Live Updates:ఈరోజు (ఆగస్ట్-10) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు సోమవారం, 10 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, కృష్ణపక్షం సప్తమి(పూర్తిగారోజంతా) తదుపరి అష్టమి; అశ్వని నక్షత్రం (ఉ. 8-36 వరకు) తదుపరి భరణి, అమృత ఘడియలు (మ.12-38 నుంచి 2-24 వరకు), వర్జ్యం (సా.4-10 నుంచి 5-56 వరకు) దుర్ముహూర్తం ( ఉ. 5-44 నుంచి 7-2మ. 12-30 నుంచి 1-21 వరకు తిరిగి మ. 3-03 నుంచి 3-53 వరకు వరకు) రాహుకాలం (ఉ. 9-00 నుంచి 10-30 వరకు) సూర్యోదయం ఉ.5-45సూర్యాస్తమయం సా.6-26

ఈరోజు తాజా వార్తలు


Show Full Article

Live Updates

  • వెదర్ రిపోర్ట్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
    10 Aug 2020 1:19 PM GMT

    వెదర్ రిపోర్ట్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

    రాజారావు ఐఎండి డైరెక్టర్ @ హైదరాబాద్

    నిన్న వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలతో పాటు ఓ మోస్తరు భారీ వర్షాలు కురుస్తున్నాయి...

    తెలంగాణ లో నిజామాబాద్ జిల్లాలోని నవిపేట లో అత్యధికంగా 17సెమీ వేల్పూరు 13సెమి, కామారెడ్డి జిల్లాలోని జుక్కల్ 14 సెమి ల భారీ వర్షపాతం వర్షపాతం నమోదైంది.

    కోస్తాంధ్రలోని విజయనగరంలో 10 సెమి ,రాయలసీమ లోని గుంతకల్ లో 7సెమీ ల వర్షపాతం నమోదైంది..

    ఈ అల్పపీడన ప్రభావం వల్ల తెలంగాణ జలాల్లో ఇవాళ ఓ మోస్తరు వర్షాలతో పాటు ఉత్తర తెలంగాణ లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది రేపు ,ఎల్లుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం...

    కోస్తాంధ్ర లో ఇవాళ తెలికాపాటి వర్షాలతో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు,ఎల్లుండి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది..

    రాయలసీమ లో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది..

    ఆగస్టు 13 న మరో వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది..

    దీని ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు వర్షాలతో పాటు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది...

    నైరుతి రుతుపవనాల్లో తెలంగాణ లో సాధారణం కన్నా 16 శాతం ఎక్కువగా ,కోస్తాంధ్ర లో సాధారణం కన్నా 24శాతం ఎక్కువగా,రాయలసీమ లో సాధారణం కన్నా 110 శాతం ఎక్కువగా వర్షపాతం నమోదైంది.

  • కరోనా కిట్లను పంపిణీ
    10 Aug 2020 1:15 PM GMT

    కరోనా కిట్లను పంపిణీ

    నల్లగొండ జిల్లా : నకిరేకల్ నియోజకవర్గం లో కరోనా సోకిన కుటుంబాలకు 17 రకాల వస్తువులతో కూడిన కిట్లను పంపిణీ చేసిన నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం..

  • 10 Aug 2020 1:13 PM GMT

    వికారాబాద్ జిల్లా : హరితహారం కార్యక్రమం లో భాగంగా దౌల్తాబాద్ మరియు దుద్యాల గ్రామాల్లో 1000 ఈత మరియు 2000 ఖర్జురా మొక్కలు నాటిన కొడంగల్ ఎక్ససైజ్ అదికారులు.

    నాగర్ కర్నూలు జిల్లా : కల్వకుర్తి మండలం రఘుపతిపేట వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న కుందుబీనదీ... రఘుపేట నుంచి తెలకపల్లి వెళ్లే రహదారికి అంతరాయం ఏర్పడి ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు.

  • కొమురం భీం జిల్లాలో కరోనా
    10 Aug 2020 1:12 PM GMT

    కొమురం భీం జిల్లాలో కరోనా

    కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఈ రోజు 15 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని జిల్లా పాలనాధికారి సందీప్ కుమార్ ఝా తెలిపారు.

    ఆసిఫాబాద్ 5, గొలెటీ 8 రెబ్బెన లో 2 కేసులు నమోదు


  • అనుమానాస్పద మృతి
    10 Aug 2020 1:10 PM GMT

    అనుమానాస్పద మృతి

    సంగారెడ్డి జిల్లా: పఠాన్ చేరు మండలం రుద్రారం లోని MSN పరిశ్రమలో కాంట్రాక్ట్ కార్మికుడు నాగరాజు (45) అనుమానాస్పద మృతి.

    .. చనిపోయిన నాగరాజు కు న్యాయం జరగాలంటూ MSN పరిశ్రమ గేట్ ముందు మృతదేహం తో కుటుంబ సభ్యుల ధర్నా.

  • విద్యుత్ ఘాతం తో మహిళ మృతి
    10 Aug 2020 1:08 PM GMT

    విద్యుత్ ఘాతం తో మహిళ మృతి

     హైదరాబాద్: ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిదిలోని శ్రీరామ్ నగర్ లో విద్యుత్ ఘాతం....ఇంట్లో తెగి పడిన విద్యుత్ వైరు..

    ఇంట్లో పని చేస్తున్న షేక్ సుల్తానా (42) కు విద్యుత్ తీగలు తగలడంతో విద్యుత్ ఘాతం తో మృతి.. మెంటల్ హాస్పిటల్ లో సెక్యూరిటీ గార్డుగా పని చేసే షేక్ సుల్తానా..

    కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు

  • సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రెస్ మీట్
    10 Aug 2020 1:06 PM GMT

    సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రెస్ మీట్

    వరంగల్ అర్బన్:  ఆగస్ట్ 5న ప్రధాని అయోధ్య లో రామాలయ భూమి పూజకు వెళ్లాడాన్ని తాము వ్యతిరేకిస్తున్నాం..... ఆ రోజును చీకటి రోజుగా పరిగణిస్తున్నాం.

    ఆగస్టు 15 న స్వాతంత్ర్య దినోత్సవ రోజున రాజ్యాంగ ను రక్షించండి....ప్రజాస్వామ్యాన్ని కాపాడండి...సేవ్ డేమోక్రసీ పేరుతో నిరసనలు వ్యక్తం చేస్తాం.

    ప్రధానమంత్రి ప్రకటించిన 20 లక్షల కోట్ల ప్రచారం ఆర్భాటమే...

    పెట్టుబడిదారీ వ్యవస్థ కు కొమ్ము కాస్తున్న మోదీ ప్రభుత్వం.

    హిందు దేశంగా మార్చేందుకు బిజెపి సర్కారు ప్రయత్నం.

    దేశం అభివృద్ధి లో అగ్ర స్థానంలో లేకున్నా... కోవిడ్ లో మాత్రం ప్రపంచంలో మూడో స్థానంకు చేరింది..

    లాక్ డౌన్ ముసుగులో ప్రధాని మోడీ పబ్లిక్ సెక్టర్స్ అన్ని ప్రైవేట్ పరం చేస్తూ తన హేడెన్ ఏజండా తో ముందుకు వెళ్తున్నారు.

    ప్రధాని మోడీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ లకు కోవిడ్ నివారణ, ప్రజల ప్రాణాలకంటే తమ సొంత ఏజండాలే ముఖ్యమయ్యాయి.

    తెలుగు రాష్ట్రాల్లో దళితులపై జరుగుతున్న దాడులు, హత్యాలను సీపీఐ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది.

  • 10 Aug 2020 1:05 PM GMT

    మెదక్ జిల్లా రామాయంపేట ఉమ్మడి మండలంలో విజృంభిస్తున్న కరోనా రామాయంపేట ధర్మారం ఆసుపత్రులలో నిర్వహించిన కరోనా టెస్టులలో రామాయంపేటలో నలుగురికి నార్లాపూర్ లో ఇద్దరికీ కరొనా పాజిటివ్ గా అధికారులు నిర్ధారించారు

  • సంగారెడ్డిలో క‌రోనా క‌ల‌క‌లం
    10 Aug 2020 1:03 PM GMT

    సంగారెడ్డిలో క‌రోనా క‌ల‌క‌లం

    సంగారెడ్డి జిల్లా: ఆందోల్ మండల్ జోగిపేటలో 1,

    ఆందోల్ గ్రామంలో 3,

    వట్టిపల్లి మండలం మేడికొండ గ్రామంలో 1,

    కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారించిన వైద్యాధికారులు.

  • సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రెస్ మీట్
    10 Aug 2020 1:01 PM GMT

    సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రెస్ మీట్

    సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో

    సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రెస్ మీట్

    1. ప్రపంచంలోనే ఆస్తుల విషయంలో అంబానీ మూడో స్థానంలో నిలిస్తే మనదేశం కోవిడ్ విషయంలో మూడోస్థానానికి పెరిగింది

    2. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం రాజ్యంగాని ధ్వంసం చేస్తుంది మత రాజకీయాల్ని ప్రోత్సహిస్తోంది

    3. దీనికి నిరసనగా ఆగస్టు 15న రాజ్యాంగాన్ని కాపాడాలని దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతాం

Print Article
Next Story
More Stories