Live Updates:ఈరోజు (ఆగస్ట్-10) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు పంచాంగం
ఈరోజు సోమవారం, 09 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, కృష్ణపక్షం సప్తమి(పూర్తిగారోజంతా) తదుపరి అష్టమి; అశ్వని నక్షత్రం (ఉ. 8-36 వరకు) తదుపరి భరణి, అమృత ఘడియలు (మ.12-38 నుంచి 2-24 వరకు), వర్జ్యం (సా.4-10 నుంచి 5-56 వరకు) దుర్ముహూర్తం ( ఉ. 5-44 నుంచి 7-2మ. 12-30 నుంచి 1-21 వరకు తిరిగి మ. 3-03 నుంచి 3-53 వరకు వరకు) రాహుకాలం (ఉ. 9-00 నుంచి 10-30 వరకు) సూర్యోదయం ఉ.5-45సూర్యాస్తమయం సా.6-26
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 10 Aug 2020 8:24 AM GMT
గ్రామ, వార్డు సచివాలయాలు ద్వారా ఇళ్లపట్టాలలు ఇచ్చేందుకు 90 రోజుల సమయం పెట్టుకున్నా.. ఒక నెలలో వచ్చిన దరఖాస్తులను అదే నెలలో పరిష్కరించుకుని యాక్షన్ ప్లాన్‌కు సన్నద్ధం కావాలన్నారు
నిర్ణీత సమయంలోగా దరఖాస్తు పరిష్కారం కాకపోతే కారణం ఏంటనేది ముఖ్యమంత్రి కార్యాలయానికీ రావాలి
గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆధార్ సెంటర్ల ఏర్పాటును కేంద్ర ప్రభుత్వం అంగీకరించదని వెల్లడించిన అధికారులు
ల్యాండు రెవిన్యూ రికార్డుల ప్రక్షాళనకు ఒక షెడ్యూల్ ప్రకటించాలన్న సీఎం
ఈ షెడ్యూల్‌ను తనకు నివేదించాలన్న సీఎం
ఆ గ్రామానికి సంబంధించిన రికార్డులు అదే గ్రామంలో ఉంటే సమస్యలు తగ్గుతాయన్న సీఎం
- 10 Aug 2020 8:24 AM GMT
అమరావతి.
గ్రామ, వార్డు సచివాలయాలపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్.జగన్ సమీక్ష.
సామాజిక తనిఖీ మార్గదర్శకాలను విడుదల చేసిన సీఎం వైయస్.జగన్.
గ్రామ, వార్డు సచివాలయాల కోసం ప్రత్యేకంగా పి.ఎం.యూ. కాల్ సెంటర్‌ను ప్రారంభించిన సీఎం వైయస్.జగన్.
పాల్గొన్న గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్ నీలం సాహ్ని, గ్రామ, వార్డు సచివాలయాల ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్, ఇతర ఉన్నతాధికారులు.
- 10 Aug 2020 7:25 AM GMT
రాజధాని తరలింపు పై హైకోర్టు లో మరో పిటిషన్ దాఖలు
అమరావతి: రాజధాని తరలింపు పై హైకోర్టు లో మరో పిటిషన్ దాఖలు.
రాజధాని తరలింపు జరప వద్దంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన టిడిపి ఎమ్మెల్సీ అశోక్ బాబు..
అశోక్ బాబు తరఫున పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాది జంధ్యాల రవిశంకర్..
మరో రెండు రోజుల్లో విచారణకు వచ్చే అవకాశం..
- 10 Aug 2020 7:23 AM GMT
ఉపాధి కల్పనే ముఖ్య ఉద్దేశం: మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
అమరావతి: మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పిసి ఇండస్ట్రీయల్ పాలసీ ని ఈరోజు ప్రారంభించాం
కమిట్మెంట్ తో ముందుకు వెళ్లే విధంగా పాలసీ సిద్దం చేయాలని సీఎం సూచించారు.
ఉపాధి కల్పనే ముఖ్య ఉద్దేశంగా పాలసీ నిర్మించాం
గతంలో లాగా కేవలము చిన్న ఉద్యోగాలు కాకుండా.... మంచి ఉపాధి లభిస్తుంది
ఏపీలో 9 రంగాలకు మంచి అవకాశాలు గుర్తించాం
వచ్చే 3 ఏళ్లలో 45 వేల ఎకరాల ఇండస్ట్రియల్ టౌన్షిప్ లు తీసుకురావాలని చూస్తున్నాం
వైయస్సార్ ఏపీ వన్ పేరుతో పెట్టుబడిదారులను ఆదుకునేందుకు చర్యలు
- 10 Aug 2020 7:20 AM GMT
పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు
శ్రీకాకుళం జిల్లా: లవేరు మండలం బెజ్జిపురంలో పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు..
- 9 మంది పేకాటరాయుళ్ల అరెస్ట్..
- 12 వేల 390 రూపాయల నగదు స్వాధీనం..
- 10 Aug 2020 7:18 AM GMT
అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలి: ఏపీ సర్కార్
అమరావతి: అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దివంగత పెన్మత్స సాంబశివరాజు పార్ధివ దేహానికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం.
అధికారులకు సీఎం వైయస్.జగన్ ఆదేశాలు.
- 10 Aug 2020 7:14 AM GMT
ఘటన స్థలాన్ని పరిశీలించిన డిప్యూటీ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్
విజయవాడ: ఘటన స్థలాన్ని పరిశీలించిన డిప్యూటీ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ రమేష్
స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదం జరిగిన రెండు ఫ్లోర్ లను పరిశీలించిన డిఇ
- 10 Aug 2020 5:57 AM GMT
సాంబశివరావు మృతి పట్ల మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సంతాపం..
విశాఖ: మాజీ మంత్రి ,వైసీపీ సీనియర్ నేత పెనుమత్స సాంబశివరావు మృతి పట్ల రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సంతాపం..
గత ఎన్నికల్లో పార్టీ లో క్రియాశీలకంగా వ్యవహరించిన నాయకులు మృతి చాలా బాధాకరం.
ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఉమ్మడి రాష్ట్రంలో ఏకైక నాయకుడు
గజపతినగరం, సతివాడ శాసనసభ స్థానాల నుంచి వరుసగా ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక
మాజీ మంత్రిగా, ప్రొటెన్స్ స్పీకర్ గా సాంబశివరావు ఎన్నో పదవులు స్వీకరించి... ప్రజల్లో సేవలందించిన నాయకుడు కోల్పోవడం.. పార్టీకి తీరని లోటు..
పెనుమత్స కుటుంబ సభ్యులకు..
మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను.
- 10 Aug 2020 5:56 AM GMT
అగ్ని ప్రమాదం
తూ.గో.జిల్లా: రాజోలు మం బి సావరంలో చేబ్రోలు రామరాజ్యం (70) గ్యాస్ స్టవ్ పై టీ పెడుతుండగా చీర కొంగు కు వ్యాపించిన మంటలు.
శరీరం తీవ్రంగా కాలిపోవడంతో కాకినాడ ప్రైవేట్ ఆస్పత్రికి తరలింపు.
- 10 Aug 2020 5:54 AM GMT
విశాఖ జీవీఎంసీ వద్ద సిపిఐ ఆధ్వర్యంలో నిరసన
విశాఖ: ప్రైవేటు,కార్పొరేటు హాస్పిటల్ లలో వైద్యం పేరుతో చేస్తున్న దందాను అరికట్టాలని డిమాండ్ చేస్తూ విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సిపిఐ ఆధ్వర్యంలో నిరసన.
హోమ్ ఐసోలేషన్ ఉన్న కరోనా పేసేంట్లుకు వైద్య కిట్లు అందించాలని డిమాండ్
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire