Live Updates: ఈరోజు (సెప్టెంబర్-16) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు పంచాంగం
ఈరోజు బుధవారం | 16 సెప్టెంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | భాద్రపద మాసం | కృష్ణపక్షం | చతుర్దశి రా.7-03వరకు తదుపరి అమావాస్య | మఘ నక్షత్రం మ.12-07వరకు తదుపరి పుబ్బ | అమృత ఘడియలు: ఉ.9-47 నుంచి 11-20 వరకు తిరిగి తె.4-52 నుంచి | వర్జ్యం: రా.7-43 నుంచి 9-15 వరకు | దుర్ముహూర్తం: ఉ.11-31 నుంచి 12-20 వరకు | రాహుకాలం: మ.12-00 నుంచి 1-30 వరకు | సూర్యోదయం: ఉ.5-51 | సూర్యాస్తమయం: సా.6-01
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 16 Sep 2020 8:39 AM GMT
Guntur updates: అమ్మవడి కార్యక్రమం ద్వారా పదమూడు లక్షల మంది మహిళలు లబ్ది పొందారు..హోం మంత్రి సుచరిత..
గుంటూరు...
హోం మంత్రి సుచరిత కామెంట్స్...
-కరోనా తో ఇబ్బందులు పడుతున్నా 14 వందల కోట్ల రూపాయలు సున్నా వడ్డీ రుణాలు ఇచ్చారు.
-హామీ ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నెరవేర్చుతున్నారు.
-అరవై ఐదు వేల కోట్లను రూపాయలను ఈ పద్నాలుగు సంవత్సరాల కాలంలో ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలకు ఇచ్చింది.
-రాష్ట్రానికి సంక్షేమం పరిచయం చేసింది వైయస్ రాజశేఖర రెడ్డి అయితే దానిని అభివృద్ధి చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి జగన్.
-గత ప్రభుత్వన్ని నమ్మి డ్వాక్రా మహిళలు మోసపోయారు.
-ప్రతీ కుటుంబంలో లబ్ది పొందిన వాళ్ళు ఉన్నారు...వాళ్ళంతా ముఖ్యమంత్రి కి అండగా ఉంటారు.
- 16 Sep 2020 8:13 AM GMT
Srikakulam updates: జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు వర్ధంతి..
శ్రీకాకుళం జిల్లా..
-జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు వర్ధంతి..
-కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా పార్టీ అధ్యక్షురాలు గౌతు శిరీష, టిడిపి నాయకులు..
-కోడెల చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన తెలుగుదేశం నేతలు..
- 16 Sep 2020 8:10 AM GMT
Botcha Satyanarayana Comments: వీడియో కాన్ఫెరెన్స్‌లో పాల్గొన్న మంత్రి బొత్స సత్యనారాయణ..
బొత్స కామెంట్స్..
- పరీక్షల నిర్వహణలో 77,558 మంది సిబ్బంది పాల్గొంటున్నారు.
- పరీక్షా కేంద్రాలకు ఆర్టీసి నుంచి బస్సులను నడపాలి
- ప్రైవేటు ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ కూడా అందుబాటులో వుండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
- కేంద్ర గృహ మంత్రిత్వ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన కోవిడ్ 19 నిబంధనల ప్రకారం భౌతిక దూరం తప్పని సరిగా పాటించాలి.
- పరీక్ష కేంద్రం ప్రవేశ ద్వారం వద్ద ధర్మల్ స్కానర్ తప్పనిసరి
- జిల్లా కలెక్టర్లు, జెసిలు, ఎస్పీలు పరీక్షలు సజావుగా జరిగేలా సమన్వయంతో చర్యలు తీసుకోవాలి
- గత ఏడాది ఏ రకంగా పకడ్భందీగా పరీక్షలు నిర్వహించారో, అదే విధంగా ఎటువంటి ఆరోపణలకు అవకాశం లేకుండా పరీక్షలు జరగాలి.
- 16 Sep 2020 8:00 AM GMT
Vizianagaram updates: విజయనగరం జిల్లాలో భారీగా గంజాయి స్వాధీనం..
విజయనగరం..
-అరకు నుంచి ఒడిశా రాష్ట్రం రాయఘడ కు అక్రమంగా తరలిపోతున్న గంజాయిని పట్టుకున్న కొమరాడ పోలీసులు
-పార్వతీపురం వైపు నుంచి రాయఘడ రోడ్డులో లారీలో తరలిపోతున్న గంజాయి
-కొమరాడ వద్ద రహదారి గోతుల కారణంగా ట్రాఫిక్ నిలిచిపోవటంతో లారీలో గంజాయిని గుర్తించిన పోలీసులు
-సుమారు కోటి 20 లక్షల రూపాయల విలువ చేసే 675 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు
- 16 Sep 2020 7:57 AM GMT
Amaravati updates: జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీడియో కాన్ఫెరెన్స్..
అమరావతి..
పంచాయతీరాజ్ శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కామెంట్స్..
-తాడేపల్లి పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం నుంచి గ్రామ, వార్డు సచివాలయాల పోస్ట్‌ల భర్తీపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీడియో కాన్ఫెరెన్స్
- వీడియో కాన్ఫెరెన్స్‌లో పాల్గొన్న పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ గోపాలకృష్ణ ద్వివేది, పిఆర్ కమిషనర్ గిరిజాశంకర్, మున్సిపల్ అడ్మినిష్ట్రేషన్ కమిషనర్ విజయ్ కుమార్, తదితరులు
- కోవిడ్ నేపథ్యంలో సచివాలయ పోస్ట్‌ల భర్తీలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి
- 16,208 ఖాళీ పోస్టులకు 10,56,931 మంది దరఖాస్తు చేసుకున్నారు.
- ఈనెల 20 నుంచి పరీక్షలు ప్రారంభమవుతున్నాయి.
- మొత్తం 7 రోజుల పాటు 14 రకాల పరీక్షలు నిర్వహిస్తున్నాం.
- 20వ తేదీన 6,81,664 మంది పరీక్షలకు హాజరు కానున్నారు.
- మొదటి రోజు ఉదయం 2,221 కేంద్రాలు...
- మధ్యాహ్నం 1068 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించడానికి సర్వం సిద్ధం చేశాం.
- కరోనా పాజిటీవ్ వున్న అభ్యర్ధులకు ఐసోలేషన రూంలను సిద్దం చేశాం.
- పిపిఇ కిట్‌లతో ఐసోలేషన్ రూంలో ఇన్విజిలేషన్
- 16 Sep 2020 7:46 AM GMT
Vijayawada updates: మంత్రి వెల్లంపల్లిని భర్తరఫ్ చేయాలి..దేవినేని ఉమామహేశ్వరరావు..
విజయవాడ..
దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ మంత్రి..
-ఈవో బాధ్యత రాహిత్యంగా మాట్లాడుతున్నారు.
-సింహాలు పోయాయి అని క్లియర్ గా కనిపిస్తుంటే ఇంకా ఈవోని మంత్రి వెనకేసుకొస్తున్నారు.
-Ias స్థాయి అధికారిని మార్చి ఎందుకు కింద స్థాయి అధికారిని ఈవో గా తీసుకువొచ్చారు.
-వెంటనే ఈవో ని సస్పెండ్ చేసి ఒక పూర్తి స్థాయి జ్యూడిషల్ దర్యాప్తు చేయాలి.
-ఈ 16 నెలల్లో జరిగిన అన్ని ఘటనలను అన్ని సీబీఐ చేస్తా విచారణ చేపించాలి.
-దేవాలయాలు, చర్చ, మసీదులు పై దాడులను టీడీపీ తీవ్రంగా కండిస్తుంది.
-24 గంటలు గడుస్తున్నా ఇప్పటివరకూ పోలీస్ కేస్ పెట్టలేదు.
-భక్తుల మనోభావాలు కాపాడాల్సిన భద్యత మంత్రికి, ప్రభుత్వానికి లేదా ?
-ఈ ఘటనల పై వెంటనే ముఖ్యమంత్రి స్పందించాలి.
-నిందితులను కాపాడాలనే ప్రయత్నం ఇక్కడ అధికారులు, మంత్రి చేస్తున్నారు.
-రాష్ట్రంలో అన్ని ప్రముఖ దేవాలయాలలో ఇలాంటి దాడులు జరుగుతుంటే ప్రభుత్వం మొద్దు నిద్ర పోతుంది.
- 16 Sep 2020 7:34 AM GMT
Amaravati updates: కోడెల శివప్రసాదరావు ప్రధమ వర్ధంతి సందర్భంగా ఆ ప్రజానేత స్మృతికి నివాళులు.. నారా చంద్రబాబు నాయుడు..
అమరావతి..
-టీడీపీ జాతీయ అధ్యక్షులు, శాసనసభ ప్రధాన ప్రతిపక్ష నేత, నారా చంద్రబాబు నాయుడు..
-డాక్టరుగా పలనాటి ముద్దుబిడ్డ అయ్యారు.
-రాజకీయ నేతగా పల్నాటి పులి అనిపించుకున్నారు.
-36ఏళ్ళ పాటు తెలుగుదేశం పార్టీతో ఉండి ప్రజల కష్టనష్టాలలో అండగా నిలిచిన నేత కోడెల శివప్రసాదరావు గారు.
-అటువంటి నేత ఈరోజు మనమధ్య లేకపోవడం రాష్ట్ర రాజకీయాలకే తీరనిలోటు.
-కోడెల ప్రజాసేవ గురించి కోటప్పకొండ ఆలయం చెబుతుంది.
-స్వచ్ఛాంధ్రప్రదేశ్ కన్వీనర్‌గా నరసరావుపేట, సత్తెనపల్లిలో రికార్డుస్థాయిలో నిర్వహించిన స్వచ్ఛ కార్యక్రమాలు ఆయన పట్టుదలకు నిదర్శనం.
-అవయవదాన కార్యక్రమాన్ని సామూహిక కార్యక్రమం చేసిన ఘనత కోడెలది.
-ఏపీ శాసనసభ తొలి సభాపతిగా ఆయన నిర్వహించిన పాత్ర ఆదర్శనీయం.
- 16 Sep 2020 7:30 AM GMT
Vijayawada updates: విజయవాడ రూరల్ నిడమానురు సాయి బాబా గుడి వద్ద ఉద్రిక్తత.....
కృష్ణాజిల్లా:
-బీజేపీ, జనసేన పార్టీ నాయకులు గుడివద్ద నిరసన తెలియజేస్తుంటే వారిపై దాడికి దిగిన స్థానిక వైసీపీ నాయకులు, గ్రామస్తులు
-మా గ్రామంలో సమస్య పరిష్కారం చేసుకుంటాం మీరు ఈ విషయాన్ని ఎక్కువ చేయకండి అని బాహా బాహి కి దిగిన స్థానిక వై.సి.పి.నాయకులు.
-రంగంలోకి దిగిన పోలీసులు,ఇరు వర్గాల కు సర్ది చెప్పిన పోలీసులు
- 16 Sep 2020 7:26 AM GMT
Antarvedi updates: అంతర్వేది మీద దుర్మార్గం చేసిన వారిపై చర్యలు లేవు..విశ్వహిందూ పరిషత్, రవి..
విశ్వహిందూ పరిషత్, రవి..
-రాజమండ్రిలో వినాయక విగ్రహం, దుర్గాదేవి మందిరంలో సింహాల అపహరణ, శ్రీకాళహస్తిలో ఆలయ పవిత్రతకు భంగం
-హిందూ దేవాలయాలపై అపచారం విషయంలో అఖిలపక్ష సమావేశం వేయాలి
-హిందూ ధర్మ ప్రతినిధులతో ఒక సమావేశం ఏర్పాటు చేయాలి
-అంతర్వేదిలో కార్యకర్తలపై పెట్టిన కేసులు ఎత్తివేయాలి
- 16 Sep 2020 7:24 AM GMT
Vijayawada updates: అంతర్వేది అంశంపై ఉవ్వెత్తున అందరూ ప్రజలూ వెళ్ళారు..సోము వీర్రాజు..
విజయవాడ..
బీజెపి ఏపీ ఛీఫ్, సోము వీర్రాజు..
-జగన్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచీ శ్రీకాకుళం, ప్రకాశం, అంతర్వేది అంశాలపై చర్యలు తీసుకోలేదు
-హిందూ దేవాలయాలపై ప్రభుత్వ పవిత్రతపై అనుమానం ఉంది
-41 మంది యువకులపై కేసులు పెట్టారు
-చర్చి మీద రాళ్ళు వేసిన దుండగులు పారిపోయారు
-అంతర్వేది అంశంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించే యువకులను అరెస్టు చేసారు
-ప్రభుత్వం హిందూత్వం పై వ్యతిరేకత చూపిస్తుండడంపై బీజెపీ ఉద్యమం
-ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం
-గవర్నర్ ద్వారా ఈ అంశంపై ఒత్తిడి తెచ్చేలా మాట్లాడాము
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire