Live Updates: ఈరోజు (10 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు పంచాంగం
ఈరోజు శనివారం | 10 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | అష్టమి మ.12-29 వరకు తదుపరి నవమి | పునర్వసు నక్షత్రం రా.08-58 వరకు తదుపరి పుష్యమి| వర్జ్యం: ఉ.08-41 నుంచి 10-19 వరకు తిరిగి తే.5-51 నుంచి 5-55 వరకు | అమృత ఘడియలు సా.06-31నుంచి 07-42 వరకు | దుర్ముహూర్తం: ఉ.05-54 నుంచి 07-20వరకు | రాహుకాలం: ఉ.09-00 నుంచి 10-30 వరకు | సూర్యోదయం: ఉ.5-54 | సూర్యాస్తమయం: సా.5-40
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 10 Oct 2020 9:37 AM GMT
రఘురామకృష్ణంరాజు, నర్సాపురం ఎంపి
పంచాయితీ, స్థానిక సంస్థల ఎన్నికలు కరోనా కారణంగా వాయిదా పడ్డాయి. నిమ్మగడ్డ పై కులముద్రవేసి తమకు జరిగిన అవమానం పై ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నం చేసారు.
ఏపి సీఎం ఎంతగానో అభిమానించే కేసీఆర్ శాసనమండలి , గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరుపుతున్నారు.
మళ్లీ పుట్టిన ఆంధ్రప్రదేశ్ గాంధీ గ్రామస్వరాజ్య ప్రతీక అయిన స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలి.
ఏపి సీఎం కు ఉన్న భయం కరోనా కాదు, డరోనా.
గతంలో ఏకగ్రీవం అయిన ఎన్నికలు స్వచ్ఛందంగా కాదు, నిర్భంధంగా అయినవి
- 10 Oct 2020 9:37 AM GMT
కడప :
పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్
తులసిరెడ్డి కామెంట్స్...
భారతంలో శకుని పాత్రను... ఎపిలొ సిఎం జగన్మోహన్ రెడ్డి పోషిస్తున్నాడు...
జగనన్న విద్యా కానుక ప్రారంబొత్సవంలొ విద్యార్దులకు మామలా ఉంటానన్నాడు...
అంగ్ల మాద్యమాన్ని ప్రవేశపెట్టి విద్యార్దులకు తెలుగు కూడా రాకుండా చేస్తున్నాడు
శకుని వల్ల కురువంశం అంతరించి పోయింది...
జగన్మోహన్ రెడ్డి వల్ల తెలుగు భాష అంతరించిపోతుంది...
ప్రపంచంలో 95 శాతం గొప్పవారందరు మాతృభాష లో చదివిన వారే...
అయా లాంటి అంగ్లబాషకు స్వస్తి పలికి తల్లి లాంటి తెలుగు బాషను విస్మరించవద్దు...
- 10 Oct 2020 7:44 AM GMT
తిరుమల
శ్రీవారి ఆలయంలో 27వ టీటీడీ ఈవోగా భాద్యతలు చేపట్టిన కే.ఎస్ జవహర్ రెడ్డి
సంప్రదాయ ప్రకారం ముందుగా భూవరాహస్వామి దర్శనం అనంతరం శ్రీవారి దర్శించుకున్న టీటీడీ ఈవో జవహర్ రెడ్డి.
దగ్గరుండి దర్శనం ఏర్పాట్లు చేసిన అదనపు ఈవో ధర్మారెడ్డి.
అదనపు ఈవో ధర్మారెడ్డి వద్ద నుండి బాధ్యతలు స్వీకరించిన నూతన ఈవో జవహర్ రెడ్డి
ఈవో జవహర్ రెడ్డికి రంగనాయకుల మండపంలో వేద ఆశీర్వచనం అందించిన వేద పండితులు, తీర్ధ ప్రసాదాలను అందజేసిన అధికారులు..
కుటుంబ సమేతంగా ప్రమాణస్వీకారోత్సవంలో పాల్గొన ఈవో జవహర్ రెడ్డి.
అనంతరం శ్రీవారిని దర్శించుకున్న. టీటీడీ ఈవో జవహర్ రెడ్డి,కుటుంబ సభ్యులు..
- 10 Oct 2020 7:44 AM GMT
విజయవాడ
సుంకర పద్మశ్రీ.... అమరావతి మహిళ jac కన్వీనర్...
ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రం లో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టలను కుంటున్నారు.
వైసీపీ నేతలు, మంత్రులు రైతులను అవమానించేలా మాట్లాడుతున్నారు.
ఉద్యమంలో ఉన్నది పెయిడ్ ఆర్టిస్టులు అంటున్నారు. ఈ వ్యాఖ్యలను కండిస్తున్నాం.
అన్ని రాజకీయపార్టీలు, కులాలకు అతీతంగా ఉద్యమం లో పాల్గొంటున్నారు.
11 వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రధాన కూడళ్లలో లో నిరసనలు.
12 న అన్ని రెవెన్యూ కేంద్రాల వద్ద ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తాం.
రేపు ఉదయం 8.30 కు పెద్దఎత్తున శారదా కాలేజీ వద్ద బి ఆర్ టి ఎస్ రోడ్ పై ర్యాలీ నిర్వహిస్తాం.
అరెస్టులకు, దాడులకు భయపడేది లేదు.
రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల నుంచి వచ్చే ఉద్యమాలకు కూడా మా మద్దతు ఇస్తాం.
- 10 Oct 2020 7:44 AM GMT
కృష్ణాజిల్లా
జగ్గయ్యపేట మాజీ ఎంఎల్ఏ, శ్రీరాంతాతయ్య
అమరావతి రాజధానిగా ఉండాలని దీక్ష లు చేపట్టి 300 రోజులు పూర్తి
రేపు ఎల్లుండి అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ర్యాలీ
రాష్ట్ర వ్యాప్తంగా రేపు అన్ని నియోజకవర్గాల్లో 5కిలోమీటర్లు ర్యాలీ
12వ తేదీ ఎమ్మార్వో ఆఫీస్ ల వద్ద నిరసన
- 10 Oct 2020 7:43 AM GMT
కనకమేడల రవీందర్ కుమార్, టీడీపి రాజ్యసభ ఎంపి
ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవితాలతో ముడిపడిన రాజధాని అంశం
పునర్వవస్థీకరణ చట్టం ప్రకారం గత సీఎం చంద్రబాబు అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేసారు.
అందరికీ అందుబాటులో ఉండాలనే ఆలోచనతో అమరావతిలో రాజధాని ఏర్పాటు చేసారు. శివరామకృష్ణన్ కమిటీ నివేదికకు అనుగుణంగానే రాజధాని ఏర్పాటు చేసాం
అమరావతి రాజధాని అనువుగా కాదని వచ్చిన అనుమానాలకు నిపుణులతో నివృత్తి చేసారు. జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా అమరావతి నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
కేంద్ర ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి 1500 కోట్లు ఇవ్వడమే కాకుండా, కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ స్మార్ట్ సిటీగా ఎంపిక చేసింది.
29 వేల మంది రైతులు ల్యాండ్ పూలింగ్ విధానం ద్వారా 30 వేల పైగా ఎకరాలు త్యాగం రాజధాని కోసం చేసారు. చాలా మంది రైతులు చిన్న, సన్నకారు రైతులు ఉన్నారు.
కేవలం ఒక సామాజిక వర్గ ముద్రవేసి రాజధాని అడ్డుకోవాలని ప్రస్తుత ప్రభుత్వం చూస్తుంది. మూడు రాజధానుల ప్రస్తావన వల్ల రైతులు రోడ్డున పడ్డారు. పోలీసులతో అక్రమకేసులతో రాజధాని రైతులపై దమనకాండ కొనసాగిస్తున్నారు.
చంద్రబాబు ఏర్పాటు చేసిన అన్నింటిని నామరూపాలు లేకుండా చేయాలని విధ్వంసానికి శ్రీకారం ప్రస్తుత ప్రభుత్వం మొదలు పెట్టింది
- 10 Oct 2020 7:43 AM GMT
అమరావతి
గోరంట్ల బుచ్చయ్య చౌదరి టీడీపీ ఎమ్మెల్యే
జగనన్న ప్రభుత్వంలో స్థానికసంస్థలకు శఠగోపం
స్థానిక సంస్థలకు నిధులివ్వకుండా జగన్ ప్రభుత్వం వాటిని నిర్వీర్యం చేస్తోంది.
14, 15వ ఆర్థికసంఘం నిధులుగానీ, ఎన్ఆర్ఈజీఎస్, మైనింగ్ సెస్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చేఆదాయం మొత్తం డైరెక్ట్ గా సీఎఫ్ఎంఎస్ కే జమవుతోంది.
కనీసం పారిశుధ్యపనులు కూడా చేయలేని దుస్థితిలో స్థానికసంస్థలున్నాయి.
ఎన్ ఆర్ఈజీఎస్ కు చెందిన రూ.2,200కోట్లను నిలిపేశారు.
2018-19లో నిధులిచ్చినట్టే ఇచ్చి ఆపేశారు.
ఆర్థికనేరగాడి ప్రభుత్వం నీతివాక్యాలకే పరిమితమైంది తప్ప, అవినీతిపరులపై చర్యలు తీసుకోవడంలేదు.
కాకినాడ్ సెజ్, విశాఖ బేపార్క్ లు హెటిరో, అరబిందోకు అప్పగించడం మరో క్విడ్ ప్రోకో విధానంలో భాగమే.
తనబాబు సొమ్మేదో ఇచ్చినట్లు పాఠ్యపుస్తకాలకు పార్టీ రంగులేయడం ఏమిటి?
రాజకీయనేతలపై ఉన్న అవినీతికేసుల విచారణ వేగవంతం కావడం శుభపరిణామం.
- 10 Oct 2020 7:42 AM GMT
అమరావతి
ట్విట్టర్ లో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్...
వైసీపీ ఇసుకాసురులు బరితెగించారు.
ఇసుక దొరక్క, పనులు లేక పస్తులుండి భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
ఇసుక అక్రమ రవాణా చేస్తూ కోట్లు మింగుతున్న వైసీపీ నేతలు రోడ్ల మీద వీరంగం వేస్తున్నారు.
అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం లో ఎమ్మెల్యే బంధువు దుద్దకుంట సురేందర్ రెడ్డి రోడ్డు మీద తప్పతాగి హల్ చల్ చేసాడు.
అడ్డొచ్చిన ఎస్సై శరత్ చంద్రగారిపై తిరగబడి వార్నింగ్ ఇచ్చాడు.
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ పోస్ట్ పెడితే అరెస్ట్ చెయ్యమని ఒత్తిడి చేస్తున్న కొంతమంది అధికారులకు వైసీపీ నేతలు చేస్తున్న అరాచకాలు కనిపించడం లేదా....?
వైసీపీ నేతల నుండి పోలీసులకే రక్షణ లేనప్పుడు ఇక ప్రజల పరిస్థితి ఏంటి?
- 10 Oct 2020 7:42 AM GMT
విజయవాడ
రాష్ట్ర ప్రైవేటు విద్యా సంస్ధల యాజమాన్య సంఘాలు
జిప్సా అధ్యక్షుడు, భాస్కరరావు
ఏపీలో బడ్జెట్ స్కూళ్ళు పదివేలకు పైన ఉన్నాయి
మార్చి నుంచీ స్కూళ్ళు లేకపోవడంతో ఇబ్బందులున్నాయి
స్కూళ్ళు పడుతున్న ఆర్ధిక బాధలు వర్ణనాతీతం
రుణాలు తీర్చ లేకపోవడంతో 20మందికి పైగా ప్రైవేటు స్కూళ్ళ వారు ఆత్మహత్యలు చేసుకున్నారు
ప్రభుత్వం చొరవ తీసుకుని ఆదుకోకపోతే, మాకు ఆత్మహత్యే శరణం
- 10 Oct 2020 7:42 AM GMT
అమరావతి
మంత్రి ఆదిమూలపు సురేష్
పేదరికం విద్యకు అడ్డు కాకూడదని సిఎం జగన్ చేతుల మీదుగా విద్యా కానుక కిట్లు పంపిణీ చేస్తున్నారు
బిఆర్ అంబేద్కర్ భావాలతో జగనన్న విద్యా కానుక కార్యక్రమం సిఎం జగన్ నిర్వహించారు.
కోవిడ్ నిబంధనలు దృష్టి లో పెట్టుకొని 50 కిట్లు మించకుండా పంపిణీ చేయాలి.
జగనన్న విద్యా కానుకతో
రాష్ట్రం అంతా పండుగ వాతావరణం నెలకొని వుంటే తెలుగు తమ్ముళ్లు ఓర్చుకోలేకపోతున్నారు.
కేంద్ర ప్రభుత్వం పథకం అని అవాకులు చెవాకులు పేలుతున్నారు.
దేశంలో ఎక్కడైనా ఈ పథకం వుందా ?.
వంద శాతం నిధులు మేమం కేటాయించాం.
యూనిఫాంల కోసం కేవలం వంద కోట్లు మాత్రమే కేంద్రం నుండి వచ్చింది.
మొత్తం 160 కోట్లు మాత్రమే కేంద్రం ఇచ్చింది.
కేంద్రం నుండి నిధులు వస్తే మేం బహిరంగంగా చెబుతాం.
650 కోట్లతో 43 లక్షల మంది విద్యార్థులు లకు కిట్లు పంపిణీ చేస్తున్నాం.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire