ఈరోజు పంచాంగం
ఈరోజు శుక్రవారం, 14 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, కృష్ణపక్షం దశమి(ఉ. 10-29 వరకు) తదుపరి ఏకాదశి ; మృగశిర నక్షత్రం (తె. 04-27 వరకు) తదుపరి ఆర్ద్ర నక్షత్రం, అమృత ఘడియలు (రా.07-09 నుంచి 08-50 వరకు), వర్జ్యం (ఉ.0 9-00 నుంచి 10-42 వరకు) దుర్ముహూర్తం (ఉ. 08-17 నుంచి 09-08 వరకు తిరిగి మ. 12-30 నుంచి 01-20 వరకు) రాహుకాలం (ఉ.10-30 నుంచి 12-00 వరకు) సూర్యోదయం ఉ.05-46 సూర్యాస్తమయం సా.06-24
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 14 Aug 2020 8:25 AM GMT
ఎస్సారెస్పీ కాలువకు గండి.. యుద్ధప్రాతిపదికన మరమ్మతులు
సూర్యపేట జిల్లా: జాజిరెడ్డి గూడెం మండలం తిమ్మాపురంగ్రామం వద్ద ఎస్సారెస్పీ ,DBM .21 కాల్వకు గండి... యుద్ధప్రాతిపదికన మరమ్మతులను చేపట్టిన మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ లు...పనులను దగ్గరుండి పర్యవేక్షణ చేస్తున్న
మంత్రి జగదీష్ రెడ్డి, MLA కిషోర్ కుమార్, ఇరిగేషన్
అధికారులు...కాళేశ్వరం నుంచి తరలి వస్తున్న గోదావరి జలాలతో సూర్యపేట జిల్లా మొత్తానికి సాగు నీటిని విడుదల చేసింది ప్రభుత్వం... ఈ క్రమంలో కాల్వకు గండి పడటంతో రైతులకు ఇబ్బంది కాకుండా వెనువెంటనే, యుద్ధప్రాతిపదికన వర్షాన్ని సైతం లెక్కచేయకుండా దగ్గరుండి మరమ్మతులు చేయిస్తున్న మంత్రి జగదీష్ రెడ్డి పై, mla కిషోర్ కుమార్
- 14 Aug 2020 8:20 AM GMT
కాగజ్ నగర్ ఎస్పీయం ఫ్యాక్టరీ ముందు కార్మికుల నిరసన
కొమురం భీమ్ జిల్లా: కాగజ్ నగర్ ఎస్పీయం ఫ్యాక్టరీ గేట్ ముందు నల్ల బ్యాడ్జి లతో కార్మికుల నిరసన
కార్మికులకు కాంగ్రెస్ పార్టీ మద్దతు, ఆందోళన్ లో పాల్గొన్న నాయకులు పాల్వాయి హరీష్ రావు సీపీఐ గుండా మల్లేష్
ఫ్యాక్టరీ పున : ప్రారంభమై రెండేళ్లు గడుస్తున్నా 260 మంది కార్మికులను విధుల్లోకి తీసుకోకపోవడం పట్ల నిరసన
- 14 Aug 2020 8:16 AM GMT
సొసైటీ భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన నర్సాపూర్ ఎమ్మెల్యే
మెదక్ జిల్లా: నర్సాపూర్ లో 50 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న సొసైటీ భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి
- 14 Aug 2020 8:16 AM GMT
సొసైటీ భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన నర్సాపూర్ ఎమ్మెల్యే
మెదక్ జిల్లా: నర్సాపూర్ లో 50 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న సొసైటీ భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి
- 14 Aug 2020 8:13 AM GMT
మట్టి వినాయక విగ్రహాల పంపిణీ
హెచ్ఎండిఏ మట్టి వినాయక విగ్రహాలను ఆవిష్కరించిన పురపాలక శాఖ మంత్రి కేటీఆర్
హెచ్ఎండిఏ పరిధిలోని 32 సెంటర్లలో ఉచితంగా 50 వేల మట్టి వినాయక విగ్రహాల పంపిణీ
వినాయక చవితి సందర్భంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండిఏ) ఈ ఏడాది 8 ఇంచుల ఎత్తు గల 50 వేల పర్యావరణహిత వినాయక(మట్టి) విగ్రహాలు పంపిణీ చేయనున్న hmda...
ఈ ఏడాది కోవిడ్–19 పరిస్థితులు నెలకొన్న దృష్ట్యా సామూహిక కార్యక్రమాలపై ఆక్షలు అమలులో ఉన్నందున వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను ఎవరి ఇండ్లల్లో వారు భక్తి శ్రద్దలతో నిర్వహించుకోవాలని మంత్రి కేటీఆర్ సూచన
- 14 Aug 2020 8:08 AM GMT
దేశంలో కరోనా ఉధృతి పెరగడానికి మోడీ నిర్లక్ష్యమే: చాడ
కరొనా కేసులో భారతదేశం మూడో స్థానానికి పోవడానికి కారణం మోడీ నిర్లక్ష్యమే.- చాడ వెంకట్ రెడ్డి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి.
తెలంగాణ లో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి--కార్పొరేట్ హాస్పిటల్స్ ప్రభుత్వం నియంత్రణలో పెట్టుకోవాలి.
దేశంలో రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుంటే--తెలంగాణ లో కేసీఆర్ కు సెక్రటేరియట్ తప్ప వేరే ధ్యాస లేదు.
దేశంలో కొరొనాను కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు గాలికి వదిలేసాయి.
కరొనా కట్టడిలో కేరళ ప్రభుత్వాన్ని చూసి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు నేర్చుకోవాలి.
సేవ్ కానిస్టూషన్ పేరుతో రేపు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసనలు*
- 14 Aug 2020 8:00 AM GMT
జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో పీవీపీ!
హైదరాబాద్: జూబ్లీహిల్స్ పీఎస్‌లో వ్యాపారవేత్త పీవీపీ 2019లో తిమ్మారెడ్డి అనే వ్యక్తి కిడ్నాప్ కేసులో పీవీపీపై కేసు నమోదు..
పీవీపీపై పోలీసులకు ఫిర్యాదు చేసిన తిమ్మారెడ్డి భార్య..
కొద్దిరోజుల క్రితం ఓ విల్లా గొడవలో పీవీపీపై బంజారాహిల్స్ పీఎస్‌లో కేసు నమోదు..
విచారణ కోసం వెళ్లిన పోలీసులపై కుక్కలను వదిలిన పీవీపీ కుటుంబ సభ్యులు..
ఇటీవల తెలంగాణ హైకోర్టులో మధ్యంతర బెయిల్ పొందిన పీవీపీ.
- 14 Aug 2020 7:07 AM GMT
తెలంగాణ పోలీస్ శాఖ లో కరోనా కలకలం...
తెలగాణలో 4259 మంది పోలీసులకు కరోనా...
ఎక్కువగా హైదరాబాద్ కమిషనరేట్ లిమిట్స్ లో 1946 మంది పోలీస్ ల కి కరోనా...
తెలంగాణ వ్యాప్తం గా కరోనా తో 39 మంది పోలీసులు మృతి...
హైద్రాబాద్ కమీషనరేట్ లిమిట్స్ లో 26 మంది మృతి...
పోలీస్ కరోనా కేసుల్లో హైద్రాబాద్ తర్వాత వరంగల్ , రాజన్న సిరిసిల్ల , నల్గొండ లో పోలిసులకు ఎక్కువ కరోనా కేసులు..
- 14 Aug 2020 6:17 AM GMT
ఉధృతంగా ప్రహిస్తున్న జంపన్న వాగు
- ములుగు జిల్లా: ప్రమాద స్థాయిలో ప్రవహస్తిన్న మేడారం జంపన్న వాగు.
- గత ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు భారీగా చేరుతున్న వరద నీరుతో పొంగి ప్రవహిస్తున్న జంపన్న వాగు.
- ప్రమాద హెచ్చరికను జారీ చేసిన అధికారులు.
- తీరా ప్రాంతాల్లో హై అలెర్ట్..
- 14 Aug 2020 6:10 AM GMT
ఆదిలాబాద్ రిమ్స్ లో కరోనాతో ఇద్దరు మృతి..
ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో కరోనాతో ఇద్దరు మృతి..
మృతుల్లో ఒకరు ఉపాద్యాయురాలు
బోక్కల గూడకు చెందిన మరోకరు మృతి..
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire