Live Updates: ఈరోజు (సెప్టెంబర్-14) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు పంచాంగం
ఈరోజు సోమవారం | 14 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | భాద్రపద మాసం | కృష్ణపక్షం | ద్వాదశి (రా. 10-01వరకు) తదుపరి త్రయోదశి | పుష్యమి నక్షత్రం (మ. 1-22 వరకు) తదుపరి ఆశ్లేష | అమృత ఘడియలు: ఉ.6-57 నుంచి 8-33 వరకు | వర్జ్యం: రా.1-55 నుంచి 3-30 వరకు | దుర్ముహూర్తం: మ.12-20 నుంచి 1-09 వరకు తిరిగి మ. 2-47 నుంచి 3-36 వరకు | రాహుకాలం: ఉ. 7-30 నుంచి 9-00 వరకు | సూర్యోదయం: ఉ.5-50 | సూర్యాస్తమయం: సా.6-03
ఈరోజు తాజావార్తలు
Live Updates
- 14 Sep 2020 12:13 PM GMT
West Godavari Updates: ద్వారకాతిరుమల చిన్న వెంకన్న ఆలయాన్ని సందర్శించిన జిల్లా ఎస్పీ నారాయణ నాయక్..
పశ్చిమగోదావరి జిల్లా..
-ఆలయ ప్రాంగణాన్ని, ఆలయ పరిసరాలను పర్యవేక్షించిన ఎస్పీ..
-ఆలయ సెక్యూరిటీ, భద్రత, సీసీ కెమెరాల పనితీరును పరిశీలించిన ఎస్పీ..
-ఆలయానికి పటిష్ట భద్రతా కల్పించాలని అధికారులకు సూచించిన ఎస్పీ...
- 14 Sep 2020 12:10 PM GMT
Kadapa updates: వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో విచారణ చేపట్టిన సిబిఐ బృందం .....
కడప :
-మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో రెండవ విడత విచారణ చేపట్టిన సిబిఐ బృందం .....
-పులివెందుల పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీకాంత్ ను సిబిఐ అధికారులు డీఎస్పీ ఆఫీసులో విచారణ.....
-ఈ హత్యకు సంబంధించిన పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నట్టు సమాచారం .....
- 14 Sep 2020 11:29 AM GMT
Amaravati updates: రాష్ట్రంలో చేనేత రంగాన్ని కాపాడేందుకు కేంద్రం పై ఒత్తిడి తేవాలని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి నారా లోకేష్ లేఖ..
అమరావతి..
-ఏపీ లోని పొందూరు, ధర్మవరం, ఉప్పాడ, మంగళగిరి ప్రాంతాల్లో చేనేత గొప్ప వారసత్వ సంపదగా లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తోంది.
-ఆగస్టు లో కేంద్ర ప్రభుత్వం అఖిల భారత చేనేత బోర్డు, అఖిల భారత హస్తకళల బోర్డు, అఖిల భారత పవర్‌లూమ్ బోర్డును రద్దు చేసింది.
-ఈ బోర్డుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, చేనేత నిపుణులు, ప్రతినిధులు సభ్యులుగా ఉండేవారు.
-ఈ బోర్డులు తరచూ సమావేశమై చేనేత అభివృద్ధి,సంక్షేమంపై కేంద్రానికి సిఫార్సులు చేసేది.
-చేనేత రంగంలో సంపూర్ణ అభివృద్ధి కార్యక్రమాల రూపకల్పన, చేనేత రంగం ఎదుర్కొనే సమస్యలు పరిష్కరించడం ఈ బోర్డుల ప్రధాన లక్ష్యం.
-నిరుద్యోగాన్ని తగ్గించి చేనేతను ఒక సమర్థవంతమైన వృత్తిగా మార్చడంలో ఈ బోర్డులు ఎంతగానో కృషి చేసాయి.
-దేశ, విదేశాల్లో చేనేత ల మార్కెట్లను విస్తరించడానికి ప్రణాళికలు రచించడం ఈ బోర్డుల ఉద్దేశ్యం.
-ప్రభుత్వానికి-చేనేతల మధ్య ఉన్న ఏకైక వారధి అఖిల భారత చేనేత బోర్డు.
-కేంద్రం 3బోర్డులను రద్దు చేయటం చేనేత, హస్తకళాకారుల పరిస్థితి దయనీయంగా మారింది.
-గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక భద్రత కల్పించేందుకు వీటి పునరుద్ధరణ ఎంతో అవసరం
- 14 Sep 2020 11:24 AM GMT
Amaravati updates: దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి తో భేటీ అయిన ఆ శాఖ కమిషనర్ పి.అర్జునరావు..
అమరావతి..
-ఫిబ్రవరిలోపు అంతర్వేదిలో రథం నిర్మాణం పూర్తి చెయ్యాలన్న మంత్రి వెల్లంపల్లి
-అంతర్వేది స్వామి వారి కల్యాణోత్సవాల లోపు అందరి అభిప్రాయం పరిగణలోకి తీసుకొని రధం సిద్ధం చెయ్యాలన్న మంత్రి.
-రధం సిద్ధం చేసే క్రమంలో అన్ని అకృతులను పరిశీలించాలని అధికారులను అదేశించిన మంత్రి
-రథం నిర్మాణంపై చర్చించి ఆకృతిని తయారు చేయించారన్న దేవాదాయ శాఖ కమిషనర్
-కొత్త రథాన్ని శిఖరంతో కలిపి 41 అడుగుల ఎత్తు వచ్చేలా ఆకృతిని సిద్ధం చేశామని మంత్రి దృష్టికి తీసుకొచ్చిన కమిషనర్.
-ఆరు చక్రాలతో కూడిన రథం మొత్తాన్ని ఏడు అంతస్తుల్లా రూపొందిస్తున్న కమిషనర్.
-కొత్త రథం నిర్మాణంతో పాటు రథశాల మరమ్మతులు నిమిత్తం రూ.95 లక్షలు ఖర్చవుతుందని తెలిపిన కమిషనర్.
- 14 Sep 2020 11:06 AM GMT
Amaravati updates: ఏపీ డీజీపీపై హైకోర్టు ఆగ్రహం....
అమరావతి..
-అమలాపురం మండలం ఇందుపల్లిలో వెంకటరాజు అనే వ్యక్తి అదృశ్యం
-హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేసిన బాధితుడి మేనమామ
-వెంకటరాజు విషయంలో పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం
-గతంలో మూడు సార్లు జుడిషియల్ విచారణ చేస్తే పోలీసులదే తప్పని తేలిందంటూ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
-ఏపీలో పోలీస్ వ్యవస్థ గాడితప్పుతోందన్న హైకోర్టు
-ఏపీలో రూల్ ఆఫ్ లా అమలు కావడం లేదని మండిపాటు
-పోలీస్ వ్యవస్థను కంట్రోల్ చేయలేకపోతే డీజీపీ రాజీనామా చేయాలన్న హైకోర్టు
-గతంలో డీజీపీని పలు సార్లు కోర్టుకు పిలిపించినా మార్పు రాలేదన్న హైకోర్టు
-ప్రతిసారి ఇలాంటి పరిస్థితే వస్తే ప్రభుత్వానికి ఇబ్బంది వస్తుందని హైకోర్టు వ్యాఖ్య
-ప్రతి కేసులో సీబీఐ విచారణ సాధ్యం కాదన్న హైకోర్టు
- 14 Sep 2020 10:51 AM GMT
Srikakulam updates: జగన్ విద్యుత్ సంస్కరణలు ఎలా అమలు చేస్తాడో చూస్తాం..శైలజానాథ్..
శ్రీకాకుళం జిల్లా..
ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ కామెంట్స్..
-బిజెపి ప్రభుత్వానికి జగన్ అనుంగ మిత్రుడు..
-విద్యుత్ సంస్కరణలు ఏడాది అమలు చేయమని కేంద్ర పెద్దలు చెప్పగానే, ఇక్కడ సిద్ధం అయిపోయారు..
-చంద్రబాబు ఉచిత విద్యుత్ వ్యతిరేకి..
-రైతులకు అన్యాయం చేస్తే ఆ పాపం మిమ్మల్ని వదలదు..
-కరోనా కారణంగా ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్నా వారిని ఆదుకునే ఆలోచన జగన్ కి కానీ, బిజెపి కానీ ఉందా అని ప్రశ్నిస్తున్నా..
-వైసిపి, బీజేపీ లకు ప్రజలను మభ్యపెట్టే ఆలోచన తప్ప మరోటి ఉందా ?
-అమరావతి పై బిజెపి ద్వంద్వ వైఖరిని అవలంభిస్తోంది..
-బీజేపీ రాష్ట్ర నాయకులు అమరావతికి కట్టుబడి ఉన్నామని చెప్తారు..
-కేంద్రం మొహం మీద కొట్టినట్లు కోర్టులో అఫిడవిట్ దాఖలు చేస్తుంది..
-మోడీ, అమిత్ షా లకు తెలియకుండా ఇవన్నీ జరుగుతున్నాయా ?
- 14 Sep 2020 10:41 AM GMT
Amaravati updates: ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీపై ప్రభుత్వం కసరత్తు..
అమరావతి:
-వచ్చేనెల 2వతేదీన ఇళ్ల పట్టాలు పంపిణీ చేపట్టాలని భావించిన ప్రభుత్వం
-కోర్టు కేసులున్నందున ఇళ్ల పట్టాల పంపిణీపై సాధ్యాసాధ్యాలు పరిశీలన.
-భూముల విషయంలో కేసులు ఎక్కదున్నాయనే వివరాలు సేకరిస్తోన్న అధికారులు.
-ఇప్పటికే రాజధానిలో ఇళ్ల స్థలాల పంపిణీ పై కోర్టు స్టే.
-ఆవ భూముల్లో ఇళ్ల పట్టాల పంపిణీ రద్దు చేసిన కోర్టు.
-ఏపీ వ్యాప్తంగా ఒకేసారి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని భావిస్తున్న ప్రభుత్వం.
-కొన్ని ప్రాంతాల్లో ఇచ్చి, మరికొన్ని ప్రాంతాల్లో నిలుపుదల చేయటం సరికాదని భావన..
-ఇళ్ల పట్టాల విషయంలో కొన్నిరోజుల ఆగుదామని ఏపీ ప్రభుత్వానికి అధికారుల ప్రతిపాదనలు.
-ఇళ్ల పట్టాల పంపిణీ పై ఆదేశాల కోసం ఎదురుచూస్తోన్న అధికారులు
- 14 Sep 2020 10:37 AM GMT
Srikakulam updates: ప్రజలు కరోనాతో బాధలు అనుభవిస్తుంటే కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు చేతులెత్తేశాయి..శైలజానాథ్..
శ్రీకాకుళం జిల్లా..
ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ కామెంట్స్..
-ఆరు నెలలు గడిచాయి.. ఈ విపత్కర పరిస్థితుల నుంచి ఎలా బయటపడాలి అని ప్రజలు ఆలోచిస్తుంటే..
-తమ రహస్య అజెండాలను ఎలా అమలు చేయాలని మోడీ, ఆయన అనుంగ మిత్రుడు జగన్ ఆలోచన చేస్తున్నారు..
-జగన్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన విద్యుత్ సంస్కరణలు కాంగ్రెస్ పార్టీగా వ్యతిరేకిస్తున్నాం..
-ప్రభుత్వం విద్యుత్ సంస్కరణలు శ్రీకాకుళం నుంచి ప్రారంభిస్తే..
-మేము ప్రతిఘటన - పోరాటం ఇక్కడి నుంచే ప్రారంభిస్తున్నాం..
-కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మీటర్ల ప్రతిపాదన వచ్చింది..
-60 ఏళ్ళు పాలించిన కాంగ్రెస్ లక్ష కోట్లు అప్పుచేసింది..
-ఏడాది పాలనలో లక్ష కోట్లకు పైగా అప్పులు చేసిన ఘనత జగన్ కే దక్కుతుంది..
-రాష్ట్రంలో కార్పొరేషన్ బాండ్లు అమ్మేశారు, ఆస్తులు అమ్ముతామంటున్నారు, ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి..
-కేవలం అప్పుకోసం మోడీ దగ్గర జగన్ మోకాళ్ళమీద నిలబడ్డాడు..
- 14 Sep 2020 10:34 AM GMT
West Godavari-Jaggampeta updates: ఏలేరు ముంపుపై జిల్లా కలెక్టర్ కు లేఖరాసిన మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు..
తూర్పుగోదావరిజిల్లా..జగ్గంపేట..
-కిర్లంపూడి మండలం రాజుపాలెంలో కాలనీ ఏలేరు ముంపుపై జిల్లా కలెక్టర్ కు లేఖరాసిన మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు
-వాలు కాలువ గండికి శాశ్వత పరిష్కారం కోసం ఇరువైపులా 300 మీటర్ల సేఫ్టీ సిసి వాల్స్ నిర్మించాలి
-రెండు రోజులుగా ముంపునకు గురైన బాధితులకు పునరావాసం ఏర్పాటు చేయాలి.
-ఏలేరు వరద ముంపు బాధితులను, రైతులను ఆదుకోవాలి
-తెలుగుదేశం నేత, మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ
- 14 Sep 2020 9:45 AM GMT
పల్నాడు లో అధికార పార్టీ హత్య రాజకీయలకు పాల్పడుతుంది...యరపతినేని శ్రీనివాస్..
గుంటూరు....
-టిడిపి సీనియర్ నేత మాజీఎమ్మెల్యె యరపతినేని శ్రీనివాస్..
-కాసు మహేశ్వరెడ్డి అండదండలతో హత్యలు జరుగుతున్నాయి...
-గాలి,నీరు,మట్టిని కూడా కాసు దోచుకుంటున్నారు....
-మైనింగ్ పై ప్రశ్నించినందుకు నాలుగురి పై దాడి చేశారు...ఒక్కరు మృతి చెందారు..
-పోలీసులు ఫ్యాక్షన్ రాజకీయ లను ప్రోత్సహిస్తున్నారు...
-దాచేపల్లి దాడి ఘటనలో 14మందిపై కేసు పెడితే 5గురిని అదుపులోకి తీసుకున్నారు....
-పల్నాడు లో ఫ్యాక్షన్ ను పోలీసులు అదుపు చేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి.....
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire