Live Updates: ఈరోజు (సెప్టెంబర్-11) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు పంచాంగం
ఈరోజు శుక్రవారం | 11 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | భాద్రపద మాసం | కృష్ణపక్షం | నవమి (రా.11-12 వరకు) తదుపరి దశమి | మృగశిర (ఉ.11-55 వరకు) తదుపరి ఆర్ద్ర | అమృత ఘడియలు (రా.2-20 నుంచి 4-08 వరకు) | వర్జ్యం (రా.8-39 నుంచి 10-19 వరకు) | దుర్ముహూర్తం (ఉ.8-16 నుంచి 9-05 వరకు తిరిగి మ.12-21 నుంచి 1-10 వరకు) | రాహుకాలం (ఉ.10-30 నుంచి 12-00 వరకు) సూర్యోదయం: ఉ.5-50 | సూర్యాస్తమయం: సా.6-04
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 11 Sep 2020 9:45 AM GMT
Guntur updates: రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుంది..ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు..
గుంటూరు....
ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు..
-రాజ్యాంగ న్ని పక్కనపెట్టి...రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుంది
-కొడాలి నాని చంద్రబాబు, దేవినేని ఉమా గురించి అసభ్యకరంగా మాట్లాడటం దారుణం..
-కొడాలి నాని మానవత్వం మరచి మాట్లాడుతున్నారు...
-గుడివాడ లో టీడీపీ నాయకులపై గుండాలని పెట్టి దాడి చేయించారు...
-ప్రశ్నిస్తే జైల్లో పెడుతున్నారు..
-మీ ఇష్టం వచ్చినట్లు పరిపాలన చేయటం తగదు..
-న్యాయస్థానాలు, రాజ్యాంగం ఉంది మీ అరాచకాలు సాగవు.
- 11 Sep 2020 9:42 AM GMT
Guntur updates: కొడాలి నాని రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారు...మాజీమంత్రి దేవినేని ఉమా..
గుంటూరు....
-మాజీమంత్రి దేవినేని ఉమా..
-ఈనెల 4న వైసీపీ రాష్ట్ర కార్యాలయంలో మంత్రి కొడాలి నాని, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, గన్నవరం ఎమ్మెల్యే వంశీ మోహన్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నాపై బెదిరింపులకు పాల్పడ్డారు...
-ఒక బాధ్యత గల మంత్రి అయిఉండి అసభ్యకరంగా మాట్లాతున్నారు..
-లారీతో గుద్ది యాక్సిడెంట్ చేసి చంపేస్తా అని బెదిరించారు...
-ఈ కుట్రలో సీఎం జగన్ కు భాగం ఉంది...
-అమరావతి రైతులు, దళితులని,న్యాయ విభాగంలో ఉన్నవారిని తిడితే కేసులు ఉండవా...రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుంది...
-శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసులే వైసిపి నాయకులకు వత్తాసు పలుకుతున్నారు...
-గుడివాడలో టీడీపీ నాయకులపై 20 మంది గుండాలు ఇంటిమీద పడి దాడిచేసై ఇప్పటివరకు చర్యలు లేవు...
-కృష్ణా జలాలు పులివెందులకు ఇచ్చినందుకే మాపై సీఎం జగన్ కు కోపం...
-రాష్ట్ర ప్రజలు అందరు వైసిపి అరాచకాలు గమనిస్తున్నారు...త్వరలోనే తగిన బుద్ధి చెప్తారు...
- 11 Sep 2020 9:28 AM GMT
Vijayawada updates: గుడివాడలో దింట్యాల రాంబాబు ఇంటి పై దాడిని ఖండించిన కృష్ణా జిల్లా బ్రాహ్మణ సంఘనాయకులు..
కృష్ణాజిల్లా..
-గుడివాడలో టిడిపి మాజీ పట్టణ అధ్యక్షుడు దింట్యాల రాంబాబు ఇంటి పై దాడి నీ ఖండించిన కృష్ణా జిల్లా బ్రాహ్మణ సంఘనాయకులు.
-కొడాలి నాని రాజదాని విషయంలో అసత్యాలు మాట్లాడుతుంటే, ఖండించిన బ్రాహ్మణ సంఘ నేతపై కొడాలి నాని అనుచరులు దాడి చేయడం హైయమైన చర్య - బ్రాహ్మణ సంఘ నాయకులు
-తక్షణమే మంత్రి కొడాలి నానీ క్షమాపణ చెప్పాలి - కృష్ణా జిల్లా బ్రాహ్మణ సంఘ నాయకులు.
- 11 Sep 2020 9:24 AM GMT
Vijayawada updates: ఆసరా పధకాన్ని ప్రారంభించిన వైసీపీ తూర్పు ఇంచార్జి దేవినేని అవినాష్..
విజయవాడ...
దేవినేని అవినాష్ కామెంట్స్....
-వైస్సార్ ఆసరా వారోత్సవాలు లో భాగంగా తూర్పు నియోజకవర్గంలో ఆసరా పధకాన్ని ప్రారంభించిన వైసీపీ తూర్పు ఇంచార్జి దేవినేని అవినాష్
-మహిళలు తో కలసి సీఎం జగన్ చిత్ర పటానికి పాలాభిషేకం
-వైస్సార్ ఆసరా ద్వారా అందిన నగదుతో ఏర్పాటు చేసిన షాప్ ని ప్రారంభించిన అవినాష్
-సీఎం జగన్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం వైస్సార్ ఆసరా ప్రారంభించారు
-మహిళ సాధికారిత కోసం వైసీపీ ప్రభుత్వం పని చేస్తుంది
-మహిళలు ఆర్ధికంగా ఎదగటానికి జగన్ ఎంతో కృషి చేస్తున్నారు
-సంక్షేమ పథకాలు పొందిన లబ్ధిదారుల మాటలు వింటుంటే చాలా ఆనందంగా ఉంది
-గత ప్రభుత్వం ఓట్ల కోసం రాజకీయాలు చేస్తే,, జగన్ మాత్రం ప్రజలు తన పై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుందుకు పని చేస్తున్నారు
-దేశంలోనే అందరికీ జగన్ రోల్ మోడల్ గా నిలుస్తున్నారు
-వైస్సార్ ఆసరా ద్వారా మహిళల్లో మరింత ఆత్మవిశ్వాసన్నీ జగన్ నింపారు
-మహిళలు ఇచ్చే ఆశీర్వాదం తో జగన్ మరో 30 సంవత్సరాలు ముఖ్యమంత్రి గా ఉంటారు.
- 11 Sep 2020 9:13 AM GMT
Mekatoti Sucharita-Home minister: శిక్షణ పూర్తి చేసుకున్న మహిళా పోలీస్ పాసింగ్ పెరేడ్ లో హోంమంత్రి మేకతోటి సుచరిత పాల్గొన్నారు..
ప్రకాశం:
-మేకతోటి సుచరిత - హోమ్ శాఖ మంత్రి...
-ఈ కార్యక్రమంలో హోంమంత్రి సుచరిత, మంత్రులు బాలినేని శ్రీనివాస్, ఆదిమూలపు సురేష్, డీజీపీ గౌతం సవాంగ్, ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ లు పాల్గొన్నారు.
-19 వ బ్యాచ్ కు చెందిన 398 మంది మహిళా పోలీసులు శిక్షణ పూర్తి చేసుకున్నారు.
-అమరులైన పోలీసులకు 50 లక్షల బీమా కల్పించడం జరిగింది.
-దేశం లోనే తొలి సారిగా వీక్లీ ఆఫ్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం మాదే.
-ఆంధ్రప్రదేశ్ లో జీరో ఎఫ్ ఐ ఆర్ విజయవంతంగా అమలవుతోంది.
-ఇప్పటివరకు రాష్ట్రంలో 320 జీరో FIR కేసులు నమోదు చేయడం జరిగింది.
-మహిళా పోలీస్ సిబ్బంది కోసం ప్రత్యేకంగా మహిళా మిత్ర ను ఏర్పాటు చేసాము.
-ఇంటర్నెట్ ద్వారా మహిళలపై జరుగుతున్న నేరాలను నియంత్రించేందుకు సైబర్ మిత్ర ను ఏర్పాటు చేసాము.
-ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంతర్వేది ఘటన పై సీరియస్ గా ఉన్నారు.
-సీబీఐ ఎంక్విరీ లో అన్ని విషయాలు బయటపడతాయి.
- 11 Sep 2020 8:56 AM GMT
East Godavari-Mamidikuduru: సాఫ్ట్ వేర్ భార్యకు వేధింపులు..కంటి డాక్టర్ అని చెప్పి మోసం..
తూ.గో.జిల్లా.....
మామిడికుదురు (మం)..
-ఇంటర్ చదివి కంటి డాక్టర్ అని చెప్పి మోసం చేసి సాఫ్ట్ వెర్ యువతిని పెళ్లి చేసుకున్న ప్రబుద్ధుడు
-కంటి డాక్టర్ గా నమ్మ బలికి 2016 లో నగరం గ్రామానికి చెందిన కులుసుం ఉన్నిషా అనే వివాహితను పెళ్లాడిన ఆలీ హుస్సేన్
-పెళ్లి అయ్యినప్పటి నుండి భర్త , అత్తా మామల నుండి ఉన్నిష కు వేధింపులు
-నాలుగు సంవత్సరాలు నుండి 25 లక్షలు అదనపు కట్నం తేవాలంటూ తీవ్ర వేధింపులకు గురి చేసిన శాడిస్ట్ భర్త హాలీ ఉసేన్, అత్త ఫాతిమా గులబాజన్, మామ అలీ అబ్బాస్.
-ఆడపిల్ల పుట్టిందని నెపంతో మరింత వేధింపులకు గురి చేసిన భర్త ఆలీ హుస్సేన్
-కట్టుకున్న భార్యను నిత్యం వేధింపులకు గురిచేయడంతో పుట్టింటికి వెళ్లిపోయిన భార్య కులుసుం ఉన్నిషా
-ఇదే అదునుగా ఆగస్ట్ 6 న మరో మహిళతో హైదరాబాదులో వేరే పెళ్లి చేసుకున్న భర్త ఆలీ హుస్సేన్
-హింసించి ...మోసం చేసిన భర్త ను శిక్షించకపోతే చావే శరణ్యం అంటున్న బాధితురాలు
- 11 Sep 2020 8:50 AM GMT
Kurnool Updates: శ్రీశైలం మండలంలో చెంచు గిరిజనులకు కరోనా టెస్టుల నిర్వహణ..
కర్నూలు జిల్లా..
-ఇటీవల కాలంలో శ్రీశైలం మండలంలో విజృంభిస్తున్న కరోనా వ్యాప్తి నేపథ్యంలో చెంచు గిరిజనులకు కరోనా టెస్టుల నిర్వహణ
-శ్రీశైలం గిరి పుత్రులకు కరోన టెస్టులను నిర్వహిస్తున్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు
-శ్రీశైలం లో మేకల బండ చెంచుగూడెం, పాలధార-పంచదార, హటకేశ్వరం, శిఖరేశ్వరం వద్ద నివసిస్తున్న చెంచు గిరిజనులకు కరోన టెస్టుల నిర్వహణ
- 11 Sep 2020 8:44 AM GMT
Srisailam Project updates: శ్రీశైలం జలాశయానికి భారీగా పెరుగుతున్న వరద..
కర్నూలు జిల్లా....
-7 గేట్లు 10 అడుగుల మేర ఎత్తివేత
-ఇన్ ఫ్లో: 2,21,645 క్యూసెక్కులు
-ఔట్ ఫ్లో: 2,62,600 క్యూసెక్కులు
-పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు
-ప్రస్తుత నీటిమట్టం 884.80 అడుగులు
-పూర్తిస్దాయి నీటి నిల్వ సామర్ధ్యం 215.8070 టిఎంసీలు
-ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 214.3637 టీఎంసీలు
-కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి
- 11 Sep 2020 8:15 AM GMT
East Godavari updates: అమలాపురం Rdo కార్యాలయం వద్ద జనసేన, బిజెపి ఆందోళన..
తూర్పు గోదావరి జిల్లా..
అమలాపురం..
-అంతర్వేది సంఘటనలో పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్
-హిందూ ఆలయాలకు రక్షణ కల్పించాలని డిమాండ్
-ఆందోళనలో పాల్గొన్న బిజెపి నాయకులు మానేపల్లి అయ్యా జీవేమ, యాళ్ల దొరబాబు , జనసేన నాయకులు పితాని బాలకృష్ణ
-పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని Rdo కార్యాలయంలో అందజేసిన బిజెపి, జనసేన నాయకులు
- 11 Sep 2020 8:12 AM GMT
East Godavari updates: అంతర్వేది కేసు సీబీఐకి అప్పగిస్తూ జీవో జారీ..
తూర్పుగోదావరి..
-అంతర్వేది రథం దగ్ధం కేసును ఏపీ ప్రభుత్వం సీబీఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
-ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ ఈరోజు ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది.
-సీబీఐ దర్యాప్తులో ఎలాంటి నిజాలు బయటకు వస్తాయో వేచిచూడాలి
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire