Live Updates: ఈరోజు (సెప్టెంబర్-06) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 06సెప్టెంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు ఆదివారం | 06 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | భాద్రపద మాసం | కృష్ణపక్షం | చవితి (సా.4-11వరకు) తదుపరి పంచమి | అశ్విని నక్షత్రం (తె.3-44 వరకు) తదుపరి భరణి | అమృత ఘడియలు: రా.7-45 నుంచి 9-31 వరకు | వర్జ్యం: రా.11-18 నుంచి 1-04 వరకు | దుర్ముహూర్తం: సా.4-29 నుంచి 5-18 వరకు | రాహుకాలం: సా.4-30 నుంచి 6-00 వరకు |సూర్యోదయం: ఉ.5-49 సూర్యాస్తమయం: సా.6-08
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 6 Sep 2020 2:36 PM GMT
Antarvedi Updates: అంతర్వేది ఘటనను పరిశీలించిన ఏలూరు రేంజ్ డిఐజీ కెవి మోహనరావు
తూర్పుగోదావరి
- అంతర్వేది లక్ష్మీనరసింహాస్వామి వారి రథం దగ్ధమైన ఘటనలో కొందరు అనమానితులను అదుపులోకి తీసుకుని వారిని విచారిస్తున్నాం.
- రధం దగ్ధంపై సఖినేటిపల్లి పోలీసు స్టేషన్ లో కేసు నమోదు చేశాం.
- డాగ్ స్క్వాడ్ టీమ్, క్లూస్ టీం గాలింపు కొనసాగుతున్నాయి.
- ఘటనకు సంబంధించి బలమైన ఆధారాలు దొరికాయి.
- ప్రమాదమా, కుట్రకోణం దాగివుందా అంశంపై విచారణ జరుపుతున్నాం.
- 6 Sep 2020 11:29 AM GMT
Antervedi updates: లక్ష్మీనరసింహస్వామి కళ్యాణోత్సవానికి ఉపయోగించిన రథం దగ్ధం కావడం భక్తుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి:-నారా లోకేష్..
అమరావతి..
-టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
-రాష్ట్రంలో ఆలయాలను అపవిత్రం చేస్తూ, దేవాలయాలను రాజకీయాలకు వేదికగా వాడుకుంటున్న వైకాపా హయాంలో లక్ష్మీనరసింహుడి రథం కాలిపోవడం రాష్ట్రానికే అరిష్టం అంటున్నారు పండితులు.
-ఓ వైపు గోశాలల్లో గోవుల మృత్యుఘోష, మరోవైపు రోజుకొక ఆలయంలో అరిష్ట సంకేతాలు వెలువడుతున్నా..ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం విచారకం.
-రథం దగ్ధం కావడానికి కారకులెవరో గుర్తించి కఠినంగా శిక్షించాలి.
- 6 Sep 2020 9:33 AM GMT
Rajahmundry updates: రాజోలు-సఖినేటిపల్లి మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అంతర్వేది లక్ష్మి నరసింహ స్వామి వారి యొక్క రథం దగ్ధం అయిన ప్రాంతాన్ని పరిశీలించిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి..
తూర్పుగోదావరి జిల్లా....రాజమండ్రి- రాజోలు
-సఖినేటిపల్లి మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అంతర్వేది లక్ష్మి నరసింహ స్వామి వారి యొక్క రథం దగ్ధం అయిన ప్రాంతాన్ని పరిశీలించిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు, అమలాపురం ఎంపీ చింతా అనురాధ, రాజోలు శాసనసభ్యుడు రాపాక వరప్రసాదరావు, రాష్ట్ర మాల కార్పొరేషన్ చైర్ పర్సన్ అమ్మాజీ తదితరులు.
-ఘటన ప్రాంతంలో డాగ్ స్క్వాడ్ తో సోదాలు చేస్తున్నా పోలీసులు.
-మంత్రి మాట్లాడుతూ ఈ ఘటన దురదృష్టకరమని నవ నారసింహ క్షేత్రాల్లో ఒకటిగా అంతర్వేది నరసింహ స్వామి దేవస్థానం ఉందని, కొత్త రథాన్ని ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
- 6 Sep 2020 7:31 AM GMT
Kurnool updates: ఆదోని వైసీపీ నేత సురేష్ సస్పెన్షన్..
కర్నూలు..
-సురేష్‌ను పార్టీనుంచి సస్పెండ్ చేసిన ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి
-సచివాలయ ఉద్యోగిపై చేయిచేసుకున్న సురేష్
-ఆందోళన నిర్వహించిన సచివాలయ ఉద్యోగులు...
-అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపిన పోలీసులు..
- 6 Sep 2020 7:26 AM GMT
Antarvedi updates: అంతర్వేది ఆలయంలోకి చొచ్చుకుని వెళ్ళిన విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ సభ్యులు..
తూర్పుగోదావరి
-ఆలయ ఇవో కార్యాలయం ముట్టడి
-ఉద్రిక్తత మారిన వాతావరణం..
-ఆలయం వద్ద భారీగా పోలీసు బలగాలు తరలింపు
-ఇవో కార్యాలయంలోనే నిర్భంధం
-అంతర్వేది ఈవో నల్లం సూర్య చక్రధరరావు నిర్భంధం
- 6 Sep 2020 7:14 AM GMT
Antarvedi Temple updates: అంతర్వేది ఆలయంలోకి చొచ్చుకుని వెళ్ళిన విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ సభ్యులు..
తూర్పుగోదావరి
ఫాలోఆఫ్ అంతర్వేది..
-ఆలయ ఇవో కార్యాలయం ముట్టడి
-ఉద్రిక్తత మారిన వాతావరణం..
-ఆలయం వద్ద భారీగా పోలీసు బలగాలు తరలింపు
-ఇవో కార్యాలయంలోనే నిర్భంధం..
- 6 Sep 2020 7:09 AM GMT
Antervedi updates: దేవస్థానానికి సంబంధించిన సీసీ కెమరాలు పనిచేయక పోవడంతో పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న భక్తులు..
తూర్పుగోదావరి జిల్లా.... రాజోలు
-అంతర్వేది లక్ష్మి నరసింహ స్వామి రథం అగ్నికి ఆహుతి ఘటనపై దేవస్థానం వద్ద ఉద్రిక్త వాతావరణం
-ఈ నేపథ్యంలో ఆలయ ఈవో ను సస్పెండ్ చేయాలంటూ ఆందోళన చేపట్టిన ఆర్ ఎస్ ఎస్ సభ్యులు.
- 6 Sep 2020 7:00 AM GMT
Chhattisgarh Kidnap updates: మావోలు హతమార్చిన నలుగురు గ్రామస్తుల మృతదేహాలు అప్పగింత..
ఛత్తీస్ ఘడ్ లో మావోల చెరనుం డి విడుదలైన గ్రామస్తులు..
-16 మందిని క్షేమంగా విడుదల చేయడంతో ఊపిరి పీల్చుకున్న పోలీసులు
-అడవులలో రోడ్డు నిర్మాణం వంటి అభివృద్ధి కార్యకలాపాలను బలపరుస్తున్న కొందరు గ్రామస్థులను మూడు రోజుల క్రితం కిడ్నాప్ చేసిన మావోయిస్టులు
-గంగలూరు పోలీసు స్టేషన్ పరధిలోని దుమ్రి-పల్నర్ అటవీ ప్రాంతంలో డెడ్ బాడీస్ వదిలి వెళ్ళిన మావోయిస్టులు
-బస్తర్ రేంజ్ ఐజి సుందర్రాజ్ ఆధ్వర్యంలో బీజాపూర్ అడవుల్లో కొనసాగుతున్న కూంబింగ్
- 6 Sep 2020 6:54 AM GMT
Kurnool District updates: పాణ్యం మండలం మద్దూరు గ్రామం వద్ద గల కుందూ నదిలో యువకుడు గల్లంతు..
కర్నూలు....
-ప్రమాదవశాత్తూ గల్లంతు అయిన ప్రసాద్ కోసం గాలిస్తూన్న అధికారులు, గ్రామస్థులు
-బనగానపల్లె నుంచి మహానందికి వెళుతుండగా ప్రమాదం
-యువకుడు కుందూనదిలో గల్లంతు అవుతున్న దృశ్యాలను సెల్‌ఫోన్ లో రికార్డు చేసిన స్దానికులు.
- 6 Sep 2020 6:54 AM GMT
Kurnool District updates: పాణ్యం మండలం మద్దూరు గ్రామం వద్ద గల కుందూ నదిలో యువకుడు గల్లంతు..
కర్నూలు....
-ప్రమాదవశాత్తూ గల్లంతు అయిన ప్రసాద్ కోసం గాలిస్తూన్న అధికారులు, గ్రామస్థులు
-బనగానపల్లె నుంచి మహానందికి వెళుతుండగా ప్రమాదం
-యువకుడు కుందూనదిలో గల్లంతు అవుతున్న దృశ్యాలను సెల్‌ఫోన్ లో రికార్డు చేసిన స్దానికులు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire