక్కోవడంతో జరిగిన ప్రమాదం
- 19 Aug 2020 8:47 AM GMT
Yanamala Ramakrishna fire on AP Govt: ఫోన్ ట్యాపింగ్ లో రాష్ట్ర ప్రభుత్వమే ముద్దాయి: యనమల రామకృష్ణుడు
అమరావతి:
యనమల రామకృష్ణుడు శాసనమండలి ప్రధాన ప్రతిపక్ష నేత:
- ప్రధానికి చంద్రబాబు లేఖ రాస్తే, డిజిపి, హోంమంత్రి భుజాలు తడుముకోవడం ఏమిటి..?
- ఏపిలో ఫోన్ ట్యాపింగ్ లలో, సుప్రీంకోర్టు పేర్కొన్న హేతుబద్ద కారణాలు ఉన్నాయా..?
- ఆర్టికల్ 19,21ప్రకారం ఇది రాజ్యాంగ ఉల్లంఘనే, కేంద్ర చట్టాల ఉల్లంఘనే
- ఏపిలో ఫోన్ ట్యాపింగ్ పౌర హక్కులను, ప్రాథమిక హక్కులను కాలరాయడమే
- ఇది సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించడమే, ‘‘రూల్ ఆఫ్ లా’’ ను అతిక్రమించడమే
-ప్రధాని స్పందన దాకా డిజిపి, హోం మంత్రి ఎందుకని ఆగలేక పోయారు..?
- ప్రతిపక్షాలను లేకుండా చేయడానికి, జ్యడిషియరీని బ్లాక్ మెయిల్ చేయడానికి బరితెగించారు
- వాదనలు వినిపించే న్యాయవాదుల ఫోన్ ట్యాపింగ్ కన్నా తీవ్ర నేరం మరొకటి లేదు.
- దేశ భద్రతకు భంగం వాటిల్లిందా ఇక్కడ ఏ అంశంలోనైనా..?
- ప్రజా భద్రతకు భంగం కలిగిందా ఇందులో ఎక్కడైనా..?
- మరి ఏ కారణంతో అడ్వకేట్లు, జడ్జిల ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారు..?
- ట్యాపింగ్ పై సర్వీస్ ప్రొవైడర్లకు ఏమైనా లిఖితపూర్వక ఆదేశాలు అందజేశారా..?
- ముద్దాయే సాక్ష్యాధారాలు ఇవ్వాలని అడగడం ఎక్కడైనా ఉందా..?
- ట్యాపింగ్ పై కేసు పెట్టాలని డిజిపి సలహా ఇవ్వడం మరో విడ్డూరం.
- ఇందులో రాష్ట్ర ప్రభుత్వమే దోషిగా ఉన్నప్పుడు ఎవరిపై కేసు పెట్టాలి..?
- డిజిపి, హోంమంత్రి స్పందన ఫోన్ ట్యాపింగ్ పై అనుమానాలను బలపరుస్తోంది
- 19 Aug 2020 8:11 AM GMT
BJP Somu Veerraju East Godavari Tour: సోము వీర్రాజు తూర్పు గోదావరి పర్యటన
తూర్పు గోదావరి జిల్లా,రాజానగరం నియోజకవర్గంలో బూరుగుపు డి లో ఆవ భూముల్ని పరిశీలిస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు
- 19 Aug 2020 8:07 AM GMT
Amalapuram Sai Satvik Nominated to Arjuna Award: సాయి సాత్విక్ అర్జున అవార్డుకు ఎంపిక
తూర్పు గోదావరి జిల్లా: అమలాపురం చెందిన సాయి సాత్విక్ అర్జున అవార్డుకు ఎంపిక
అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు గా గ్రామీణ స్థాయి నుంచి ఎదిగిన సాయి సాత్విక్
2018లో కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం, రజిత పతకం కైవసం చేసుకున్న సాయి సాత్విక్
2021 ఒలంపిక్స్ లక్ష్యం అంటున్న సాయి సాత్విక
- 19 Aug 2020 8:02 AM GMT
Alcohol theft in Narasaraopet: నరసరావుపేటలో మద్యం చోరి
గుంటూరు జిల్లా: నరసరావుపేట బస్టాండ్ వద్ద ప్రభుత్వ మద్యం దుకాణంలో 9 లక్షల విలువైన మద్యం చోరి
చోరీ ఘటనపై గోప్యంగా విచారిస్తున్న గుంటూరు ఎక్సెజ్ అధికారులు
రెండు నెలల క్రితం ఇదే షాపులో 7 లక్షల మద్యం అపహరణ
వరుసగా మద్యం షాపుల్లో చోరీలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఏక్సెజ్ అధికారులు.
- 19 Aug 2020 4:51 AM GMT
Ramakrishna Letter to YS Jagan: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ.
విజయవాడ:
- వరదల వల్ల పంటలు నీట మునిగిన ప్రాంతాల్లో ఎకరాకు రు.10 వేలు నష్టపరిహారం ఇచ్చేందుకు చర్యలు చేపట్టండి.
- మీరు వెంటనే స్పందించి వరద బాధితులకు 2 వేల చొప్పున సహాయం ప్రకటించడం అభినందనీయం.
- భారీ వర్షాలు, వరదల కారణంగా రైతులు తీవ్రంగా పంట నష్ట పోయారు.
- వేరుశనగ, ప్రత్తి, ఉల్లి వంటి అనేక మెట్ట పంటలు దెబ్బతిన్నాయి.
- పండ్ల తోటలు నీటమునిగాయి.
- అప్పులు తెచ్చి వేసిన పంట నష్టపోవడంతో రైతులు తిరిగి పంట పెట్టుకునే పరిస్థితి లేదు.
- తక్షణమే పంట నష్టంపై ఎన్యుమరేషన్ చేయించండి.
- రైతులకు ఎరువులు, విత్తనాలు ఉచితంగా సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టండి.
- రామకృష్ణ.
- 19 Aug 2020 4:50 AM GMT
Nara lokesh Comments on YS Jagan టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్...
అమరావతి:
- జగన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ అడిగింది ప్రజల కోసం కాదు రాజకీయ ప్రత్యర్థులపై కక్షసాధింపు కోసం.
- ఒక పక్క కరోనా,మరో పక్క వరదలతో ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే వారిని గాలికొదిలి ప్రతిపక్ష నేతల అక్రమ అరెస్టులకు ప్రణాళిక సిద్ధం చేసే పనిలో బిజీగా ఉన్నారు.
- కేవలం వ్యక్తిగత కక్ష సాధింపుతోనే జేసీ కుటుంబం పై అక్రమ కేసులు పెట్టి రాక్షస ఆనందం పొందుతున్నారు.
- ఆఖరికి ప్రతిపక్ష పార్టీ నాయకుల పై కరోనా కేసులు పెట్టే నీచ స్థాయికి దిగజారిపోయారు అంటే ఆయన మానసిక స్థితి ఏంటో అర్థం అవుతుంది.
- జేసీ ప్రభాకర్ రెడ్డి గారు బెయిల్ పై రిలీజ్ అయ్యిన 24 గంటల్లోనే కరోనా కేసు అంటూ మళ్ళీ అరెస్ట్ చేసారు.
- ఆయన కడప జైలులో కరోనా బారిన పడటం బాధాకరం.
- జేసి ప్రభాకర్ రెడ్డి గారికి కరోనా సోకడానికి జగన్ రెడ్డి గారి నేర మనస్తత్వమే కారణం.
- కడప జైలు లో 317 మందికి కరోనా ఉన్నట్టు నిర్దారణ అయ్యింది.
- తక్షణమే ఆసుపత్రికి తరలించి,
జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి మెరుగైన వైద్య సహాయం అందించాలి.
జేసీ ప్రభాకర్ రెడ్డి గారు త్వరగా కోలుకోవాలని ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నాను.
- 19 Aug 2020 4:48 AM GMT
Suicide: పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం.
అనంతపురం జిల్లా:
- కుందుర్పి మండలం బెస్తరపల్లి గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం (26) యువ చేనేత కార్మికుడు ఆర్థిక సమస్యలతో పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం.చికిత్స పొందుతూ మృతి.
- 19 Aug 2020 2:50 AM GMT
CoronaVirus: కడప జైలులో రిమాండ్‌లో ఉన్న తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డికి కరోనా
అనంతపురం:
- కడప జైలులో రిమాండ్‌లో ఉన్న తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డికి కరోనా
- నిన్న నిర్వహించిన పరీక్షల్లో జేసీ ప్రభాకర్‌రెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్థరణ
- జేసీ ప్రభాకర్‌రెడ్డిని ప్రత్యేక గదిలో పెట్టి పర్యవేక్షణ చేస్తున్న జైలు సిబ్బంది
- 19 Aug 2020 2:49 AM GMT
Rajahmandry Godavari: స్వల్పంగా తగ్గుముఖం పట్టిన వరద గోదావరి ఉగ్ర రూపం
తూర్పు గోదావరి జిల్లా:
- రాజమండ్రి- వద్ద స్వల్పంగా తగ్గుముఖం పట్టిన వరద గోదావరి ఉగ్ర రూపం
- ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ప్రస్తుతం నీటి మట్టం 18.90 అడుగులు
- నిన్న మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకూ ఒక అడుగుమాత్రమే తగ్గింది
- బ్యారేజ్ వద్ద కొనసాగుతున్న మూడవ ప్రమాద హెచ్చరిక జారీ
- ధవలేశ్వరం బ్యారేజ్ లోని 175గేట్లను పూర్తిగా ఎత్తి వుంచిన అధికారులు
- 20లక్షల 91 వేల 355 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల
- సాయంత్రానికి మూడో ప్రమాద ఉపసంహరణ స్థాయికి గోదావరి వరద ఉదృతి..
మరికొన్ని రోజులు పాటు జల దిగ్బంధనం లోనే కొనసాగనున్న కోనసీమ లోని లంక గ్రామాలు..
ఏడు రోజుజుగా దేవీపట్నం జలదిగ్భంధంలోనే..
మన్యసీమలో గిరిజన గ్రామాలు తేరుకోవడానికి మరికొన్ని రోజులు
పోలవరం కాఫర్ డ్యాం దగ్గర స్వల్పంగానే తగ్గుదల
కాఫర్ డ్యాం వద్ద 30. 20మీటర్ల వరద నీటిమట్టం, కాఫర్డ్యాం ఎగువ భారీగా నిలిచిపోయిన వరదనీరు
భద్రాచలం వద్ద 47.60 అడుగులకు తగ్గిన వరద నీటిమట్టం
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire