Live Updates:ఈరోజు (ఆగస్ట్-14) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు శుక్రవారం, 14 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, కృష్ణపక్షం దశమి(ఉ. 10-29 వరకు) తదుపరి ఏకాదశి ; మృగశిర నక్షత్రం (తె. 04-27 వరకు) తదుపరి ఆర్ద్ర నక్షత్రం, అమృత ఘడియలు (రా.07-09 నుంచి 08-50 వరకు), వర్జ్యం (ఉ.0 9-00 నుంచి 10-42 వరకు) దుర్ముహూర్తం (ఉ. 08-17 నుంచి 09-08 వరకు తిరిగి మ. 12-30 నుంచి 01-20 వరకు) రాహుకాలం (ఉ.10-30 నుంచి 12-00 వరకు) సూర్యోదయం ఉ.05-46 సూర్యాస్తమయం సా.06-24

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • శంకుస్థాపన
    14 Aug 2020 6:08 AM GMT

    శంకుస్థాపన

    నిజామాబాద్ జిల్లా: ముప్కాల్ మండల కేంద్రంలో 34లక్షల తో  నూతనంగా నిర్మించే లక్మి నరసింహా స్వామిదేవాలయానికి శంకుస్థాపన చేసిన రోడ్లు భవనాలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి .

  • ద్విచక్ర వాహనంపై దాటుతుండగా ...
    14 Aug 2020 6:07 AM GMT

    ద్విచక్ర వాహనంపై దాటుతుండగా ...

    జయశంకర్ భూపాలపల్లి జిల్లా: కాటారం మండలం పోతుల్ వాయి వాగు ఉదృతంగా ప్రవహిస్తుంది.

    గత రాత్రి ద్విచక్ర వాహనంపై దాటుతుండగా వంగల వెంకటస్వామి గల్లంతు..

    ఇబ్రహీంపల్లి గ్రామానికి చెందిన వెంకటస్వామి గా గుర్తింపు..

  • ఆర్ టి పి సి ఆర్ ల్యాబ్ ని ప్రారంభించిన మంత్రి హరీష్ రావు
    14 Aug 2020 6:04 AM GMT

    ఆర్ టి పి సి ఆర్ ల్యాబ్ ని ప్రారంభించిన మంత్రి హరీష్ రావు

    సిద్దిపేట జిల్లా:  సిద్దిపేట అర్భన్ మండలం ఎన్ సాన్ పల్లి పరిధిలో ప్రభుత్వ వైద్య కళాశాల లో ఆర్ టి పిసి ఆర్ ల్యాబ్ ని ప్రారంభించిన మంత్రి హరీష్ రావు

  • వనపర్తి జిల్లాలో విషాదం....!
    14 Aug 2020 5:58 AM GMT

    వనపర్తి జిల్లాలో విషాదం....!

    వనపర్తి జిల్లా రేవల్లి మండలం నాగపూర్ గ్రామం లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పద స్థితిలో మృతి.

    మృతులు:-

    1) హజీరా బేగం( 60) సంవత్సారాలు.

    2) ఆస్మా. ( 38 ) కూతురు.

    3) కాజా భాష. ( 42 ) అల్లుడు.

    4) నస్రీన్ ( 7 ) మనవరాలు.

    మృతుడి ఇంటివద్ద నిమ్మకాయలు. కుంకుమ పసుపు. అగర్ బత్హిలు ఉండడంతో పోలీసులు వీరి మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

  • రాష్ట్రంలోనే  అత్యధిక వర్షపాతం
    14 Aug 2020 5:57 AM GMT

    రాష్ట్రంలోనే అత్యధిక వర్షపాతం

    ములుగు జిల్లా : నేడు రాష్ట్రంలోనే అత్యధిక వర్షపాతం వెంకటాపురం మండలంలో 164.4 మి.మీ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు

  • ల‌క్ష్మి బ్యారేజ్‌లో జ‌ల‌క‌ళ‌
    14 Aug 2020 5:53 AM GMT

    ల‌క్ష్మి బ్యారేజ్‌లో జ‌ల‌క‌ళ‌

    జయశంకర్ భూపాలపల్లి జిల్లా

    లక్ష్మీ బ్యారేజ్ 57 గేట్లు ఎత్తిన అధికారులు

    పూర్తి సామర్థ్యం 100 మీటర్లు

    ప్రస్తుత సామర్థ్యం 96.30 మీటర్లు

    పూర్తి సామర్థ్యం 16.17 టీఎంసీ

    ప్రస్తుత సామర్థ్యం 6.691 టీఎంసీ

    ఇన్ ఫ్లో 2,80800 క్యూసెక్కులు

    ఓట్ ఫ్లో 2,95,500 క్యూసెక్కులు

  • పరకాలలో రాకపోకలకు అంతరాయం
    14 Aug 2020 5:50 AM GMT

    పరకాలలో రాకపోకలకు అంతరాయం

    వరంగల్ రూరల్ జిల్లా: పరకాల పట్టణంలో రాత్రి నుండి కురుస్తున్న వర్షానికి దామెర చెరువు మత్తడి పడడంతో రహదారిపై కి వస్తున్నా వరద నీరు.


  • విషాదం..
    14 Aug 2020 5:45 AM GMT

    విషాదం..

    వనపర్తి జిల్లా రేవల్లి మండలంలో నాగాపూర్ గ్రామంలో  విషాదం...

    ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పద స్థితిలో మృతి..

    అర్దరాత్రి ఘటన...

    ఇంట్లో క్షుద్రపూజలు జరిగినట్టు ఆనవాళ్లు..

    విచారణ జరుపుతున్న పోలీసులు.

  • ఏడుపాయ‌ల వ‌న దుర్గకు త‌మ‌ల‌పాకుల అలంక‌ర‌ణ
    14 Aug 2020 5:38 AM GMT

    ఏడుపాయ‌ల వ‌న దుర్గకు త‌మ‌ల‌పాకుల అలంక‌ర‌ణ

    మెదక్ :శ్రావణమాసం లో చివరి శుక్రవారం సందర్భంగా శ్రీ ఏడుపాయల వన దుర్గ మాతను తమలపాకులతో విశేష అలంకరణ తో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు....

  • 14 Aug 2020 4:33 AM GMT

    నేడు సిద్దిపేట జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటన..

    సిద్దిపేట:

    - సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాల లో ఆర్ టి పిసి ఆర్ ల్యాబ్, కరోనా మొబైల్ టెస్టింగ్ వాహనాన్ని ప్రారంభించనున్న మంత్రి హరీష్ రావు ..

    - జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొంటారు...

Print Article
Next Story
More Stories