Live Updates:ఈరోజు (ఆగస్ట్-10) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు సోమవారం, 10 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, కృష్ణపక్షం సప్తమి(పూర్తిగారోజంతా) తదుపరి అష్టమి; అశ్వని నక్షత్రం (ఉ. 8-36 వరకు) తదుపరి భరణి, అమృత ఘడియలు (మ.12-38 నుంచి 2-24 వరకు), వర్జ్యం (సా.4-10 నుంచి 5-56 వరకు) దుర్ముహూర్తం ( ఉ. 5-44 నుంచి 7-2మ. 12-30 నుంచి 1-21 వరకు తిరిగి మ. 3-03 నుంచి 3-53 వరకు వరకు) రాహుకాలం (ఉ. 9-00 నుంచి 10-30 వరకు) సూర్యోదయం ఉ.5-45సూర్యాస్తమయం సా.6-26

ఈరోజు తాజా వార్తలు


Show Full Article

Live Updates

  • తలసాని, గంగుల పర్యటన.
    10 Aug 2020 5:32 AM GMT

    తలసాని, గంగుల పర్యటన.

    కరీంనగర్ జిల్లా... మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్ పర్యటన.

    పద్మనగర్ లోని పశు ఘని కృత్ కేంద్రంలో క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్ ప్రారంభించిన మంత్రులు.

  • గీసుగొండలో  బీజేపీ జిల్లా కార్యాలయానికి భూమి పూజ.
    10 Aug 2020 5:28 AM GMT

    గీసుగొండలో బీజేపీ జిల్లా కార్యాలయానికి భూమి పూజ.

    వరంగల్ రూరల్ జిల్లా: గీసుగొండ మండలం ధర్మారంలో బీజేపీ జిల్లా కార్యాలయానికి భూమి పూజ.

    వర్చవల్ లో పాల్గొనున్న జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్,

    పూజలో పాల్గొన్న జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీధర్ దంపతులు..

  • నెక్కొండ మండలంలో దారుణం
    10 Aug 2020 5:25 AM GMT

    నెక్కొండ మండలంలో దారుణం

    వరంగల్ రూరల్ జిల్లా: నెక్కొండ మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది.

    - ఈ రోజు తెల్లవారుజామున చొప్పరి అశోక్ అనే వ్యక్తి కుటుంబ కలహాలతో భార్య శిరీషను కర్రతో తలపై కొట్టాడు.

    - తీవ్ర గాయాలపాలైన శిరీషను వరంగల్ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందింది.

    - విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ జరుపుతున్నారు.


  • బిజెపి జిల్లా కార్యాలయానికి భూమి పూజ చేసిన  ఎంపి సోయం బాపురావు
    10 Aug 2020 5:24 AM GMT

    బిజెపి జిల్లా కార్యాలయానికి భూమి పూజ చేసిన ఎంపి సోయం బాపురావు

    - ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కైలాస్ నగర్ లో బిజెపి జిల్లా కార్యాలయానికి భూమి పూజ.

    - భూమి పూజ చేసి ఎంపి సోయం బాపురావు

    - పాల్గోన్నా బిజెపి జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్, కార్యర్తలు


  • పులిచింతలకు జ‌ల‌క‌ళ‌
    10 Aug 2020 4:57 AM GMT

    పులిచింతలకు జ‌ల‌క‌ళ‌

    పులిచింతల ప్రాజెక్టు: 

    పూర్తి నీటి నిల్వ సామర్థ్యం : 45.77 టీఎంసీలు కాగా... ప్రస్తుత నీటి నిల్వ : 9.115 టీఎంసీలకు చేరుకుంది.

    పూర్తి స్థాయి నీటి మట్టం : 175.89 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం : 138.777 అడుగులకు చేరుకుంది.

    ఇన్ ప్లో : నిల్ కాగా.. మొత్తం అవుట్ ఫ్లో : 4100 క్యూసెక్కులు. 

  • ఉప్పల్ లో  మహిళ దారుణ హత్య
    10 Aug 2020 4:48 AM GMT

    ఉప్పల్ లో మహిళ దారుణ హత్య

    ఉప్పల్ పీఎస్ పరిధి చిలకానగర్‌లో రేణుక అనే మహిళను అంజయ్య అనే డ్రైవర్ హత్య చేశాడు.

    అంజయ్య, రేణుకల మధ్య ఉన్న వివాహేతర సంబంధం ఉన్నట్టు తెలుస్తోంది.

    అంజయ్య భార్య పుట్టింటికి వెళ్లగా.. నిన్న రాత్రి చిలకానగర్‌లోని అంజయ్య నివాసానికి రేణుక వచ్చింది.

    ఈ నేపథ్యంలో రేణుకను అంజయ్యయ హత్య చేశాడు.

    రేణుక తలపై బలమైన గాయాలున్నాయి.

    హత్యానంతరం అంజయ్య పోలీసుల ఎదుట లొంగిపోయాడు.

    సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

    హత్యకి గల కారణాలు తెలియాల్సి ఉంది. 

  • టీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ గంగాధర్‌గౌడ్‌కు కరోనా
    10 Aug 2020 4:04 AM GMT

    టీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ గంగాధర్‌గౌడ్‌కు కరోనా

     - తెరాస రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ వి.గంగాధర్‌గౌడ్‌కు కరోనా సోకింది.

    - ఆయనతో పాటు ఎమ్మెల్సీ సతీమ ణి, కుమారుడికి పాజిటివ్‌ అని నిర్ధారణ అయింది.

    - తమకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవని, ఆరోగ్యంగా ఉన్నామని వీజీ గౌడ్‌ తెలిపారు.

    - హైదరాబాద్‌లో హోం క్వారంటైన్‌లో ఉన్నామని పేర్కొన్నా రు.

     - ఇటీవల ఓ సమావేశంలో పాల్గొన్నానని తెలిపారు. 

  • 10 Aug 2020 3:11 AM GMT

    నిజామాబాద్ : ఇందల్వాయి మండలం నల్లవెల్లి దారుణం

    కాంగ్రెస్ సీనియర్ నేత డిపి గంగారం దారుణ హత్య.

    పొలానికి వెళ్లి తిరిగి వస్తుండగా కాపు కాసి కర్రలతో బాధి హత్య చేసిన దుండగులు.

    హత్య కు గల కారణాల పై పోలీసుల విచారణ.

    నిందితుల కోసం గాలింపు.

  • 10 Aug 2020 3:11 AM GMT

    పాల్వంచ కిన్నెరసాని ప్రాజెక్టు జలకళ

    భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ....

    - పూర్తిస్థాయి నీటిమట్టం :8.4 టీఎంసీలు.

    - ప్రస్తుత నీటిమట్టం :7.91టీఎంసీలు .

    - పూర్తిస్థాయి నీటిమట్టం :407.అడుగులు .

    - ప్రస్తుత నీటి మట్టం : 405.20అడుగులు .

    - ఇన్ ఫ్లో...:6000 క్యూసెక్కులు

    - అవుట్ ఫ్లో..:nill

    - కిన్నెరసాని జలకళ...

    ఈ రోజు ఉదయం 10.30 గంటలకు (2)గేట్లు ఎత్తి 10 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయనున్న అధికారులు.... దిగువ గ్రామీణ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక

  • 10 Aug 2020 1:57 AM GMT

    - ఖమ్మం జిల్లాలోని నాగార్జున సాగర్ ఆయకట్టు భూములకు ఈ నెల 12 నుండి పాలేరు రిజర్వాయర్ నుండి నీటి విడుదల

    - రెండున్నర లక్షల ఎకరాల సాగు భూములకు నీళ్లు రావడంపై అన్నదాతల్లో హర్షాతిరేకాలు

Print Article
Next Story
More Stories