Live Updates:ఈరోజు (ఆగస్ట్-19) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు పంచాంగం
ఈరోజు బుధవారం, 19 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, కృష్ణపక్షం అమావాస్య(ఉ. 8-22 వరకు) తదుపరి పాడ్యమి; మఘ నక్షత్రం (తె. 4-08 వరకు) తదుపరి పుబ్బ నక్షత్రం, అమృత ఘడియలు ( రా. 1-49 నుంచి 3-22 వరకు), వర్జ్యం (సా. 4-35 నుంచి 6-07 వరకు) దుర్ముహూర్తం (ఉ. 11-38 నుంచి 12.28 వరకు తిరిగి మ.03-00 నుంచి 3-50 వరకు) రాహుకాలం (మ. 12-00 నుంచి 1-30 వరకు) సూర్యోదయం ఉ.05-46 సూర్యాస్తమయం సా.06-21
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 19 Aug 2020 9:29 AM GMT
Woman Suicide with Sanitzer in Cheerala: చీరాల లో వివాహిత శానిట్తెజర్ తాగి ఆత్మహత్యాయత్నం
ప్రకాశం: చీరాల లో వివాహిత శానిట్తెజర్ తాగి ఆత్మహత్యాయత్నం ...
ప్రేమ వివాహం చేసుకున్న భర్త విజయ్ తన ను కాపురానికి తీసుకోవడంలేదని మనస్దానికి గుర్తె ఆత్మహత్యయత్నానికి పాల్పడిన భాదితురాలు అముాల్య...
ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అమూల్య ...
కేసు నమోదు చేసి విచారిస్తున్న పోలీసులు.
చీరాల విటల్ నగర్ కు చెందిన అముాల్య కు కుంకలమర్రు చెందిన విజయ్ తో రెండు సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం ....
- 19 Aug 2020 9:21 AM GMT
Former MLA Pendurthy Venkatesh: జల దీక్ష చేపట్టిన మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్
తూర్పుగోదావరి -రాజమండ్రి: కోరుకొండ మండలం బూరుగుపూడి లో ఇళ్ళ స్థలాలకు కు కొనుగోలు చేసిన ఆవ భూములు వర్షాలకు పూర్తిగా జలమయం
ముంపులో వున్న ఆవ భూముల్ని పరిశీలించిన ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చియ్యచౌదరి , మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్
ఆవ భూములలో జలదీక్ష చేపట్టిన మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్
నీట మునిగిన ఆవ భూముల్లో జల దీక్ష కు దిగిన మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ కు మద్దతుగా నిలిచిన రైతులు
- 19 Aug 2020 9:19 AM GMT
Guntur: విద్యుత్ తీగలు తగలి రైతు రంగిశెట్టి వెంకటేశ్వర్లు మృతి..
గుంటూరు:
- అచ్చంపేట మండలం కొత్తపల్లిలో పోలంలో వ్రేలాడుతున్న విద్యుత్ తీగలు తగలి రైతు రంగిశెట్టి వెంకటేశ్వర్లు మృతి..
- 19 Aug 2020 9:16 AM GMT
Kurnool District: యువతి పై కర్ర తో డాడీ చేసిన గ్రామ వాలంటీర్
కర్నూలు:
- కొత్తపల్లి మండలంలోని కొక్కరంచ గ్రామం లో సరోజ అనే యువతి పై కర్ర తో డాడీ చేసిన గ్రామ వాలంటీర్ జయ ప్రకాష్ రెడ్డి
- ఇంటి ఎదురుగా ముల్ల కంచె వివాదం తోనే దాడి
- తలకు తీవ్ర గాయం... పరిస్థితి విషమం కర్నూలు వైద్యశాల కు తరింపు
- 19 Aug 2020 9:15 AM GMT
Treasury Employee Arrest: సబ్ ట్రెజరీ అధికారి అరెస్టు..
విజయవాడ: మచిలీపట్నం సబ్ ట్రెజరీ అధికారి నాగమల్లేశ్వర రావును అరెస్టు చేసాం: ఏసీబీ జాయింట్ డైరెక్టర్
వెనక్కి వచ్చిన పెన్షన్లను ప్రభుత్వ అక్కౌంట్ లో వేయకుండా 29.51 లక్షలు వాడుకున్నారు
ఆయనకి 15 రోజుల రిమాండ్ వేసారు
మరణించిన వారి మరణం నిర్ధారణ అయ్యే లోపు వెనక్కి ట్రెజరీకి వచ్చిన సొమ్ము ప్రభుత్వానికి ఇవ్వలేదు
- 19 Aug 2020 9:15 AM GMT
AP Capital Issue: రాజధాని పై మరో సారి కేంద్రం వైఖరి స్పష్టం
అమరావతి..
- రాజధాని పై మరో సారి కేంద్రం వైఖరి స్పష్టం
- రాజధాని అంశంలో కేంద్రం జోక్యం చేసుకోబోదని స్పస్తికరణ
- హై కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్రం
- 19 Aug 2020 9:11 AM GMT
Police Seizes Silver And Gold In Treasury Employee House: ట్రెజరీ ఉద్యోగి ఇంట్లో భారీగా బంగారం,వెండి స్వాధీనం
అనంతపురం: ట్రెజరీ ఉద్యోగి దాచిన బంగారం, వెండి ఆభరణాలు, నగదు పట్టివేత పై రామకృష్ణ ప్రసాద్ అడిషనల్ ఎస్పీ ప్రెస్ మీట్
అనంతపురం ట్రెజరీ లో పనిచేస్తున్న ఉద్యోగి మనోజ్ కుమార్ తన డ్రైవర్ బంధువుల ఇంట్లో 8 ట్రంకు పెట్టెలో బంగారు, వెండి నగదు దాచిపెట్టాడు.
బుక్కరాయసముద్రం లోని గాంధీ నగర్ లో నివాసం ఉంటున్న బాలప్ప అనే వ్యక్తి ఇంట్లో మారణాయుధాలు ఉన్నాయని సమాచారంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు
ఎనిమిది ట్రంకు పెట్టెలో భారీ గా నిధిని గుర్తించడం జరిగింది.
అందులో 2.42 కేజీల బంగారం, 84.1 కేజీల వెండి, రూ 15,55,560, 49.1 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్లు బాండ్లు
రూ.27.05 లక్షల విలువైన ప్రామిసరీ నోట్లు.
రెండు మహేంద్ర కార్లు, మూడు ఎన్ఫీల్డ్ మోటార్ సైకిళ్లు, ఒక హార్లీ డేవిడ్సన్ మోటార్ సైకిల్.
రెండు కరిష్మా ద్విచక్రవాహనాలు, ఒక హోండా యాక్టివా, నాలుగు ట్రాక్టర్లు స్వాధీనం
మూడు 9 ఎం ఎం పిస్టల్స్, 18 బ్లాంక్ రౌండ్లు, ఒక ఎయిర్ గన్ ను స్వాధీనం.
మనోజ్ కుమార్ పై కేసు నమోదు
- 19 Aug 2020 9:03 AM GMT
AP Cabinet Meeting Today: కొనసాగుతున్న ఏపీ క్యాబినెట్ భేటీ..
అమరావతి: కొనసాగుతున్న క్యాబినెట్ భేటీ..
వైఎస్సార్ ఆసరా పథకానికి క్యాబినెట్ ఆమోదముద్ర..
వైఎస్సార్ పోషణ పధకం అమలుకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్..
డిసెంబర్ నుంచి ఇంటింటికీ రేషన్ అమలుకు క్యాబినెట్ ఆమోదం...
జగనన్న విద్యాదీవెన పథకానికి ఆమోదం తెలిపిన క్యాబినెట్..
- 19 Aug 2020 9:00 AM GMT
Godavari floods Updates: జలదిగ్బంధంలో పి.గన్నవరం మండలం లంకల గన్నవరం
తూర్పుగోదావరి: జలదిగ్బంధంలో పి.గన్నవరం మండలం లంకల గన్నవరం..
ఆంధ్రా అన్నపూర్ణ డొక్కా సీతమ్మ ఇంటిలోనికి చేరిన వరద నీరు..
మండువా ఇల్లు కావడంతో డొక్కా సీతమ్మ కు సంబంధించిన వస్తువులు, ఫోటోలు సురక్షితంగా ఉంటాయంటున్న స్థానికులు..
ఇంటిలోనికి వరద నీరు చేరడంతో డొక్కా సీతమ్మ బంధువులను సురక్షిత ప్రాంతానికి తరలింపు..
ప్రముఖ ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు సౌజన్యంతో ఇటీవలే ఎత్తు చేసి పునర్నిర్మాణం చేపట్టిన డొక్కా సీతమ్మ బంధువులు..
2006 వరదలను మించి నీరు చేరడంతో డొక్కా సీతమ్మ ఇల్లు కూడా మునిగిపోయిందంటున్న స్థానికులు..
- 19 Aug 2020 8:54 AM GMT
Godavari Floods Updates: గోదావరిలో పెరిగిన వరద ఉధృతి
తూర్పుగోదావరి: అల్లవరం మం. బోడసకుర్రు పల్లిపాలెం వద్ద మరింత పెరిగిన వరద ఉధృతి..
పునరావాస కేంద్రంలోకి ప్రవేశించిన వరద నీరు.. గ్రామస్తులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న అధికారులు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire