ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 10 ఆగస్ట్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు సోమవారం, 10 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, కృష్ణపక్షం సప్తమి(పూర్తిగారోజంతా) తదుపరి అష్టమి; అశ్వని నక్షత్రం (ఉ. 8-36 వరకు) తదుపరి భరణి, అమృత ఘడియలు (మ.12-38 నుంచి 2-24 వరకు), వర్జ్యం (సా.4-10 నుంచి 5-56 వరకు) దుర్ముహూర్తం ( ఉ. 5-44 నుంచి 7-2మ. 12-30 నుంచి 1-21 వరకు తిరిగి మ. 3-03 నుంచి 3-53 వరకు వరకు) రాహుకాలం (ఉ. 9-00 నుంచి 10-30 వరకు) సూర్యోదయం ఉ.5-45సూర్యాస్తమయం సా.6-26
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 10 Aug 2020 3:56 PM GMT
హత్య కేసును ఛేదించిన పోలీసులు
- పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి భాగ్యలక్ష్మి కాలనీ లో మూడు రోజుల క్రితం జరిగిన హత్య కేసును ఛేదించిన పోలీసులు.
- వివాహేతర సంబంధం కారణంగా మాధవరావు అనే వ్యక్తిని హత్య చేసిన కృష్ణ
- నిందితుడిని రిమాండ్ కు తరలించిన పోలీసులు
- 10 Aug 2020 3:53 PM GMT
ఆగస్టు 15 సెలబ్రేషన్స్ పై హైకోర్టు కీలక ఆదేశాలు...
TS High Court : కేంద్ర హోంశాఖ, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాల మేరకు కరోనా నేపథ్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఆంక్షలు...
- వైద్య ఆరోగ్యశాఖ సూచించిన సూచనల ప్రకారం బౌతిక దూరం, షానిటైజేషన్, మాస్క్ లు ధరించి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశం..
- అన్ని జిల్లాల న్యాయస్థానాలకు హైకోర్టు ఆదేశం..
- స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను 50 మందితో నిర్వహించాలి..
- కేవలం వేడుకలను 20 నిముషాల్లో ముగించాలన్న హైకోర్టు..
- వేడుకలకు ఎలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు జరప వద్దన్న హైకోర్టు..
- అన్ని జిల్లా న్యాయస్థానాలు అమలు చేయాలన్న హైకోర్టు.
- 10 Aug 2020 3:51 PM GMT
పూర్తయిన సచివాలయం కూల్చివేత
చివరగా ఈరోజు ఎల్ బ్లాక్ ను కూల్చివేసిన సిబ్బంది..
మిగిలిన శిథిలాల తొలగింపు ప్రక్రియ....
శిథిలాల నుండి ఇనుము , కంకర, అల్యూమినియం ఇతర సామాగ్రిని వేరు చేస్తున్న సిబ్బంది..
వ్యర్ధాల తొలగింపుకు మరో నెల రోజుల సమయం పడుతుందంటున్నా అధికారులు..
- 10 Aug 2020 3:44 PM GMT
నకిలీ నక్సలైట్లను అరెస్టు
కుమ్రంబీమ్ జిల్లా అసిపాబాద్ మండలం చిర్రకుంటలో ముగ్గురు నకిలీ నక్సలైట్లను అరెస్టు చేసిన పోలీసులు..
వారి వద్ద నకిలీ పిస్టోల్ ఒకటి, రెండు నకిలీ రైపిళ్లను, నాలుగు సెల్ పోన్లు, ఒక బైక్ ను స్వాదీనం చేసుకున్నా పోలీసులు..
డబ్బుల కోసం వ్యాపారులను బెదిరించినట్లు పోలీసుల విచారణలో వెల్లడి. ఎస్పీ విష్ణవారియర్ కుమ్రంబీమ్ జిల్లా
- 10 Aug 2020 3:42 PM GMT
తెలంగాణ లో ఎంట్రెన్స్ టెస్టుల పై నిర్ణయం
ఈ నెల 31వ తేదీన ఈసెట్-- సెప్టెంబర్ 9, 10, 11, 14న ఎంసెట్.
సెప్టెంబర్ 2వ తేదీన పాలిసెట్. టిపిఎస్ ద్వారా ఆన్లైన్ ఎంట్రెన్స్ పరీక్షలు.
సెప్టెంబర్ 1వ తేదీ తరువాత ఇంటర్ అడ్మిషన్ల పై నిర్ణయం.
ఈ నెల 20వ తేదీ నుంచి ప్రభుత్వ పాఠశాల్లో డిజిటల్ క్లాసులు.
సెప్టెంబర్ 1 నుంచి 3-5 తరగతి వరకు క్లాస్ లు.
ఈ నేల 17వ తేది నుంచి 50 శాతం టీచర్ల అటెండెన్స్ తప్పనిసరి
- 10 Aug 2020 3:39 PM GMT
తెలంగాణలో కరోనా నివారణ చర్యలపై కేంద్ర బృందం ప్రశంసలు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడి లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న వినూత్న చర్యలను అభినందించిన కేంద్ర బృందం.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హోమ్ ఐసోలేషన్ పేషేంట్ ల కోసం రూపొందించిన హితం యాప్ ను ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా ఉంది.
రెండు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర బృందం కరోనా కట్టడి కి సంబంధించిన అనేక అంశాలపై చర్చించింది.
రాష్ట్ర పర్యటన లో భాగంగా వైద్యారోగ్యా శాఖ మంత్రి ఈటల రాజేందర్ తో బిఆర్కే భవన్ లో సమావేశం అయింది.
ఇన్నోవేటివ్ హితం యాప్ ఇతర రాష్ట్రల తో పంచుకోవాల్సిందిగా సూచించిన కేంద్ర బృందం,నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్
కరోనా మహమ్మరిని అదుపు చేయడానికి కోవిడ్ 19 టెస్ట్ ల సంఖ్య గణనీయంగా పెరిగింది.
కరోనా తీవ్రతను తగ్గించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పట్టాల్సిన పలు అంశాలపై చర్చించిన వీకే పాల్
రాష్ట్రంలోని ఆసుపత్రిలలో కరోనా చికిత్సకు సిద్ధమైన విధానము వ్యాప్తిని అరికట్టే చర్యలు పేషేంట్ లకు అందిస్తున్న చికిత్స చర్యలు చాలా సంతృప్తికరంగా ఉన్నాయి అన్న వీకే పాల్
మొదటి నుండి కరోనా కట్టడిలో కేంద్ర ప్రభుత్వం సమన్వయం తో పని చేస్తున్నాము
ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు ప్రజల ప్రాణాలు రక్షించండానికి 24 గంటల పాటు శ్రమిస్తున్నాము.
కేంద్ర బృందం కరోనా పరీక్షలు, చికిత్స లపై సంతృప్తి వ్యక్తం చేసింది
కేంద్ర బృందం గ్రామీణ ప్రాంతాల్లో వైరస్ నివారణ చర్యల పై సూచనలు చేసింది.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మాద్యే జరిగింది క్యాబినెట్ సమావేశంలో రోజుకు 40 వేల పరిక్షలు నిర్వహించాలని ఆదేశించారు
కోవిడ్ కట్టడి కి ప్రత్యేక నిధులు మంజూరు చేశారని సీఎస్ సోమేశ్ కుమార్ సమావేశంలో కేంద్ర బృందానికి తెలిపారు.
- 10 Aug 2020 3:37 PM GMT
ఈనెల 17న నంది ఎల్లయ్య సంతాపసభ
వి హనుమంత రావు కాంగ్రెస్ సీనియర్ నేత:
కార్పొరేటర్ నుంచి పార్లమెంటు సభ్యుడు దాకా ఎదిగిన వ్యక్తి నంది ఎల్లయ్య.
ఈనెల 17వ తేదీన నంది ఎల్లయ్య సంతాపసభ నిర్వహిస్తున్నాం.
కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు లేని వింత ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.
సోషల్ మీడియాలో కాంగ్రెస్ నేతలపై అవతల పార్టీ వారి కంటే కూడా సొంత పార్టీ వాళ్లే విమర్శలు చేస్తున్నారు.
ఇంత ముందు ఇలాంటి పరిస్థితి ఇప్పుడు లేదు.
సోషల్ మీడియాలో సొంత పార్టీ నేతలు చేస్తున్న విమర్శలపై పార్టీలో చర్చ జరగాలి.
ఇతర పార్టీల నుంచి వచ్చినవారు కల్చర్ లేకుండా వ్యవహరిస్తున్నారు.
సొంత పార్టీ నేతలనే కించపరచడం వల్ల ఎదుటి పార్టీకి అడ్వాంటేజ్ గా మారుతుంది.
హైదరాబాద్ వరంగల్ ఖమ్మం లో మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి.
ఇప్పటి నుంచే గ్రేటర్, పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలకు సమాయత్తం కావాలి.
వీటిపై చర్చించడానికి కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలని బోసు రాజుకు, శ్రీనివాసన్ కు లేఖ రాశాను.
నేను కూడా పీసీసీ అధ్యక్ష పదవి అడుగుతున్నాను.
అయారాం గయారాంలకు పీసీసీ ఇవ్వద్దు.. మొదటి నుంచి పార్టీలో పనిచేసిన వారికి ఇవ్వాలి.
ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పదవి ఇస్తే వారు ఎప్పుడు పార్టీని వీడుతారో కూడా తెలియదు.
- 10 Aug 2020 1:26 PM GMT
ప్రగతి భవన్ లో సమీక్ష సమావేశం.
ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన నీటిపారుదల శాఖ పై ప్రారంభమైన సమీక్ష సమావేశం.
కేంద్ర జలశక్తి మంత్రి లేఖ,అపెక్స్ కౌన్సిల్ సమావేశం అంశాలపై చర్చ.
- 10 Aug 2020 1:24 PM GMT
ఆదిలాబాద్ కరోనా విభృంజన
ఆదిలాబాద్ జిల్లాలో విజ్రుంబిస్తున్నా కరోనా..
ఒక్కరోజులో ముప్పై రెండు కేసులు నమోదు..
బాదితులను చికిత్స కోసం అసుపత్రికి తరలింపు
- 10 Aug 2020 1:21 PM GMT
మందకృష్ణ మాదిగపర్యటన
జయశంకర్ భూపాలపల్లి జిల్లా:
మహాదేవపూర్ మండలం సురరంలో మందకృష్ణ మాదిగపర్యటన.
దళిలుల భూములను ప్రభుత్వం లాక్కునే ప్రయత్నాలు మానుకోవాలని హెచ్చరిక.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire