Live Updates: ఈరోజు (16 నవంబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు పంచాంగం
ఈరోజు సోమవారం | 16 నవంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | కార్తిక మాసం | శుక్లపక్షం | పాడ్యమి ఉ. 9-07 తదుపరి విదియ | అనూరాధ నక్షత్రం సా. 5-41 తదుపరి జ్యేష్ఠ | వర్జ్యం రా.10-59 నుంచి 12-29 వరకు | అమృత ఘడియలు ఉ.7-56 నుంచి 9-26 వరకు | దుర్ముహూర్తం మ.12-07 నుంచి 12.52 వరకు తిరిగి మ.2-21 నుంచి 3-06 వరకు | రాహుకాలం ఉ. 7-30 నుంచి 9-00 వరకు | సూర్యోదయం: ఉ.06-09 | సూర్యాస్తమయం: సా.05-21
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 16 Nov 2020 12:24 PM GMT
Tirumala-Tirupati Updates: రమణధీక్షితులు, విజయసాయిరెడ్డిలపై టిటిడి పరువు నష్టం దావా కేసులో ట్విస్ట్....
తిరుపతి..
- లోక్ అదాలత్ ద్వారా కేసును పరిష్కారం చేసుకునే యోచనలో టీటీడీ...
- లోక్ అదాలత్ ద్వారా కేసు ఉపసంహరణ చేసుకుంటే....టీటీడీ చెల్లించన రెండు కోట్లు వెనక్కి వచ్చే అవకాశం....
- గత పాలకమండలి హయంలో 100 కోట్లు పరువునష్టం కేసు వేసిన టీటీడీ...
- పరువు నష్టం కేసును వెనక్కి తీసుకోవాలని ఈ ఏడాది ఫిభ్రవరిలో తీర్మానం చేసిన పాలకమండలి...
- మార్చిలో కోర్టులో ఉపసంహరణ పిటిషన్ వేసిన టీటీడీ...
- ఉపసంహరణ పిటిషన్ వేస్తే ....కోర్టుకు టీటీడీ చెల్లించిన రెండు కోట్లు వెనక్కి వచ్చే అవకాశం లేకపోవడంతో...టీటీడీ పై విమర్శలు...
- కేసును ఉపసంహరించుకోవాలన్న నిర్ణయం పై వెనక్కి తగ్గుతు కోర్టులో మెమో దాఖలు చేసిన టీటీడీ...
- 23వ తేదికి కేసును వాయిదా వేసిన జడ్జి...
- 16 Nov 2020 12:20 PM GMT
Vijayawada Updates: పాముల కాల్వ వద్ద రోడ్డు ప్రమాదం..
విజయవాడ..
-ఎదురెదురు వస్తున్న బైకు, లారీ ఢీ
-బైకు నడుపుతున్న నరేంద్ర అనే వ్యక్తి మృతి
- 16 Nov 2020 12:17 PM GMT
Amaravati Updates: బి.జె.పి. రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజుకు అసలు మానవత్వం ఉందా?
అమరావతి...
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ.
-నంద్యాలలో ఇద్దరు చిన్న పిల్లలతో సహా అబ్దుల్ సలాం కుటుంబం మొత్తం చనిపోతే వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడతారా?
-వాళ్లను సోము వీర్రాజు మత కోణంలో చూస్తున్నారేతప్ప మనుషులుగా చూడలేదు.
-ప్రతి విషయం మత కోణంలో చూడటం వీర్రాజుకు తగదు.
-సోము వీర్రాజు నంద్యాల వెళ్లి నిజాలు తెలుసుకొని మాట్లాడాలి.
- 16 Nov 2020 12:10 PM GMT
Kurnool District Updates: అబ్దుల్ సలాం కుటుంబంపట్ల సీఎం జగన్ వైఖరిని తప్పు పట్టిన పత్తికొండ టీడీపీ నాయకులు...
కర్నూల్ జిల్లా
- పత్తికొండ అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్యకు కారణమైన పోలీసులకు బెయిల్ నిరాకరించి,కఠినంగా శిక్షించాలని టీడీపీ భారీ ర్యాలీ.
- ఈ కేసు పక్క దోవ పట్టకుండా వెంటనే సీబీఐ కి అప్పగించాలని టీడీపీ నాయకులు డిమాండ్.
- అబ్దుల్ సలాం కుటుంబంపట్ల సీఎం జగన్ వైఖరిని తప్పు పట్టిన పత్తికొండ టీడీపీ నాయకులు.
- 16 Nov 2020 5:35 AM GMT
Vizianagaram Updates: నేడు లబ్ధిదారులకు ఇళ్లు స్వాధీన కార్యక్రమం చేపట్టిన సిపిఐ నాయుకులు...
విజయనగరం..
* సారిపల్లిలోని టిడ్కో ఇళ్లను లబ్ధిదారులతో స్వాదీనం కార్యక్రమానికి సిద్దమవుతున్న సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్ ను నిర్బంధంలో కి తీసుకున్న పోలీసులు.
* టిడ్కో ఇళ్లను తక్షణమే లబ్ధిదారులకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర స్థాయిలో చేస్తున్న పోరాటం సిపిఐ నాయుకులు.
- 16 Nov 2020 5:32 AM GMT
East Godavari Updates: కొత్తపేట మం. పలివెలలో కార్తీక సోమవారం సందడి..
తూర్పుగోదావరి :
కొత్తపేట
- స్వయంభూ ఉమా కొప్పులింగేశ్వరస్వామి వారి దేవాలయానికి పోటెత్తిన భక్తులు..
- ఓంకార నాదం.. శివనామస్మరణ తో మారుమ్రోగిన శివాలయాలు..
- 16 Nov 2020 5:30 AM GMT
Nellore District Updates: నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేని భారీ వర్షాలు..
నెల్లూరు:
-- ఒక్కరోజే 27 సెంటీమీర్ల వర్షపాతం నమోదు. నిండుకుండను తలపిస్తున్న సోమశిల జలాశయం.
-- ప్రస్తుతం జలాశయంలో 76.12 టీఎంసీల నీటిమట్టం.
-- పూర్తి సామర్థ్యం 77.88 టిఎంసి లు.
-- తీరంలోని డెల్టా ప్రాంతంలో ప్రమాద స్థాయిలో నిండిన 70కి పైగా చెరువులు.
-- తోలిపంట రబీకి సిద్దం చేసిన నారుమళ్లు నీట మునక.
-- ఎగువ ప్రాంతాల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాల తోజలాశ యానికి పెరిగిన వరద.
-- జలాశ యానికి 10722 క్యూసెక్కులు వరదనీరు
-- ఏ క్షణమైనా దిగువకు క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని విడుదల చేయవలసి వస్తుందని తెలిపిన జలాశయం అధికారులు.
-- పెన్నా పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ.
-- వర్షాలకు తోడు కడలి పోటెత్తడంతో పల్లేపాలెం ను ముంచెత్తిన సముద్రంనీరు.
- 16 Nov 2020 5:28 AM GMT
Vizianagaram Updates: శివ నామస్మరణతో మారుమోగుతున్న శైవ క్షేత్రాలు...
విజయనగరం...
- కార్తిక మాసం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా శివ నామస్మరణతో మారుమోగుతున్న శైవ క్షేత్రాలు.
- భక్తులతో రద్దీగా మారిన శివాలయాలు
- 16 Nov 2020 4:35 AM GMT
Amaravati Updates: సీఎంఆర్ఎఫ్ చెక్కుల స్కాంలో అంతర్రాష్ట్ర నేరగాళ్ళు...
అమరావతి
- కర్ణాటక, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒరిస్సా లలో గాలింపు
- ఇప్పటి వరకూ 22 మందిని విచారించిన సీఐడీ
- 117 కోట్లస్కాంలో ప్రధాన సూత్రధారి సింగ్ తో పాటుగా మరికొంత మంది అరెస్టు
- 30 మందిని అనుమానితులుగా తేల్చిన సీఐడీ
- 16 Nov 2020 4:32 AM GMT
Krishna District Updates: జగ్గయ్యపేట టిడ్కో ఇండ్ల గృహప్రవేశానికి సిపిఐ రాష్ట్ర పార్టీ పిలుపు...
కృష్ణాజిల్లా...
- టిడ్కో భవనాల వద్ద 144 సెక్షన్ విధించిన అధికారులు
- సిపిఐ నాయకులను గృహనిర్బంధం చేసిన పోలీసులు
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire