Live Updates:ఈరోజు (ఆగస్ట్-10) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు సోమవారం, 09 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, కృష్ణపక్షం సప్తమి(పూర్తిగారోజంతా) తదుపరి అష్టమి; అశ్వని నక్షత్రం (ఉ. 8-36 వరకు) తదుపరి భరణి, అమృత ఘడియలు (మ.12-38 నుంచి 2-24 వరకు), వర్జ్యం (సా.4-10 నుంచి 5-56 వరకు) దుర్ముహూర్తం ( ఉ. 5-44 నుంచి 7-2మ. 12-30 నుంచి 1-21 వరకు తిరిగి మ. 3-03 నుంచి 3-53 వరకు వరకు) రాహుకాలం (ఉ. 9-00 నుంచి 10-30 వరకు) సూర్యోదయం ఉ.5-45సూర్యాస్తమయం సా.6-26

ఈరోజు తాజా వార్తలు


Show Full Article

Live Updates

  • కుర్చేడ్ శానిటైజర్ మృతుల ఘటనను చేదించిన సిట్.
    10 Aug 2020 5:51 AM GMT

    కుర్చేడ్ శానిటైజర్ మృతుల ఘటనను చేదించిన సిట్.

    ప్రకాశం జిల్లా: కుర్చేడ్ శానిటైజర్ మృతుల ఘటనను చేదించిన సిట్.

    - సిట్ అదుపులో ‘పర్ఫెక్ట్‌’ యజమాని,ముడిసరుకును సరఫరా చేసిన ఇద్దరు మార్వాడీలు మరో ఇద్దరు డిస్టీబ్యూటర్స్.

    - నిందితులను హైదరాబాద్‌ నుంచి నిన్న ఉదయం కురిచేడుకు తీసుకువచ్చిన సిట్.

    - నేడు మీడియా ముందు హాజరుపరిచే అవకాశం.

    - హైదరాబాద్‌లోని జీడిమెట్లకు చెందిన ఫర్ఫెక్ట్‌ శానిటైజర్‌ కంపెనీ యజమాని శ్రీనివాస్‌ మూడో తరగతి మాత్రమే చదివి స్ధానికంగా పర్ఫెక్ట్‌ కిరాణా మర్చంట్స్‌  పేరుతో గృహావసరాలకు ఉపయోగపడే దుకాణాన్ని నడిపినట్లు సిట్ గుర్తింపు.

    - లాక్‌డౌన్‌ సమయంలో శానిటైజర్లు, మాస్క్‌లు అమ్మకాలు చేపట్టిన నిర్వాహకుడు.

    - వ్యాపారం బాగుండడంతో యూట్యూబ్‌లో శానిటైజర్ ఫార్ములా విధానంను చూసి ఆచరణలో చూపిన నిర్వాహకుడు.

    - తయారీలో ల్యాబ్‌ టెక్నీషియన్లు, అనుమతుల నిభందనలకు బేఖాతరు.

    - శానిటైజర్‌ తయారీలో ఇథైల్‌ ఆల్కహాల్‌తో పాటు మిథైల్‌ క్లోరైడ్‌ను వినియోగించడంవల్లే కుర్చేడు ఘటనలో 16మంది మృత్యువుకు కారకుడయినట్లు సిట్  బృంద అధికారుల నిర్ధారణ.

    - కురిచేడులోని కొన్ని మెడికల్‌ షాపులకు మాత్రమే శానిటైజర్లు సరఫరా చేసినట్లు

    - రికార్డు ఆధారాలను సేకరించిన సిట్.

    - జిల్లాలో పర్ఫెక్ట్‌ కంపెనీ శానిటైజర్‌ గా దర్శికి చెందిన ఓ డిస్ట్రిబ్యూటర్ను ఎంపిక చేసి స్థానికంగా అమ్మకాలు సాగించినట్లు విచారణలో వెల్లడి.

    - దర్శి డిస్టీబ్యూటర్స్ కోసం గాలిస్తున్న సిట్.

  • తుంగభద్ర కు భారీ గా వరద ప్రవాహం
    10 Aug 2020 5:48 AM GMT

    తుంగభద్ర కు భారీ గా వరద ప్రవాహం

    అనంతపురం: తుంగభద్ర కు భారీ గా వరద ప్రవాహం.

    డ్యామ్ ఇన్ ఫ్లో: 1,16,827 క్యూసెక్కులు.

    డ్యామ్ ఔట్ ఫ్లో: 8514 క్యూసెక్కులు.

    డ్యాం నీటి పూర్తి స్థాయి నీటి మట్టం: 1633 ఆడుగులు.

    డ్యాం: ప్రస్తుత నీటి మట్టం: 1624.85 అడుగులు.

    పూర్తి స్థాయి నీటిమట్టం: 100.855

    ప్రస్తుతం నీటి మట్టం: 72.439

  • సాంబశివరాజు మృతి పట్ల సీఎం జగన్ సంతాపం
    10 Aug 2020 5:46 AM GMT

    సాంబశివరాజు మృతి పట్ల సీఎం జగన్ సంతాపం

    సీనియర్‌ నేత పెన్మత్స సాంబశివరాజు మృతికి ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం

    రాజకీయ కురువృద్ధులు, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి శ్రీ పెన్మత్స సాంబశివరాజు మృతి పట్ల ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌. జగన్‌ మోహన్ రెడ్డి గారు తీవ్ర సంతాపం

    దాదాపు ఐదు దశాబ్దాలకు పైగా ప్రజాసేవలో ఉంటూ, మచ్చలేని నాయకుడిగా, రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయతకు అర్థం చెప్పిన నాయకుడు పెన్మత్స సాంబశివరాజు గారు

    పెన్మత్స గారి మరణం విజయనగరం జిల్లాతో పాటు, రాష్ట్రానికి తీరని లోటు. 

    పెన్మత్స కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి : సిఎం జగన్

  • వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి మృతి
    10 Aug 2020 5:44 AM GMT

    వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి మృతి

    వైసీపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి పెనుమత్స సాంబశివరాజు (87) కన్నుమూత

    అనారోగ్యంతో విశాఖలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి

    ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఉమ్మడి రాష్ట్రంలో ఏకైక నాయకుడు

    1989-94 లో మంత్రిగా బాధ్యతలు

    1958లో సమితి ప్రెసిడెంట్ గా ఎన్నిక

    1968లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నిక

    గజపతినగరం, సతివాడ శాసనసభ స్థానాల నుంచి వరుసగా ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక

    1994 ఎన్నికల్లో ఓటమి

    సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగి రాజకీయ కురువృద్ధుడుగా గుర్తింపు

    మంత్రి బొత్సకు రాజకీయ గురువుగా గుర్తింపు

    వైసీపీ లోకి వచ్చినా ఆశించిన స్థాయిలో గుర్తింపు కరువు

    2019 ఎన్నికల్లో నెల్లిమర్ల టికెట్ ఆశించి భంగపాటు

  • 10 Aug 2020 1:59 AM GMT

    పలాసలో తెరుచుకోనున్న జీడి పరిశ్రమలు

    శ్రీకాకుళం జిల్లా..

    - పలాసలో నేటి నుంచి తెరుచుకోనున్న జీడి పరిశ్రమలు

    - లాక్ డౌన్ కారణంగా గడిచిన 45 రోజులుగా మూతపడిన పరిశ్రమలు

    - కరోనా నిబంధనల పనులు నిర్వహించుకునేందుకు అధికారులు అంగీకారం

  • 10 Aug 2020 1:38 AM GMT

    ఈరోజు నుంచి మహానంది లో దర్శనాలు!

    కర్నూల్

    - ఈరోజు నుండి భక్తులకు దర్శనమివ్వనున్న మహానందీశ్వరుడు

    - ఆలయ సిబ్బందికి కరోనా తో వారం రోజుల పాటు ఆలయం మూసివేత

    - తగు జాగ్రత్తలు తీసుకుంటూ కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ప్రజలు విరివిగా మహానంది క్షేత్రాన్ని దర్శించుకోవాలని విజ్ఞప్తి

  • 10 Aug 2020 1:36 AM GMT

    శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ఉధృతి

    కర్నూలు జిల్లా

    - ఇన్ ఫ్లో : 1,89,531 క్యూసెక్కులు

    - ఔట్ ఫ్లో : 42,000 క్యూసెక్కులు

    - పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు

    - ప్రస్తుతం : 858.70 అడుగులు

    - నీటి నిలువ సామర్థ్యం : 215.807 టిఎంసీలు

    - ప్రస్తుతం : 101.9210 టిఎంసీలు

    - ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి

Print Article
Next Story
More Stories