Live Updates: ఈరోజు (సెప్టెంబర్-04) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 04 సెప్టెంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు శుక్రవారం, 04 సెప్టెంబర్, 2020: శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. భాద్రపద మాసం, కృష్ణపక్షం-విదియ (మ.12-17వరకు) తదుపరి తదియ, ఉత్తరాభాద్ర నక్షత్రం (రా.10-37 వరకు) తదుపరి రేవతి, అమృత ఘడియలు (సా.5-21 నుంచి 7-07 వరకు) వర్జ్యం (ఉ.6-51 నుంచి 8-36 వరకు) దుర్ముహూర్తం (ఉ.8-17 నుంచి 9-06 వరకు తిరిగి మ.12-24 నుంచి 1-13 వరకు) రాహుకాలం (ఉ.10-30 నుంచి 12-00 వరకు) సూర్యోదయం: ఉ.5-49 సూర్యాస్తమయం: సా.6-10
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 4 Sep 2020 12:55 PM GMT
East Godavari- pedhapuram updates: ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాల వల్లే ఆత్మహత్యలు..మాజీ మంత్రి చినరాజప్ప..
తూర్పుగోదావరి....
పెద్దాపురం....
-మాజీ ఉపముఖ్యమంత్రి పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప కామేంట్స్...
-వైసిపి ప్రభుత్వం అవలంభిస్తున్న రైతు వ్యతిరేక విధానాల వల్లే రైతు ఆత్మహత్యలు నానాటికీ పెరుగుతున్నాయి.
-వాటిని ప్రక్కకు పెట్టి రైతుల ఆత్మహత్యల పాపం తెలుగుదేశం పార్టీదేనని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అనడం హాస్యాస్పదంగా ఉంది.
-గత 15 నెలలుగా వైసిపి ప్రభుత్వం తప్పిదాల కారణంగానే అన్నదాత ల ఆత్మహత్యలు పెరిగాయి.
-వైకాపా ప్రభుత్వం 15 నెలల పాలనలో రైతులు రూ.50 వేల కోట్లు నష్టపోయారు.
-ఈ అనాలోచిత నిర్ణయంతో చిన్న, సన్నకారు, కౌలు రైతులు నష్టపోతారు.
- 4 Sep 2020 12:07 PM GMT
Vijayawada-Kanaka Durga updates: అక్టోబర్ 17 నుంచి ఇంద్రకీలాద్రి పై శ్రీ శార్వరి నామ సంవత్సర దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు..
విజయవాడ..
-9 రోజుల పాటు పది అలంకారాలలో దర్శనమివ్వనున్న దుర్గమ్మ
-అక్టోబర్ 17 వ తేదీన తొలిరోజు శ్రీ స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి గా దర్శనమివ్వనున్న దుర్గమ్మ
-18 న శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి గా...
-19న శ్రీ గాయత్రీ దేవిగా,
-20 న శ్రీ అన్నపూర్ణాదేవిగా ,
-21 మూలానక్షత్రం రోజున శ్రీ సరస్వతీ దేవిగా దర్శనమివ్వనున్న దుర్గమ్మ
22 న శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా,
-23 న శ్రీ మహాలక్ష్మీ దేవిగా, 24న శ్రీ దుర్గాదేవి, శ్రీ మహిషా సుర మర్ధనీ దేవిగా రెండు అలంకారాలలో దర్శనమివ్వనున్న దుర్గమ్మ
-25 న శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారం...అదే రోజు సాయంత్రం కృష్ణానదిలో శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల తెప్పోత్సవం
-కోవిడ్ దృష్ట్యా టైం స్లాట్ బుక్ చేసుకున్న వారికి మాత్రమే దసరా లో అమ్మవారి దర్శనానికి అనుమతించే అవకాశం
-గత ఏడాది దసరాలో రోజుకు లక్షపైనే అమ్మవారి దర్శనం చేసుకున్న భక్తులు
-ఈ ఏడాది కోవిడ్ దృష్ట్యా ఆంక్షలను మరింత కఠినతరం చేయనున్న దుర్గగుడి అధికారులు
- 4 Sep 2020 11:49 AM GMT
AP High Court updates: తహసీల్దార్ జారీ చేసిన నోటీసులపై నేడు హైకోర్టులో జరిగిన విచారణ..
అమరావతి...
-జడ్జి రామకృష్ణ ఇంటి ముందు రోడ్డుపై నడవొద్దంటూ తహసీల్దార్ జారీ చేసిన నోటీసులపై నేడు హైకోర్టులో జరిగిన విచారణ
-జడ్జి రామకృష్ణకు నోటీసుల అంశంపై సిబిఐ విచారణకు ఆదేశించాలని ధర్మాసనాన్ని కోరిన న్యాయవాది శ్రావణ్ కుమార్
-ఇప్పటికే జడ్జి రామకృష్ణకు తహసీల్దార్ జారీ చేసిన నోటీసులను తాత్కాలికంగా సస్పెండ్ చేసిన హైకోర్టు
-తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా
- 4 Sep 2020 11:42 AM GMT
Amaravati updates: కన్నబాబుకు బుల్లెట్ ప్రూఫ్ వాహనం కేటాయించిన ప్రభుత్వం..
అమరావతి..
-భద్రతా కారణాలతో వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబుకు బుల్లెట్ ప్రూఫ్ వాహనం కేటాయించిన ప్రభుత్వం
-ఇంటెలిజెన్స్ నివేదిక మేరకు కన్నబాబుకు బులెట్ ప్రూఫ్ వాహనం కేటాయించిన హోం శాఖ.
-10 రోజుల క్రితం మంత్రి కన్నబాబుకు బీపీ వాహనం కేటాయించాలన్న ఇంటెలిజెన్స్ వర్గాలు.
-బుల్లెట్ ప్రూఫ్ వాహనంలోనే ప్రయాణాలు, పర్యటనలు చేపట్టాలని మంత్రి కన్నబాబుకు ఇంటెలిజెన్స్ వర్గాల సూచన.
-ఇంటెలిజెన్స్ సూచనల మేరకు రెండు రోజులుగా బులెట్ ప్రూఫ్ వాహనంలోనే పర్యటిస్తోన్న మంత్రి కన్నబాబు.
- 4 Sep 2020 11:16 AM GMT
Guntur updates: అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి ని కలిసిన తిరుమల గార్డెన్స్ అపార్ట్ మెంట్ బాధితులు..
గుంటూరు ః...
-2016 లో డబ్బులు వసూలు చేసి నేటికి ఇవ్వని ప్లాట్ లు.
-ప్లాట్ లు గురించి అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నారని ఫిర్యాదు....
-ప్లాట్ లకు సంబందంలేని వ్యక్తులతో ఎస్సీ , ఎస్టీ కేసులు పెట్టి వేదిస్తున్నారు.
-స్దలం డెవలప్మెంట్ కు వచ్చిన వారిని సైతం బెదిరిస్తున్న బిల్డర్ లు.
-బిల్డర్ మంచికలపూడి శ్రీనివాసరావు , ఆలపాటి గోపాలకృష్ణ లపై చర్యలు తీసుకోవాలని విజ్ణప్తి...
- 4 Sep 2020 11:12 AM GMT
Rajamahendravaram updates: వైశ్య సేవా సాధన్ భూములు పేదలకు ఇళ్ల పట్టాలుగా ఇవ్వకుండా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు..
అమరావతి..
-రాజమహేంద్రవరం వైశ్య సేవా సాధన్ భూములు పేదలకు ఇళ్ల పట్టాలుగా ఇవ్వకుండా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
-సుమారు 32 ఎకరాలను ఇళ్ల పట్టలుగా ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టడంతో హైకోర్టులో పిటిషన్ దాఖలు
-విచారించిన హైకోర్టు... నేడు మధ్యంతర ఉత్తర్వులు జారీ
- 4 Sep 2020 10:41 AM GMT
Amaravati Updates: ట్విట్టర్ లో టిడిపి ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న..
అమరావతి:
-నా ప్రత్యక్ష దైవం టిడిపి అధినేత చంద్రబాబు గారు ఇచ్చిన దైర్యం, అభిమానుల ప్రార్థనలతో కరోనా నుండి త్వరగా కోలుకున్నాను.
-పదవులు శాశ్వతం కాదు. నాయకుడ్ని నమ్ముకొని ముందుకు వెళ్లడమే నా సిద్ధాంతం.
-కష్ట కాలంలో చంద్రబాబు గారు ఇచ్చిన మనోధైర్యం ఎన్నటికీ మరువను.
- 4 Sep 2020 10:37 AM GMT
Anantapur updates: మంత్రి శంకర్ నారాయణ ఇలాఖలో అసమ్మతి పోరు..
అనంతపురం:
-మంత్రి సోదరుడు మల్లికార్జునకు వ్యతిరేకంగా గోరంట్లలో అసమ్మతి నేతల ప్రత్యేక సమావేశం.
-గంపల రమనారెడ్డి, రామచంద్రారెడ్డి, గంగిరెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యులు, పలువురు ముఖ్య నేతలు హాజరు, సుమారు వంద మంది తో సమావేశం.
-నాలుగు రోజులుగా గోరంట్ల లో అసమ్మతి నేతల వరస సమావేశం.
-మల్లికార్జున అభివృధ్ధికి అడ్డూపడుతూ కమిషన్లు డిమాండ్ చేస్తున్నాడని ఆరోపణ.
-భూ కబ్జాలు, కమీషన్లకు అలవాటు పడి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు.
-పేదల భూములపై మల్లికార్జున కన్నేసాడు
-గోరంట్ల లో జరుగుతున్న అన్యాయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకుపోతాం.
-పెనుకొండ నియొజకవర్గం లో ఉన్న అసమ్మతి నేతలతో కలిసి త్వరలో పాదయాత్ర చేస్తాం: గంపల రమణారెడ్డి
- 4 Sep 2020 10:04 AM GMT
Amaravati updates: ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకొచ్చింది: కొడాలి నాని..
అమరావతి..
-కొడాలి నాని-పౌరసరఫరాల శాఖ మంత్రి
-రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వమని అడిగితే చంద్రబాబు రైతులను భాషిర్బాగ్ లో కాల్చి చంపారు.
-వైస్సార్ పాలన గుర్తు చేసెల సీఎం జగన్ పాలన కొనసాగిస్తున్నారు.
-రైతులకు భవిష్యత్ లో న్యాయం చేసేందుకు మెగా సోలార్ ప్రాజెక్టు చేపడుతున్నాం.
-చంద్రబాబు వ్యవసాయం చేశాడా రైతుల కష్టాలు తెలియడానికి ?
-అచ్చెన్నాయుడుని ఎవరు హింసించారు?
-అచ్చెన్నాయుడు రాసిన లేఖ ఆధారంగానే అధికారులు…
- 4 Sep 2020 9:56 AM GMT
Vijayawada updates: బెజవాడలోనూ సృష్టి ఆసుపత్రి లీలలు..
విజయవాడ..
-పోలీసుల విచారణలో వెలుగులోకి కీలక విషయాలు
-సృష్టి ఆసుపత్రి అధినేత డాక్టర్ నమ్రత లైసెన్సు 2018లోనే రద్దు చేసిన MCI
-వేరే వాళ్ళ లైసెన్స్ లతో బెజవాడలో సృష్టి ఆసుపత్రి నిర్వహిస్తున్నట్టు గుర్తించిన పోలీసులు
-DMHOలు పరిశీలన చేయకుండా రెగ్యులర్ మానిటరింగ్ లేకుండా రెన్యూవల్ చేస్తున్నట్టు గుర్తింపు
-ఆస్పత్రిపై మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా MCIకి రిపోర్ట్
-తెలంగాణ మెడికల్ కౌన్సిల్ 2018లో ఐదేళ్ల పాటు సృష్టికి లైసెన్స్ రద్దు
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire