Live Updates: ఈరోజు (సెప్టెంబర్-16) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 16 సెప్టెంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు బుధవారం | 16 సెప్టెంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | భాద్రపద మాసం | కృష్ణపక్షం | చతుర్దశి రా.7-03వరకు తదుపరి అమావాస్య | మఘ నక్షత్రం మ.12-07వరకు తదుపరి పుబ్బ | అమృత ఘడియలు: ఉ.9-47 నుంచి 11-20 వరకు తిరిగి తె.4-52 నుంచి | వర్జ్యం: రా.7-43 నుంచి 9-15 వరకు | దుర్ముహూర్తం: ఉ.11-31 నుంచి 12-20 వరకు | రాహుకాలం: మ.12-00 నుంచి 1-30 వరకు | సూర్యోదయం: ఉ.5-51 | సూర్యాస్తమయం: సా.6-01
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 16 Sep 2020 4:05 PM GMT
MP Balli Durga Prasad: తిరుపతి ఎంపీ మృతిపై టిటిడి ఛైర్మన్ సంతాపం
- తిరుపతి పార్లమెంటు సభ్యుడు శ్రీ బల్లి దుర్గాప్రసాద్ మృతికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ బాధ్యులు(రీజనల్ ఇన్‌చార్జ్), శ్రీ వైవి.సుబ్బారెడ్డి బుధవారం ఒక ప్రకటనలో సంతాపం వ్యక్తం చేశారు. శ్రీ దుర్గాప్రసాద్ అనారోగ్యంతో చెన్నై అపోలో ఆసుపత్రిలో మృతి చెందారు.
- సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న శ్రీ దుర్గాప్రసాద్ మూడు సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా ప్రజలకు విశేష సేవలందించారని కొనియాడారు. నెల్లూరు జిల్లా ప్రజలకు ఆయన నిత్యం అందుబాటులో ఉండేవారని చెప్పారు.
- 2019 ఎన్నికల్లో తిరుపతి లోక్‌సభ స్థానం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించిన శ్రీ దుర్గాప్రసాద్ నియోజకవర్గంలోని ప్రజాసమస్యల పట్ల వెనువెంటనే స్పందించేవారని నివాళులు అర్పించారు.
- ఆయన మృతి పార్టీకి తీరని లోటని, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
- 16 Sep 2020 12:49 PM GMT
Amaravati updates: రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులపై సీఎం వైయస్ జగన్ సమీక్ష..
అమరావతి..
-సాగునీటి ప్రాజెక్టులపై క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్ష
-ప్రాధాన్యతా క్రమంలో ప్రాజెక్టులు పూర్తి చేయండి
-వృథాగా పోతున్న వరద జలాలను ఒడిసి పట్టండి
-చిత్రావతి, గండికోట ప్రాజెక్టుల్లో నీరు నింపాలి
-సజావుగా భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలు
-ఎక్కడా రైతులను ఇబ్బంది పెట్టేలా చర్యలు వద్దు
-వారి పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించండి
- 16 Sep 2020 12:23 PM GMT
Amaravati updates: నైపుణ్యమే యువత భవితకు ఆయుధం: మేకపాటి గౌతమ్ రెడ్డి..
అమరావతి..
పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
• 30 నైపుణ్య కళాశాలల ఏర్పాటే ముఖ్యమంత్రి ధ్యేయం, మంత్రిగా నాకు సార్థకత
• స్కిల్ కాలేజీల్లో భాగస్వామ్యమైన టెక్ మహీంద్ర ఫౌండేషన్, బయోకాన్ అకాడమీ, స్నైడర్ ఎలక్ట్రిక్
• ఎపిఎస్‌ఎస్‌డిసితో టెక్ మహీంద్ర, బయోకాన్, స్నైడర్ కంపెనీల ఎంవోయూ
• మంత్రి సమక్షంలో ఎపిఎస్‌ఎస్‌డిసి ఎండి, సీఈవో డాక్టర్ అర్జా శ్రీకాంత్, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మూడు సంస్థల ప్రతినిధుల సంతకాలు
• నైపుణ్యాభివృద్ధి శాఖ అధికారులకు మంత్రి అభినందనలు
• విశాఖలో టెక్ మహీంద్ర ఆధ్వర్యంలో లాజిస్టిక్ రంగంలో 'సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్'
• నెల్లూరులో స్నైడర్ భాగస్వామ్యంతో ఎలక్ట్రికల్ విభాగంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్
• స్కిల్ కాలేజీల్లో లైఫ్ సైన్సెస్ డొమైన్ లో నాలెడ్జ్ పార్టనర్ గా బయోకాన్ అకాడమి
- 16 Sep 2020 11:30 AM GMT
National updates: టిడిపి నాయకులు తప్పు చేశారు కాబట్టే దర్యాప్తుకు అడ్డుపడుతున్నారు..సురేష్ , వైయస్సార్ కాంగ్రెస్ ఎంపీ..
జాతీయం..
సురేష్ , వైయస్సార్ కాంగ్రెస్ ఎంపీ..
-న్యాయం తప్పకుండా గెలుస్తుందని మా నమ్మకం
-సుప్రీంకోర్టుకు వెళ్లి న్యాయం కోసం పోరాటం చేస్తా ము
-పెద్దవారికి ఒక రకంగా, చిన్న వారికి మరో రకంగా న్యాయం జరగడం అనేది సరైంది కాదు
-సొంత నియోజకవర్గానికి వెళ్తే తంతారని భయంతో ఢిల్లీలో రఘురామకృష్ణ ఉంటున్నాడు
-మిథున్ రెడ్డి పైన అవాకులు చెవాకులు పేళుతున్నాడు
-రఘురామకృష్ణంరాజు చవట దద్దమ్మ లాగా మాట్లాడుతున్నాడు
-ఆయన గజ్జి కుక్క కంటే హీనంగా మాట్లాడుతున్నాడు
-త్వరలోనే రాజకీయాల నుంచి ఆయన కనుమరుగు కాక తప్పదు
-రఘురామకృష్ణరాజు కు ప్రజలు సరైన గుణపాఠం చెప్తారు
-మోసగాడు, చీటర్ కు ఓటు పెడితే నీకు 545 ఓట్లు పడతాయి
-త్వరలోనే రాజు పై అనర్హత వేటు తప్పదు
-చీప్ క్యారెక్టర్ కాబట్టి బీజేపీ వాళ్ళు నిన్ను బీజేపీలో చేర్చు కోవడం లేదు
- 16 Sep 2020 11:23 AM GMT
National updates: ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు సభలో లిఖితపూర్వక సమాధానం..
జాతీయం..
-ఆంధ్రప్రదేశ్ పట్టణ స్థానిక సంస్థలకు రూ 423 కోట్ల బకాయిలున్న కేంద్రం..
-2018-19 కి రూ 183.25 కోట్లు,2019-20కి గాను రూ 239.95 కోట్లు కేంద్రం చెల్లించాల్సి ఉందన్న కేంద్రం
-త్వరగా ఏపీకి బకాయిలు విడుదల చేయాలని ఆర్థిక శాఖకు సిఫార్సు చేసినట్లు తెలిపిన మంత్రి
-ఏపీతో పాటు మిగతా అన్ని రాష్ట్రాలకు బకాయి నిధులు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడి
-బకాయిల చెల్లింపుపై మార్చి 21, ఏప్రిల్ 16న ఆర్ధిక శాఖకు లేఖ రాసినట్టు వెల్లడి
- 16 Sep 2020 11:07 AM GMT
Srikakulam Corona Updates: జిల్లాలో గడిచిన 24 గంటల్లో 495 కరోనా కేసులు నమోదు..
శ్రీకాకుళం జిల్లా..
-దీంతో జిల్లాలో 34,215 కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య..
-ఈరోజు కరోనా నుంచి కోలుకుని 813 మంది డిశ్చార్..
-ప్రస్తుతం జిల్లాలో 6,107 ఆక్టీవ్ కేసులు..
- 16 Sep 2020 10:39 AM GMT
Visakha updates: ఏపీలోని విశాఖ జిల్లా వామపక్ష తీవ్రవాద ప్రభావిత జిల్లాగా పరిగణిస్తున్నాం..
విశాఖ జిల్లా..
-ఎంపీల ప్రశ్నలకు రాజ్యసభలో కేంద్ర హోంశాఖ లిఖితపూర్వక సమాధానం:
-భద్రతా పరమైన ఖర్చు (సెక్యూరిటీ రిలేటెడ్ ఎక్స్‌పెండిచర్) స్కీమ్ పరిధిలో విశాఖ జిల్లా ఉంది
-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ పథకం కింద 2019-20లో రూ. 37.23 కోట్లు ఇచ్చాం
-గత ఐదేళ్లలో 95.47 కోట్లు ఆంధ్రప్రదేశ్‌కి ఇచ్చాం
-నక్సలైట్ల లొంగుబాట్లను ప్రోత్సహించే పథకాలు అమలు చేస్తున్నాం
-లొంగిపోయనవారు వ్యాపారాలు చేసుకునేందుకు శిక్షణ - ఆ సమయంలో నెలకు రూ. 6,000 స్టైపండ్ ఇస్తున్నాం
- 16 Sep 2020 10:34 AM GMT
Guntur updates: అచ్చంపేట మండలం ఓర్వకల్లు సచివాలయ ఉద్యోగి శుభ నివాసరెడ్డి నిర్వాకం ...
గుంటూరు....
-మృతిచెందిన వ్యక్తులపేర్లుతో పించను మంజూరు చేసిన సోషల్‌వెల్ఫేర్ అసిస్టెంట్ అధికారి...
-మృతుల పేర్లుతో పించను సొమ్మును ఉద్యోగి కాజేశాస్తునట్లు ఆధారాలతో పట్టుకున్న స్థానిక వైసిపి నాయకుల...
-ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన స్థానిక నాయకులు... ఆధారాలతో జిల్లా అధికారులు తో నివేదిక ఇచ్చిన మండల అధికారులు.......
- 16 Sep 2020 9:58 AM GMT
Tirumala-Tirupati updates: అయోధ్యలో శ్రీవారి ఆలయ నిర్మాణంకు సిద్దమవుతున్న టిటిడి..
తిరుమల-తిరుపతి:
-ఆలయ నిర్మాణంకు 5 ఏకరాల స్థలం కేటాయించాలని యూపి ప్రభుత్వాన్ని కోరిన టిటిడి
-ఎసి గదులు ధరలు పెంచే యోచబలో టిటిడి త్వరలోనే అమలుకు సన్నాహాలు
-వెయ్యి రూపాయల ఎసి గదులు ధరలను 1500 కి పెంచాలని నిర్ణయం
-భక్తులు సౌకర్యార్ధం 120 ఎసి గదులును అడ్వాన్స్ రిజర్వేషన్ విధానం లో కేటాయించాలని నిర్ణయం
-పాత ధరలకే టిటిడి డైరీ, క్యాలెండర్ లు విక్రయించాలని టిటిడి నిర్ణయం
-నూతన ఏడాదికి 15 లక్షల శ్రీవారి క్యాలండర్లు,10 లక్షల డైరిలను విక్రయించనున్న టీటీడీ...
-క్యాలండర్, డైరిల ధరలను పెంచాలని ప్రతిపాదించిన పర్చేస్ కమిటి....
- 16 Sep 2020 8:42 AM GMT
Kadapa updates: పులివెందులలో గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్న ఇద్దరి అరెస్టు ...
కడప :
-వారి వద్ద నుండి పది కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు .....
-పులివెందుల మండలం నామాలగుండు వద్ద వాహనాల తనిఖీలు చేస్తుండగా ఒక ఆటోలో గంజాయి లభించింది ....
-ఇద్దరు నిందితుల అరెస్టు ....ఒకరు పరారీ .....
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire