Live Updates:ఈరోజు (ఆగస్ట్-17) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు పంచాంగం
ఈరోజు సోమవారం, 17 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, కృష్ణపక్షం త్రయోదశి(ఉ. 10-37 వరకు) తదుపరి చతుర్దశి; పుష్యమి నక్షత్రం (తె. 05-34 వరకు) తదుపరి ఆశ్లేష నక్షత్రం, అమృత ఘడియలు ( రా. 11-12 నుంచి 12-47 వరకు), వర్జ్యం (మ.01-38 నుంచి 03-14 వరకు) దుర్ముహూర్తం (మ.12-29 నుంచి 01-19 వరకు తిరిగి మ.03-00 నుంచి 3-50 వరకు) రాహుకాలం (ఉ. 07-30 నుంచి 09-00 వరకు) సూర్యోదయం ఉ.05-46 సూర్యాస్తమయం సా.06-22
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 17 Aug 2020 10:04 AM GMT
ఆర్ 5 జోన్ పై సుప్రీంకోర్టు తీర్పు అమరావతి రైతులకు శుభవార్త
సి.ఆర్డీఏ లో ఆర్ 5 జోన్ పై హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించడం ఆహ్వానించదగిన పరిణామం
ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ చీటికీమాటికీ హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో సవాలు చేయడం ద్వారా ప్రయోజనం ఉండదు
పెద్ద పెద్ద లాయర్లకు కోట్ల రూపాయలను వెచ్చిస్తూ ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారు.
రాజధాని తరలింపు సి.ఆర్.డి.ఏ చట్టం మార్పు అంశంపై సుప్రీంకోర్టు లో బుధవారం జరిగే విచారణ కూడా రైతులకు న్యాయం జరుగుతుందని నమ్ముతున్నా.
ఇళ్ల స్థలాల పంపిణీ పేరుతో రాజమండ్రి పరిసరాల్లో 600 ఎకరాల భూములు ఎక్కువ ధరకు కొనుగోలు చేశారు
అప్పుడు కొందరు ఆ భూములు కొనడం పై అభ్యంతరం వ్యక్తం చేస్తే ...
ప్రస్తుతం వస్తున్న గోదావరి వరదల్లో ఆ ప్రాంతమంతా మునిగిపోవడం ద్వారా అవి ఆవ భుములేనని నిర్ధారణ అయింది.
ఆవ భూముల కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయని రాజమండ్రి ప్రాంత ప్రజల అభిప్రాయం.
ఎకరం నలభై లక్షలకు కొన్న ఆవ భూములు ముంపునకు గురి కావడం ద్వారా సుమారు వందల కోట్ల ప్రజాధనం వృధా అయినట్టే .
ఆ భూముల కొనుగోలులో జరిగిన అవకతవకలపై ఏసీబీ విచారణ జరపాలి.
అవకతవకలకు పాల్పడిన వీరందరిని కొన్ని అదృశ్య శక్తులు నడిపిస్తున్నారని చర్చ జరుగుతోంది
ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజాప్రతినిధుల అనుచరులపై ఏసీబీ ద్వారా విచారణ జరపాలని ముఖ్యమంత్రిని కోరుతున్నాం.
ముఖ్యమంత్రి వెంటనే దోషుల పై విచారణ జరిపించి చర్య తీసుకుంటారని ఆశిస్తున్నా
ఇళ్ల స్థలాల కొనుగోలు, ఇళ్ల స్థలాల కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయని కలెక్టర్ దగ్గర నివేదికలు ఉన్నాయి.
పార్టీకి చెడ్డపేరు రావద్దన నేను ఇచ్చే సలహాలు నచ్చిన వారు ఇప్పటికీ నాపై బెదిరింపులకు పాల్పడుతునే ఉన్నారు.
నేను ఫిర్యాదు చేసినప్పటికీ గుర్రంపాటి దేవేందర్ రెడ్డి పై ముఖ్యమంత్రి చర్యలు తీసుకోలేదు .
దేవేందర్ రెడ్డి ఇంకా నన్ను విమర్శిస్తూ ట్వీట్స్ చేస్తూనే ఉన్నాడు.
న్యాయ మూర్తుల ఫోన్ లు సైతం ట్యాపింగ్ కు గురవుతున్నాయి
న్యాయ వ్యవస్థ పై నిఘా అన్న పేరుతో పత్రికల్లో వార్తలు వచ్చాయి.
ముఖ్యమంత్రి చుట్టూ ఉన్నవారు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు
పార్క్ హయత్ లో ఏదో జరిగిందంటూ విజయసాయిరెడ్డి పెట్టిన ట్వీట్ ఫోన్ టాపింగ్ జరిగింది అనేందుకు నిదర్శనం
ఫోన్ టాపింగ్ జరగకపోతే ఫేస్ టైం లో ఎవరెవరు ఎవరితో మాట్లాడారనే విషయం విజయసాయి రెడ్డి కి ఎలా తెలుస్తుంది
ముఖ్యమంత్రి గారు మీ చుట్టూ ఉన్న అసాంఘిక శక్తులు ఎవరనేది పసిగట్టoడి.
న్యాయ వ్యవస్థని, రాజ్యాంగ వ్యవస్థలను కూలదోస్తున్నరన్న అప్రతిష్ట తెచ్చుకోకండి
మీ దురభిమానుల ద్వారా నాకు ఫోన్ చేయించి వేదించవద్దని విజ్ఞప్తి చేస్తున్నా.
టెలిఫోన్ టైపింగ్ అంశంపై ఎలాంటి చర్యలు తీసుకోకుంటే ఈ అంశం నేను కచ్చితంగా పార్లమెంట్లో లేవనెత్తుతా.
ఆంధ్రజ్యోతి పత్రిక కు నోటీసు ఇచ్చిన విషయం ముఖ్యమంత్రికి తెలియకుండా జరగొచ్చు. ఆయనకే తెలిస్తే నోటీసులు వచ్చేవి కాదు.
👆🏻 రఘురామ కృష్ణరాజు, వైసీపీ ఎంపీ
- 17 Aug 2020 6:18 AM GMT
సుప్రీంకోర్టు లో మరోసారి ఏపి రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ
జాతీయం: సుప్రీంకోర్టు లో మరోసారి ఏపి రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ
అమరావతి లో ఇళ్ల స్థలాల పంపిణీ , ఆర్ జోన్ 5 విషయంలో హైకోర్టు తీర్పును సమర్ధించిన సుప్రీంకోర్టు
హైకోర్టులోనే తుది విచారణ ముగించాలని కోరిన సుప్రీంకోర్టు
- 17 Aug 2020 5:21 AM GMT
సరియా జలపాతంలో విద్యార్ధి గల్లంతు
విశాఖ: అనంతగిరి మండలం సరియా జలపాతంలో ఎస్. మీనాంక్( 20) అనే విధ్యార్ధి గల్లంతు.
స్నేహితులతో జలపాతాన్ని చూసేందుకు వచ్చిన యువకుడు.
అనిట్స్ ఇంజనీరింగ్ కాలేజీలో మూడో సంవత్సరం చదువుతున్న యువకుడు.
గజ ఈతగాళ్లు తో సరియా జలపాతంలో యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టిన అనంతగిరి పోలీసులు.
- 17 Aug 2020 5:13 AM GMT
జలదిగ్బంధంలో దేవిపట్నం ముంపు గ్రామాలు..
తూర్పుగోదావరి: నాలుగురోజులుగా జలదిగ్బంధంలోనే దేవిపట్నం ముంపు గ్రామాలు..
విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో స్థంభించిన సమాచార వ్యవస్థ.. పని చేయను సెల్ ఫోన్లు..
గంటకు గంటకు పెరుగుతోన్న వరదతో మేడలు, ఎత్తైన కొండ ప్రాంతాలపై తలదాచుకుంటోన్న గిరిజన గ్రామాల ప్రజలు..
ఇప్పటికే రంపచోడవరం చేరుకున్న ఎస్డీఆర్ఎఫ్ బృందాలు..
టూరిజం బోట్లలో ముంపు గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తలించేందుకు చర్యలు..
7 టూరిజం బోట్లతో పాటు, 17 ఇంజన్ పడవలను ఏర్పాటు చేసిన అధికారులు..
వరద తీవ్ర రూపం దాల్చడంతో నీట మునిగిన దేవిపట్నం పోలీస్ స్టేషన్..
- 17 Aug 2020 5:08 AM GMT
గోదావరి వరదలతో 64 గ్రామాలు ముంపు
పశ్చిమ గోదావరి: జిల్లాలో గోదావరి వరదల ప్రభావంతో 64 గ్రామాలు ముంపు
1544 మందిని సురక్షిత ప్రాంతాలకు, సహాయ శిబిరాలకు తరలింపు
కుక్కునూరు, వేలేరుపాడు, పోలవరం, కొవ్వూరు, ఆచంట, యలమంచిలి, టి.నర్సాపురం మండలాల్లో వరద ప్రభావం
సహాయక చర్యలకు 5 లాంచీలు, 21 బోట్లు, రెండు ఎ.న్డీ.ఆర్.ఎఫ్ బృందాలు సిద్ధం
పోలవరం వద్ద ప్రమాదకరంగా ప్రవహిస్తున్న గోదావరి
పోలవరం కాపర్ డ్యాం వద్ద 30 అడుగులకు చేరిన వరద
పోలవరం సహా పలు గ్రామాల్లోని ప్రజలను ఖాళీ చేయించి సహాయ శిబిరాలకు తరలిస్తున్న అధికారులు
పాత పోలవరంలో నెక్లెస్ బండ్ కు గండి పడటంతో ఇసుక బస్తాలతో రక్షించే యత్నం
పూర్తిగా వరద నీట మునిగిన పోలవరం ప్రాజెక్ట్ ప్రాంతం
కొవ్వూరు గోష్పాదక్షేత్రంలోభారీగా చేరిన వరద నీరు
- 17 Aug 2020 4:01 AM GMT
సీనియర్ జర్నలిస్ట్ వారణాసి నాగార్జున రావు అకాల మరణం
నెల్లూరు :
-- నెల్లూరు సీనియర్ జర్నలిస్ట్ వారణాసి నాగార్జున రావు అకాల మరణం
-- గత వారం రోజులుగా కొద్దిపాటి అనారోగ్యంతో బాధపడుతూ తెల్లవారుజామున మృతి.
- 17 Aug 2020 4:00 AM GMT
టిడిపి నాయకులు పరసా వెంకటరత్నంకి సతీవియోగం.
నెల్లూరు:
మాజీ మంత్రి,టిడిపి సీనియర్ నాయకులు పరసా వెంకటరత్నంకి సతీవియోగం. ఆయన భార్య కస్తూరమ్మ (55)మృతి.
గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ తిరుపతిలోని తన నివాసంలో మృతి చెందిన పరసా కస్తూరిమ్మ.
- 17 Aug 2020 3:56 AM GMT
తుంగభద్ర డ్యాం 10 గేట్లు ఎత్తిన అధికారులు
అనంతపురం: తుంగభద్ర డ్యాం 10 గేట్లు 1.5 అడుగుల ఎత్తిన అధికారులు
- 22590 క్యూసెక్కుల నీరు కిందికి విడుదల
- డ్యాం కు కొనసాగుతున్న వరద ప్రవాహం.
- డ్యాం లో ప్రస్తుతం నీటి నిల్వ: 98.855 టీఎంసీలు.
- పూర్తి సామర్థ్యం: 100.855
- ప్రస్తుత నీటిమట్టం: 1632.48 అడుగులు.
- పూర్తి స్థాయి నీటి మట్టం: 1633 అడుగులు.
- ఇన్ ఫ్లో: 28933 క్యూసెక్కులు.
- ఔట్ ఫ్లో: 16153 క్యూసెక్కులు.
- 17 Aug 2020 3:14 AM GMT
నరసరవుపేట జెఎన్టీయూకు శంకుస్థాపన చేయనున్న సీఎం
అమరావతి: ఉదయం 11 గంటలకు నరసరవుపేటలో జెఎన్టీయూకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన చేయనున్న సీఎం వైఎస్ జగన్
15004 సచివాలయాల్లో డిజిటల్ పేమెంట్లను నేడు ప్రారంభించనున్న సీఎం వైఎస్ జగన్
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI), కెనరా బాంక్ తో కలిసి అమలు చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం
వివిధ ప్లాట్ పామ్స్ ద్వారా క్యూ ఆర్ కోడ్, యూపీఐ ద్వారా చెల్లింపులకు వెసులుబాటు
- 17 Aug 2020 3:11 AM GMT
పెరుగుతున్న గోదావరి వరద ఉధృతి
ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ: పెరుగుతున్న గోదావరి వరద ఉధృతి
- ధవళేశ్వరం వద్ద కొనసాగుతున్న రెండవ ప్రమాద హెచ్చరిక
- మరికాసేపట్లో మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం
- ప్రస్తుత ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 17,18,939 క్యూసెక్కులు
- సహాయక చర్యల్లో ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు సహకరించాలి
- గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
- విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె. కన్నబాబు
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire