Live Updates: ఈరోజు (సెప్టెంబర్-11) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 11 సెప్టెంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు శుక్రవారం | 11 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | భాద్రపద మాసం | కృష్ణపక్షం | నవమి (రా.11-12 వరకు) తదుపరి దశమి | మృగశిర (ఉ.11-55 వరకు) తదుపరి ఆర్ద్ర | అమృత ఘడియలు (రా.2-20 నుంచి 4-08 వరకు) | వర్జ్యం (రా.8-39 నుంచి 10-19 వరకు) | దుర్ముహూర్తం (ఉ.8-16 నుంచి 9-05 వరకు తిరిగి మ.12-21 నుంచి 1-10 వరకు) | రాహుకాలం (ఉ.10-30 నుంచి 12-00 వరకు) సూర్యోదయం: ఉ.5-50 | సూర్యాస్తమయం: సా.6-04
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 11 Sep 2020 12:30 PM GMT
Amaravati updates: అంతర్వేది రథం దగ్ధం ఘటనపై 2 నెలల్లో సీబీఐ విచారణ పూర్తిచేయాలి.. నిమ్మకాయల చినరాజప్ప..
అమరావతి..
నిమ్మకాయల చినరాజప్ప మాజీ మంత్రి..
-ప్రముఖ పుణ్యక్షేత్రం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి రథం దగ్ధం
-హిందూ ధార్మిక క్షేత్రాలపై ముమ్మాటికీ దాడే
-16 నెలల కాలంలో హిందూ దేవాలయాలపై జరిగిన దాడులు, అక్రమాలపైనా విచారణ జరపాలి
- 11 Sep 2020 12:26 PM GMT
Vijayawada updates: సీఎం జగన్ మహిళలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు..డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి..
విజయవాడ..
డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి..
-రాష్ట్రంలోని డ్వాక్రా మహిలలందరికీ ఈరోజు పండుగ రోజు
-27 వేల కోట్ల రుణమాఫీ చేసిన ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదు
-అన్న మాట ప్రకారం సీఎం జగన్ 4 విడతల్లో ఆ మొత్తాన్ని చెల్లిస్తున్నారు
-88 లక్షల మంది మహిళల నమ్మకాన్ని సీఎం నిలబెట్టారు
-కరోనా కష్టకాలంలోనూ మహిళలకిచ్చిన మాట నిలబెట్టుకున్నారు
-1400 కోట్ల సున్నా వడ్డీ నిధులిచ్చి డ్వాక్రా సంఘాలకు ఊపిరి పోశారు
-అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాలతో
-పిల్లలను చదివించుకునే అవకాశాన్ని మహిళలకిచ్చారు
-దిశ చట్టం, 30 లక్షల ఇళ్ల పట్టాలతో దేశానికే ఆదర్శంగా నిలిచారు
-మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు ఇచ్చి చరిత్ర సృష్టించారు జగన్
-వైఎస్సార్ చేయూత తో మహిళల స్వయం ఉపాదికి అవకాశం కల్పించారు
- 11 Sep 2020 12:18 PM GMT
National updates: ఒకరోజు నిరసన దీక్ష ముగించిన ఎంపీ రఘురామకృష్ణంరాజు.
జాతీయం..
ఎంపీ రఘురామ కృష్ణంరాజు, నరసాపురం పార్లమెంట్ సభ్యులు
-హిందూ దేవాలయాల పై దాడులను ఖండిస్తూ ఒకరోజు నిరసన దీక్ష ముగించిన ఎంపీ రఘురామకృష్ణంరాజు.
-ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎనిమిది గంటల పాటు దీక్ష చేసిన ఎంపీ రఘురామకృష్ణంరాజు.
-రఘురామకృష్ణంరాజు దీక్షకు మద్దతు తెలిపిన తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్.
-ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి హిందువుల మనోభావాలు తెలియపరచండి నా ఈ నిరసన దీక్ష చేపట్టాను.
-హిందూ దేవుళ్ళ విగ్రహాలు పై జరిగిన దాడిని పిచ్చివాడి చర్యగా నిర్లక్ష్యం చేయడం వల్లే అలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయి.
-అంతర్వేది దేవాలయ రథం దగ్ధం ఘటనతో హిందూ సమాజం మేల్కొంది.
-సనాతన స్వదేశీ సేన పేరుతో ఒక ఐక్య పోరాట సంస్థని ఏర్పాటు చేయాలని నిర్ణయానికి వచ్చాము.
-హిందూ దేవాలయాల పై జరుగుతున్న దాడిని ఎదుర్కొనేందుకు మరింత బలోపేతమైన వ్యవస్థ కోసం ఆ సంస్థ పనిచేస్తుంది.
-మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహకారం కూడా మా సంస్థకు ఉండాలని కోరుకుంటున్నాం.
-మంత్రి బాలినేని శ్రీనివాస్రెడ్డి నా రాజీనామా కోరడం పై ప్రతి సవాల్ విసిరిన ఎంపీ రఘురామ కృష్ణంరాజు
-మా పార్టీకి చెడ్డ పేరు రాకూడదనే అమరావతి రాజధానిగా ఉండాలని ముఖ్యమంత్రికి సూచిస్తున్నా.
- 11 Sep 2020 12:01 PM GMT
National updates: మాజీ తహసిల్దార్ అన్నే సుధీర్ బాబు కేసు దర్యాప్తు పై అసంతృప్తి వ్యక్తం చేసిన సుప్రీం కోర్టు..
జాతీయం..
-మాజీ తహసిల్దార్ అన్నే సుధీర్ బాబు పై దాఖలైన క్రిమినల్ కేసు దర్యాప్తు పైన ఏపీ హైకోర్టు స్టే ఇవ్వడం పై అసంతృప్తి వ్యక్తం చేసిన సుప్రీం కోర్టు..
-దర్యాప్తు పై స్టే ఇవ్వడం సరికాదన్న జస్టిస్ లావు నాగేశ్వరరావు
-అమరావతి లో ల్యాండ్ పోలింగ్ కోసం పేద ఎస్సీ ఎస్టీ ల భూములను బెదిరించి లాక్కున్న మాజీ తహసిల్దార్ సుధీర్ బాబు, బ్రహ్మానంద రెడ్డి పై ఎఫ్ఐఆర్ దాఖలు
-తమకు భూమి ఇవ్వకుంటే ప్రభుత్వం నష్టపరిహారం లేకుండా సేకరిస్తుందని పేదలను బెదిరించిన నిందితులు
-ఈ వ్యవహారం పై ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన ఏపీ ప్రభుత్వం
-ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన నిందితులు
-నిందితుల అభ్యర్థన మేరకు కేసు దర్యాప్తు పై స్టే ఇచ్చిన ఏపీ హైకోర్టు
-స్టే విధించ డా న్ని సుప్రీంకోర్టులో సవాల్ చేసిన ప్రభుత్వం
-తదుపరి కేసు తుది విచారణ ఈనెల 22 కి వాయిదా
- 11 Sep 2020 11:39 AM GMT
Amaravati updates: డ్వాక్రా అక్క చెల్లమ్మలకి నేడు పండగ రోజు..రోజా APIIC చైర్ పర్సన్..
అమరావతి...
-రోజా apiic చైర్ పర్సన్, ఎమ్మెల్యే
-ఇచ్చిన మాట ప్రకారం వైఎస్సార్ ఆసరా ద్వారా హామీ నిలబెట్టుకున్నారు..
-మహిళల కోసం దివంగత నేత రాజశేఖర్ రెడ్డి రెండు అడుగులు వేస్తే జగన్మోహన్ రెడ్డి నాలుగు అడుగులు ముందుకు వేస్తున్నారు..
-90 లక్షల మందికి వైఎస్సార్ ఆసరా ద్వారా మేలు జరిగింది..
-మహిళ పక్షపాతి జగన్మోహన్ రెడ్డి..
-చంద్రబాబులాగా కుంటి సాకులు చెప్పడం జగన్నకు తెలియదు..
-మహిళలు, విద్యార్థులు కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి ప్రవేశ పెట్టారు..
-మహిళకు ఇచ్చే ఇళ్ల పట్టాలను టీడీపీ నేతలు అడ్డుకున్నారు..
-రుణమాఫీ చేస్తామని చెప్పి చంద్రబాబు మహిళలను మోసం చేశారు..
-దళిత మహిళను హోమ్ మంత్రి, ఎస్టీ మహిళను డిప్యూటీ సీఎం చేసిన ఘనత జగనన్నకు దక్కుతుంది..
-నామినేటెడ్ పనులు, పదవుల్లో 50 శాతం మహిళకు అవకాశం కల్పించారు..
-మహిళ ఆకాంక్ష మేరకు మద్యపాన నిషేధాన్ని దశల వారిగా సీఎం జగన్ ఎత్తివేస్తున్నారు.
-అంతర్వేదిలో రథం తగలబడిన సంఘటనలో చంద్రబాబు ప్రవేయం ఉంది..
- 11 Sep 2020 11:17 AM GMT
Srikakulam updates: దేశంలోనే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న ఏకైక సీఎం జగన్..ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం..
శ్రీకాకుళం జిల్లా..
-ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం కామెంట్స్..
-ఆయన మాట ఒక బ్రహ్మాస్త్రం...ఆయన మాటే ఒక చట్టం
-వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా మహిళలకు అండగా నిలిచారు
-త్వరలో 30 లక్షల ఇళ్ల పట్టాలు మహిళల పేరుతో ఇస్తాం
-కోర్టులో ఉన్న సమస్య పరిష్కారం కాగానే పట్టాలు పంపిణీ చేపడతాం
-జిల్లాలో తొలివిడతగా 377 కోట్లు విడుదల చేశాం
-విమర్శలు చేసే వారికి శతకోటి నమస్కారాలు
-ఎవరు మాటలు చెబుతున్నారో...ఎవరు చేతల్లో చేసి చూపిస్తున్నారో ప్రజలకు తెలుసు
- 11 Sep 2020 11:07 AM GMT
East Godavari Updates: బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్యకు సంబంధించిన మరో ఆడియో టేప్ లీక్..
తూర్పుగోదావరి :
-చనిపోయో ముందురోజు శ్రావణి కుటుంబ సభ్యులు, సాయితో ఇంట్లో జరిగిన గొడవను రికార్డు చేసిన దేవరాజు రెడ్డి..
-నన్ను ప్రతీసారి తిట్టవద్దు, అందరి పేర్లు రాసి చనిపోతా, ఆరోజు రెస్టారెంట్, లిఫ్ట్ లో నాపై చెయ్యి చేసుకున్నావు, అంటు సాయితో కుటుంబ సభ్యులతో గోడలు పడుతున్నా మాటలు రికార్డింగ్..
-శ్రావణి దేవరాజు కు ఫోన్ చేసి అన్లో ఉంచి గోడవ అంత వినిపిస్తూ ఉండగా రికార్డర్ చేసిన దేవరాజు రెడ్డి..
-గోడవ మధ్యలో ఫోన్ ఆన్ లో ఉందని గమనించిన కుటుంబ సభ్యులు..
-శ్రావణి తమ్ముడు ఫోన్ తీసుకుని దేవరాజుతో ఫోన్లో గొడవలు పడినట్లు రికార్డింగ్..
-సుమారు అరగంట కు పైగా జరిగిన సంభాషణ..
- 11 Sep 2020 10:28 AM GMT
Cherukuvada Sri Ranganadha Raju Comments: రాష్ట్ర గృహ నిర్మాణ శాఖామంత్రి చెరుకువాడ శ్రీరంగనాధరాజు మాజీ మంత్రి పితానిపై కామెంట్స్..
చెరుకువాడ శ్రీరంగనాధరాజు కామెంట్స్..
-వైయస్ ఆర్ ఆసరా కార్యక్రమంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖామంత్రి చెరుకువాడ శ్రీరంగనాధరాజు మాజీ మంత్రి పితానిపై కామెంట్స్..
-నేను గాను మా కార్యకర్తలు ఆచంట నియోజకవర్గంలో ఎక్కడా అవినీతికి పాల్పడలేదు, నిరూపిస్తే దేనికైనా సిద్ధం
-మాజీ మంత్రి పితాని తనయుడు చేసిన కుంభకోణానికి తండ్రికి సంభంధం లేదనడం ఎంతవరకు సమంజసం రాజకీయాలు చేయవద్దు.
-ESI స్కామ్ లో నాణ్యత లేని నకిలీ మందులు సరఫరా చేసి ప్రజలను మోసం చేసిన దొంగలందరికి చంద్రబాబు నాయుడు మద్దతుగా నిలుస్తున్నాడు.
-తప్పు చేయకుంటే బయట తిరగవచ్చు ఇతర రాష్ట్రాలు వెళ్లి దాక్కునే అవసరం ఏముంది
-కరోనా ప్రభావంతో విజయవాడలో చనిపోయిన సుమారు 10 మంది బాధితులను పరామర్శించే పరిస్తితి లేదు కానీ సంక్షేమ పథకాలు అందించే ముఖ్యమంత్రి జగన్ పై బురద చల్లుతున్నారు
-మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కుమారుడు ని కూడా అరెస్ట్ చేస్తే వారిని కూడా పరామర్శించడానికి కొమ్ముచిక్కాల వద్దుడు చంద్రబాబు
-బీసీ కార్డు అడ్డం పెట్టుకుని కుల రాజకీయాలు చేయడం సబబు కాదన్న మంత్రి
-Esi స్కాములో మాజీ మంత్రి పి.ఎస్ పాత్ర ఉంది తనయుడు పాత్ర ఉంది కాని పితాని పాత్ర లేకపోవడం చాలా విచిత్రం
-అవినీతి ఆరోపణలు లేకుండా జగన్ మోహన్ రెడ్డి పారదర్శకంగా పాలన చేస్తుంటే ప్రతిపక్ష పార్టీ నాయకులు అవినీతి ఆరోపణలు చేస్తున్నారు.
- 11 Sep 2020 10:15 AM GMT
Amaravati updates: రాష్ట్రంలో మావోయిస్టు పార్టీపై నిషేదం ఏడాది పాటు పొడిగింపు..
అమరావతి..
-గత నెల 17నుంచి అమల్లోకి వచ్చిన నిషేదం..
-అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున మరో ఏడాది నిషేదం కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ..
-మావోయిస్టు పార్టీ అనుబంధ సంస్థ రివల్యూషనరీ డెమొక్రటిక్ ఫ్రంట్ పై నిషేదం కొనసాగింపు..
-గత నెల 9 వ తేదీ నుంచి ఏడాది పాటు అమల్లోకి వచ్చిన నిషేదం...
- 11 Sep 2020 9:53 AM GMT
Vizianagaram Vizianagaram updates: ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీశ్రీశ్రీ పైడి తల్లి అమ్మవారి జాతర తేదీలు ప్రకటించిన అమ్మవారిదేవస్థానం అధికారులు..
విజయనగరం..
-అక్టోబర్ 2న మండల దీక్షలు ప్రారంభం మరియు పందిరిరాట కార్యక్రమం
-అక్టోబర్ 22న అర్ధ మండల దీక్షలు ప్రారంభం
-అక్టోబర్ 26న అమ్మవారి తోలేళ్ల ఉత్సవం
-అక్టోబర్ 27న అమ్మవారి ఉత్సవంలో ప్రధాన ఘట్టం సిరిమనోత్సవం
-నవంబర్ 3న తెప్పోత్సవం. 10న ఉయ్యాల కాంబల ఉత్సవం.11 న చండీహోమం.
-చండీహోమం తో ముగుస్తున్న అమ్మవారి ఉత్సవాలు..
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire