Live Updates: ఈరోజు (10 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 10 అక్టోబర్, 2020 : హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు శనివారం | 10 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | అష్టమి మ.12-29 వరకు తదుపరి నవమి | పునర్వసు నక్షత్రం రా.08-58 వరకు తదుపరి పుష్యమి| వర్జ్యం: ఉ.08-41 నుంచి 10-19 వరకు తిరిగి తే.5-51 నుంచి 5-55 వరకు | అమృత ఘడియలు సా.06-31నుంచి 07-42 వరకు | దుర్ముహూర్తం: ఉ.05-54 నుంచి 07-20వరకు | రాహుకాలం: ఉ.09-00 నుంచి 10-30 వరకు | సూర్యోదయం: ఉ.5-54 | సూర్యాస్తమయం: సా.5-40
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 10 Oct 2020 12:18 PM GMT
విశాఖ..
వెదర్ అప్ డేట్
వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్.
తీర ప్రాంతాలలో మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వెళ్లకుండా మత్స్యశాఖ అధికారులు అప్రమత్తం గావించాలన్నారు.
జిల్లా కలెక్టర్ కార్యాలయంలో టోల్ ఫ్రీ నెం . 0891 – 2590102 :;; 0891- 2590100.
లోతట్టు ప్రాంతాలలో ప్రజలను అప్రమత్తం గావించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
జిల్లా అధికారులంతా అందుబాటులో వుండి అవసరమైన చర్యలు చేపట్టాలి.
- 10 Oct 2020 12:17 PM GMT
తూ.గో జిల్లా పెద్దాపురం.
తేదేపాపొలిట్ బ్యూరో సభ్యుడు మాజీఉప ముఖ్యమంత్రి పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్పజగన్ ప్రభుత్వం పై కామెంట్స్..
రాష్ట్ర పురోభివృద్ధికి,
మార్పు కోసమని జగన్ ప్రభుత్వానికి 151 సీట్లు ఇస్తే ఏకే 47 లాంటి తుగ్లక్ నిర్ణయాలు తీసుకుంటూరాష్ట్రాన్ని అన్ని రంగాలలోనూ వెనక్కి నెట్టేస్తున్నారు
రాజధాని నిర్మాణానికి ఉదారంగా భూములు ఇచ్చిన 30 వేల మంది రైతులు మూడు వందల రోజులుగా రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నా.... నిమ్మకు నీరెత్తినట్లు ప్రభుత్వం వ్యవహరించడం దుర్మార్గం...
రాజధాని తరలిపోతుంది అన్న వేదనతో ఇప్పటికే 91 మంది రైతులుమనోవేదనతో తనువు చాలించారు.
రాష్ట్ర భవిష్యత్తు కోసం 30 వేల మంది రైతులుఈ 34,323 ఎకరాలభూమిని ఇస్తేవారిత్యాగాలు అవహేళన చేస్తున్నారు...
గాంధేయ మార్గంలోఆందోళన చేస్తున్న రైతులను పెయిడ్ ఆర్టిస్టులు అంటూఅవమానిస్తున్నారు...
రాజధాని తరలింపు పై హైకోర్టు స్టేటస్ కో ఇచ్చినాదొంగచాటుగా ప్రభుత్వ కార్యాలయాలు తరలిస్తున్నారు..
భూదందాల కోసం కబ్జాభూముల ధరలకు కోసందేశంలో ఎక్కడా లేని
మూడురాజధానులనిర్ణయాన్ని తెరపైకి తీసుకువచ్చిరాష్ట్రాన్ని ప్రపంచస్థాయిలో అభాసుపాలు చేశారు..
రైతులను కన్నీటిపాలు చేసిన ఏ ప్రభుత్వం మనుగడ సాధించలేదు
అమరావతి ఉద్యమం 300 రోజులు పూర్తవుతున్న సందర్భంగా జేఏసీ పిలుపు మేరకుశనివారం నుండిఆదివారం వరకుఆంధ్రుల రాజధాని సమరభేరి కార్యక్రమాలుతేదేపా చేపట్టాం-
నిమ్మకాయల చిన రాజప్ప
- 10 Oct 2020 12:17 PM GMT
తూర్పుగోదావరిజిల్లా. జగ్గంపేట
మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు మీడియా సమావేశం
అమరావతినే రాజధానిగా కొనసాగించాలి: మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు
పరిపాలన వికేంద్రీకరణతోనే అభివృద్ధి జరుగుతుందా. చిత్తశుద్ధి ఎలా ఐన జరుగుతుంది:మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు
ఇళ్ల స్థలాలకు భూములు పేరుతో దోపిడీ చేస్తున్నారు: మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు
16 నెలలు కాలంలో రాష్ట్రంలో ఒక్క స్థలాన్ని ఇవ్వలేదు: మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు
ఏదో ఒంకలు పెట్టి జరుపుకొస్తున్నారు శుద్ధి ఉంటే వెంటనే ఇవ్వాలి: మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు
- 10 Oct 2020 12:17 PM GMT
తూర్పుగోదావరి.. పెద్దాపురం..
మాజీ ఉపముఖ్యమంత్రి పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప కామెంట్స్ ..
మార్పు కోసమని ప్రజలు ఈ ప్రభుత్వానికి 151 సీట్లు ఇస్తే ఏకే 47 లాంటి తుగ్గక్ నిర్ణయం తీసుకుని రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో వెనక్కు నెట్టి వేశారు.
ఈ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నియంతృత్వ విధానాలు, నిరంకుశత్వ ప్రకటనలో రాజధాని నిర్మాణానికి ఉదారంగా భూములిచ్చిన 30వేల మంది రైతులు 300 రోజులుగా రోడెక్కి ఆందోళన చేస్తున్నా నిమ్మకు నీరెత్తినట్లు ప్రభుత్వం వ్యవహరిస్తోంచడం దుర్మార్గం.
మాకు న్యాయం చేయండంటూ నిరసన తెలిపిన రైతులపై, మహిళలపై దాడులు చేయించారు.
రాష్ట్ర మంత్రులు అవమానకర మాటలతో లాఠీలతో చితక్కొంటించారు.
పోలీసు బూటు కాళ్లతో తన్నించారు. బూతుల తో దూషించారు, కేసులు పెట్టి వేధించారు. ఈ నియంతృత్వ చర్యలే ప్రభుత్వ పతానికి నాంది.
రాజధాని తరలింపై హైకోర్టు స్టేటస్ కో ఇచ్చినా దొంగచాటుగా ప్రభుత్వ కార్యాలయాలు తరలిస్తున్నారు.
- 10 Oct 2020 12:17 PM GMT
అమరావతి
ట్విట్టర్ లో టిడిపి నేత బండారు సత్యనారాయణ మూర్తి...
కరోనా పేషేంట్లు అయినా ఒక నెలలో హోమ్ క్వారంటైన్ నుంచి బయటకు వస్తున్నారు గానీ తాడేపల్లి క్వారంటైన్ లో ఉంటున్న జగన్ రెడ్డి మాత్రం నెలల తరబడి బయటకు రావడం లేదు.
కేసుల భయానికి ఒక్క ఢిల్లీకి మాత్రం ఇంట్లో నుంచి కాలు బయట పెడుతున్నాడు.
వానొచ్చినా వరదొచ్చినా, చివరకు సొంత పార్టీ ఎంపీ చనిపోయినా ఆ కాలు బయటకు కదలదు.రేపు సీబీఐ కోర్టుకు రోజూ రమ్మంటే కళ్ళ నుంచి కృష్ణ, గోదావరి వరదలేనా..?
క్వారంటైన్ రెడ్డికి ఎంత కష్టం వచ్చింది?
- 10 Oct 2020 12:14 PM GMT
తిరుమల
శ్రీవారికి కానుకగా బంగారు శఠారి విరాళం
టీటీడీ బోర్డ్ సభ్యులు కృష్ణమూర్తి వైద్యనాథన్ తిరుమల శ్రీవారికి రూ.35.89 లక్షల విలువైన బంగారు శఠారిని కానుకగా సమర్పించారు.
ఈ విరాళాన్ని శ్రీవారి ఆలయంలో టీటీడీ అదనపు ధర్మారెడ్డికి అందజేశారు.
- 10 Oct 2020 12:13 PM GMT
విశాఖ
విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ పేరుతో నకిలీ వెబ్ సైట్
ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు వల
దరఖాస్తు రుసుము పేరుతో భారీగా డబ్బు వసూలు
గత శనివారం సైబర్ క్రైమ్ పోలీస్ లకు ఫిర్యాదు చేసిన పోర్ట్ యాజమాన్యం
తిరిగి మరికొన్ని ఉద్యోగాల పేరుతో నకిలీ వెబ్ సైట్ లో నిరుద్యోగులకు వల
నకిలీ వెబ్ సైట్ లో ప్రకటనను చూసి అలెర్ట్ అయిన పోర్ట్ యాజమాన్యం
ఇటువంటి ప్రకటనలు చూసి మోసపోవద్దని నిరుద్యోగులకు హెచ్చరిక
సైబర్ క్రైమ్ పోలీస్ లకు సమాచారం అందించిన పోర్ట్ ఉన్నతాధికారులు
- 10 Oct 2020 9:38 AM GMT
విశాఖ
మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు కామెంట్స్
రాజధానిపై రైతుల ఆందోళన 300 రోజులు అవుతున్న సందర్భంగా వారికి సంఘీభావంగా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలి
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో సోమవారం వారికి సంఘీభావంగా ప్రత్యేక కార్యక్రమం
రాజధాని నిర్మాణానికి తమ వంతు సాయంగా భూములిచ్చిన అమరావతి రైతులను బూతులు తిట్టడం దారుణం
గుడికి వెళ్లే అమరావతి రైతులు సైతం పోలీసులు అడ్డుకొని దారుణంగా వ్యవహరిస్తున్నారు
ఏపీలో పోలీసు వ్యవస్థ జగన్ తొత్తులుగా వ్యవహరిస్తోంది
రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు జరుగుతున్నా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు
ఢిల్లీ కంటే ఏపీలో లో మంచి రాజధాని నిర్మించేందుకు సహకరిస్తానని మాటిచ్చిన ప్రధానమంత్రి రాజధాని రైతుల సమస్యలు పరిష్కరించాలి
- 10 Oct 2020 9:38 AM GMT
తిరుమల
టిటిడి ఈఓగా ఓ అరుదైన అవకాశం లభించింది
అధికారినైనా భక్తుడిగా సేవలందిస్తాను
ఇన్ని రోజుల తరువాత ఈ అవకాశం కలగడం ఆనందంగా ఉంది
భక్తుల సౌకర్యాలను దృష్టిలోవుంచుకుని వ్యవస్థను మరింత పటిష్ట పరచడానికి ప్రయత్నిస్తాను.
నూతన ఈఓ జవహర్ రెడ్డి
- 10 Oct 2020 9:38 AM GMT
అమరావతి
మాజీ మంత్రి అఖిల ప్రియ
వైసీపీ ప్రభుత్వం ప్రజల మధ్య చిచ్చుపెట్టి, సంపాదనపై దృష్టిపెట్టింది
రాష్ట్రంకోసం, ప్రజల సంక్షేమం కోసం భూములిచ్చిన రైతులపై కక్షసాధింపులకు పాల్పడటం ఏమిటి..?
అమరావతికోసం రైతులు, మహిళలు 300 రోజుల నుంచీ ధర్నాలు, ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వంలో చలనం లేదు.
అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందనేవారు, అధికారంలో ఉండికూడా ఎందుకు నిరూపించలేకపోయారు.
విశాఖను రాజధానిగా ప్రకటించాక అక్కడ 72వేల రిజిస్ట్రేషన్లు జరిగాయి.
కర్నూల్లో హైకోర్టు పెట్టడం అనేది ప్రభుత్వం చేతిలో లేదు.
రాయలసీమకు హైకోర్ట్ వచ్చినంత మాత్రాన అక్కడి ప్రాంత యువతకు ఉద్యోగాలు వస్తాయా..? రైతుల జీవితాలు బాగుపడతాయా..?
ప్రజలు వారిలో వారే కొట్టుకొని చచ్చేలా చేస్తూ, వైసీపీ ప్రభుత్వం సంపాదనే ధ్యేయంగా అవినీతిపాలన సాగిస్తోంది.
ఆఖరికి తమస్వార్థంకోసం కులాలు, మతాల మధ్యన చిచ్చుపెట్టాలని చూస్తున్నారు.
అమరావతి రైతులను రోడ్లపాలుచేసినవారు, రాయలసీమకు న్యాయం చేస్తారంటే ఎవరు నమ్ముతారు?
చంద్రబాబు హయాంలో రాష్ట్రం అభివృద్ధిలో పొరుగు రాష్ట్రాలతో పోటీ పడింది.
వైసీపీకి ఓటేసినవారంతా ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు.
రాష్ట్రమంతా అమరావతి రైతులకు మద్ధతుగా నిలవాలి.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire