Live Updates:ఈరోజు (ఆగస్ట్-17) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు సోమవారం, 17 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, కృష్ణపక్షం త్రయోదశి(ఉ. 10-37 వరకు) తదుపరి చతుర్దశి; పుష్యమి నక్షత్రం (తె. 05-34 వరకు) తదుపరి ఆశ్లేష నక్షత్రం, అమృత ఘడియలు ( రా. 11-12 నుంచి 12-47 వరకు), వర్జ్యం (మ.01-38 నుంచి 03-14 వరకు) దుర్ముహూర్తం (మ.12-29 నుంచి 01-19 వరకు తిరిగి మ.03-00 నుంచి 3-50 వరకు) రాహుకాలం (ఉ. 07-30 నుంచి 09-00 వరకు) సూర్యోదయం ఉ.05-46 సూర్యాస్తమయం సా.06-22

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • ప్రకాశం బ్యారేజీ వ‌ద్ద కృష్ణ‌మ్మ ప‌ర‌వాళ్లు
    17 Aug 2020 3:08 AM GMT

    ప్రకాశం బ్యారేజీ వ‌ద్ద కృష్ణ‌మ్మ ప‌ర‌వాళ్లు

    విజయవాడ: ప్రకాశం బ్యారేజీ 70గేట్లలో 50గేట్లు మూడు అడుగులు, 20గేట్లు రెండు అడుగులు ఎత్తారు

    1.32లక్షల క్యూసెక్కుల నీటిని సరాసరి నదిలోకి, 7వేల క్యూసెక్కులను కాలువలకు వదిలారు

    ఇన్ ఫ్లో 1.4లక్షల క్యూసెక్కులుగా వరద కొనసాగుతోంది

  • కోనసీమలో  పెరుగుతున్న గోదావరి వరద ఉధృతి
    17 Aug 2020 3:05 AM GMT

    కోనసీమలో పెరుగుతున్న గోదావరి వరద ఉధృతి

    తూర్పు గోదావరి జిల్లా: కోనసీమలో క్రమేణా పెరుగుతున్న గోదావరి వరద ఉధృతి

    వశిష్ట ,వైనతేయ ,గౌతమి , వృద్ధ గౌతమి నదీ పాయల తోపాటు పొంగిపొర్లుతున్న ప్రధాన డ్రైన్లు

    21 లంక గ్రామాలకు బాహ్యప్రపంచంతో సంబంధాలు కట్

    బోడసకుర్రు ,మురమళ్ళ,నడవపల్లి వద్ద జలదిగ్బంధంలో ఇల్లు

    పశువులకు మేత ఇవ్వాలని కోరుతున్న రైతులు

    లంకలో పళ్ళు కూరగాయలు తోటలతో పాటు , వాణిజ్యపంటలు వరద నీటిలో మునక

    కోనసీమలోని 16 మండల కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు

    ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్న ఆర్డీవో వసంతరాయుడు

    రేపు అమావాస్య కావడంతో వరద నీరు మరింత పెరుగుతుందని ఆందోళన చెందుతున్న కోన సీమ వాసులు

Print Article
Next Story
More Stories