Live Updates: ఈరోజు (సెప్టెంబర్-06) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు పంచాంగం
ఈరోజు ఆదివారం | 06 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | భాద్రపద మాసం | కృష్ణపక్షం | చవితి (సా.4-11వరకు) తదుపరి పంచమి | అశ్విని నక్షత్రం (తె.3-44 వరకు) తదుపరి భరణి | అమృత ఘడియలు: రా.7-45 నుంచి 9-31 వరకు | వర్జ్యం: రా.11-18 నుంచి 1-04 వరకు | దుర్ముహూర్తం: సా.4-29 నుంచి 5-18 వరకు | రాహుకాలం: సా.4-30 నుంచి 6-00 వరకు |సూర్యోదయం: ఉ.5-49 సూర్యాస్తమయం: సా.6-08
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 6 Sep 2020 5:45 AM GMT
Vijayawada updates: గన్నవరం మండలం కేసరపల్లి శివాలయం సమీపంలో ఓ ఇంట్లో చోరీ....
కృష్ణాజిల్లా....
-గన్నవరం మండలం కేసరపల్లి శివాలయం సమీపంలో ఓ ఇంట్లో చోరీ....
-టీవీ రిపేర్ చేస్తానంటూ వచ్చి అయినంపూడి పద్మ అనే మహిళ మెడలోని ఆరు కాసుల బంగారు గొలుసును దొంగిలించిన దుండగుడు.....
-కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న గన్నవరం క్రైమ్ పోలీసులు......
- 6 Sep 2020 5:43 AM GMT
Visakhapatnam updates: విశాఖ శిరోమండనం కేసులో నూతన నాయుడు ను అనకాపల్లి సబ్ జైలుకు తరలించిన పోలిసులు...
విశాఖ...
-ఎస్సీ అట్రాసీటీ కేసు తొ పాటు పలు సెక్షన్లు నమోదు చేసిన పోలిసులు.
-నూతన్ నాయుడు పై గతంలో మూడు పోలీస్ స్టేషన్లు లో కేసులు..
-వాటిపై కూడా ఆరా తీస్తున్న పోలిసులు..
- 6 Sep 2020 5:35 AM GMT
Antervedi updates: రధం ఆహుతి కావడంపై తక్షణం విచారణ జరపాలి:-స్వరూపానందేంద్ర..
అంతర్వేదిలో నర్శింహస్వామి ఉత్సవ రథం అగ్నికి ఆహుతి కావటంపై విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి ఖండన
అంతర్వేది ఘటన దురదృష్టకరం
-స్వరూపానందేంద్ర
-దుండగుల చర్యగా తేలితే కఠినంగా శిక్షించాలి
-హిందువుల మనోభావాలతో ముడిపడిన అంశమిది
-నర్శింహస్వామి రధోత్సవం లోపు నూతన రధ నిర్మాణం పూర్తయ్యేలా దేవాదాయ శాఖ పూనుకోవాలి
-స్వరూపానందేంద్ర..
- 6 Sep 2020 5:05 AM GMT
East Godavari updates: అంతర్వేది లో రథం అగ్నికి ఆహుతి అవ్వడం చాలా బాధాకరం..
తూర్పుగోదావరి..
-18 వ శతాబ్దం నుండి వంశపారంపర్య ధర్మకర్తగా మొగల్తూరు రాజవంశీయులే స్వామి రథోత్సవం ప్రారంభిస్తుంటారు
-62 ఏళ్ల క్రితం రథాన్ని పునర్నిర్మాణం చేసి 40 అడుగుల ఎత్తులో నిర్మిచారు
-అగ్నిప్రమాదం ఘటన కలచివేసింది, దర్యాప్తు చేయాలి
- రామ గోపాల రాజా బహద్దూర్, మొగల్తూరు రాజ వంశీయులు
- 6 Sep 2020 4:11 AM GMT
Visakhapatnam updates: పర్యాటక అభివృద్ధి కి రాష్ట్ర పర్యటక శాఖ ప్రత్యేక ప్రోత్సాహం -పర్యటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు...
విశాఖ....
-కోవిడ్ వలన నష్టపోయిన పర్యాటక రంగం పై ప్రత్యేక దృష్టి సారించిన ప్రభుత్వం..
-విశాఖ ను టూరిజం హబ్ గా మరింత ప్రగతిపథంలో నడిపేందుకు ప్రణాళికలు...
-నేటి నుండి విశాఖ లో తెరుచుకోనున్న కొన్ని పర్యాటక కేంద్రాలు.
- 6 Sep 2020 4:02 AM GMT
Srisailam Project updates: శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ప్రవాహం..
కర్నూలు జిల్లా.....
-1 క్రస్ట్ గేట్ ను 10 అడుగుల మేర ఎత్తి దిగువకు 28,075 క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేస్తున్న అధికారులు
-ప్రస్తుతనీటి మట్టం:885.00 అడుగులు
-పూర్తి స్థాయి నీటి మట్టం:885 అడుగులు
-ప్రస్తుత నీటి నిల్వ సామర్ధ్యం:215.8070 టీఎంసీలు
-పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్ధ్యం:215.8070 టీఎంసీలు
-ఇన్ ఫ్లో:53,304 క్యూసెక్కులు
-ఔట్ ఫ్లో: 96,994 క్యూసెక్కులు
-కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రం లో కొనసాగుతున్న పూర్తిస్థాయి విద్యుత్ ఉత్పత్తి.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire