Live Updates: ఈరోజు (సెప్టెంబర్-04) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు పంచాంగం
ఈరోజు శుక్రవారం, 04 సెప్టెంబర్, 2020: శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. భాద్రపద మాసం, కృష్ణపక్షం-విదియ (మ.12-17వరకు) తదుపరి తదియ, ఉత్తరాభాద్ర నక్షత్రం (రా.10-37 వరకు) తదుపరి రేవతి, అమృత ఘడియలు (సా.5-21 నుంచి 7-07 వరకు) వర్జ్యం (ఉ.6-51 నుంచి 8-36 వరకు) దుర్ముహూర్తం (ఉ.8-17 నుంచి 9-06 వరకు తిరిగి మ.12-24 నుంచి 1-13 వరకు) రాహుకాలం (ఉ.10-30 నుంచి 12-00 వరకు) సూర్యోదయం: ఉ.5-49 సూర్యాస్తమయం: సా.6-10
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 4 Sep 2020 8:03 AM GMT
Big Breaking: విజయవాడలో అన్ని కోవిడ్ సెంటర్ల లైసెన్సులు రద్దు!
బిగ్ బ్రేకింగ్..
విజయవాడ..
-బెజవాడ ప్రైవేట్ కోవిడ్ సెంటర్లలో భారీ కుదుపు
-బెజవాడలో ఉన్న అన్ని కోవిడ్ సెంటర్ల లైసెన్స్ రద్దు చేస్తూ ఆదేశాలు
-22 కోవిడ్ సెంటర్లలో 9 రద్దు చేసిన ప్రభుత్వం
-మిగతా 13 సెంటర్ల అనుమతి రద్దు చేసిన పాత DMHO
-4 రోజుల క్రితం (ఆగస్టు 31)న DMHOగా పదవీ విరమణ చేసిన డాక్టర్ రమేష్
-పదవీ విరమణ చేసే చివరి రోజున అన్ని కోవిడ్ సెంటర్ల అనుమతి రద్దు చేస్తూ ఆదేశాలు ఇచ్చిన DMHO
-అనుమతులు ఇచ్చిన ఆయనే ఆయనే రిటైర్మెంట్ రోజున రద్దు ఆదేశాలపై దుమారం
-కోవిడ్ సెంటర్ల అనుమతుల్లో లక్షలు చేతులు మారినట్లు ఇప్పటికే గుర్తించిన ప్రభుత్వం
-ఈ నేపథ్యంలో కొత్త ట్విస్ట్ ఇచ్చిన పాత DMHO
- 4 Sep 2020 7:04 AM GMT
Anantapur district updates: అనంతరావు మృతదేహాన్ని ప్రత్యేక అంబులెన్స్ లో తరలించిన అధికారులు.
అనంతపురం: హెచ్ఎంటీవీ ఎఫెక్ట్
-లేపాక్షి మండల కేంద్రంలోని దేవాలయం వీధిలో అనంతరావు మృతదేహాన్ని ప్రత్యేక అంబులెన్స్ లో తరలించిన అధికారులు.
-నిన్న రాత్రి ఇంటి ముందు మృతదేహం పడేసి వెళ్లిన సిబ్బంది.
-హెచ్ ఎంటివి వెలుగు లోకి తేవడంవతో ఘటనా స్థలానికి చేరుకున్న రెవెన్యూ అధికారులు.
-కోవిడ్ నిబంధనల మేరకు మృతదేహం తరలింపు
- 4 Sep 2020 6:33 AM GMT
Kurnool District updates: నంద్యాల మండలం పెద్ద కొట్టాల గ్రామంలో దారుణం..
కర్నూలు జిల్లా..
-ప్రియుడి పై ఆసిడ్ దాడి కి పాల్పడ్డ ప్రియురాలు
-కాలిపోయిన ప్రియుడు ముఖం, చేయి ..పరిస్థితి విషమం..
-మూడు సంవత్సరాలు గా ప్రేమించుకుంటున్న సుప్రియ, నాగేంద్ర..
-తనను కాదని వేరొకరితో వివాహం చేసుకుంటున్నాడని యాసిడ్ దాడి చేసి పరారీ..
-కులాలు వేరే అని 3 నెలల క్రితమే బ్రేకప్ అయిందంటున్న ప్రియుడు..
-డిగ్రీ పూర్తి చేసిన సుప్రియ..5th class చదివిన నాగేంద్ర..
-నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స....కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు
- 4 Sep 2020 6:11 AM GMT
Nellore district updates: నెల్లూరు జిల్లాలో మరో కిడ్నాప్ కలకలం..
నెల్లూరు జిల్లా..
-కొడవలూరు (మం) కొత్తవంగల్లులో
-మేకలు మేపుతున్న స్వర్ణ శ్రీనివాసులు కిడ్నాప్.
-మేకలు మేపుతున్న శ్రీనివాసులు ను నిన్న సాయింత్రం టాటా మ్యాజిక్ లో వచ్చి అపహరించుకు వెళ్ళిన దుండగులు.
-పోలీసుల కు ఫిర్యాదు చేసిన బాధితురాలు.
-గ్రామంలో ఓ యువతితో ప్రేమ వ్యవహారమే కిడ్నాప్ కి కారణం అంటున్న కుటుంబం సభ్యులు.
- 4 Sep 2020 3:34 AM GMT
Godavari floods: పోలవరంలో ఉదృతంగా గోదావరి
* కాపార్ డ్యాం వద్ద చేరిన వరద 23.28 మీటర్ల కి చేరిన వరద నీరు
* కొత్తూరు కాజు పై 12 అడుగులు చేరిన వరదనీరు
* 19 గిరిజన గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు
* గోదావరి వరద నుంచి ఇప్పుడిప్పుడే తెరుకుంటున్న ముంపు గ్రామాలు
* మరోసారి వరద పెరగడంతో భయాందోళనలో ముంపు గ్రామాల ప్రజలు.
- 4 Sep 2020 3:29 AM GMT
Godavari Floods: ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద వరద గోదావరి తగ్గుముఖం
- 8లక్షల 65వేల క్యూసెక్కుల ప్రవాహం సముద్రంలోకి విడుదల
- ధవలేశ్వరం వద్ద ప్రస్తుత నీటిమట్టం 10.8 అడుగులు
- మొదటివార్నింగ్ వరకూ వెళ్ళి నెమ్మదిగా తగ్గుతున్న వరద
- ఊపిరిపీల్చుకుంటున్న కోనసీమ లంకవాసులు..
- 4 Sep 2020 2:20 AM GMT
Anantapur updates: పాలిటెక్నిక్ విద్యార్థులకు పరీక్షలు
అనంతపురం:
- ఈ నెల 16 నుంచి పాలిటెక్నీక్ మూడో సంవత్సరం విద్యార్థుల కు పరీక్షలు
- ఉదయం9.30 గంటల నుంచి 12.30 వరకు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 వరకు బ్రాంచిల వారిగా రెండు విడతాలలో పరీక్షలు.
- వెల్లడించిన ప్రిన్సిపాల్ జయచంద్రరెడ్డి
- 4 Sep 2020 2:15 AM GMT
Srisailam Project Updates: శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద
- ప్రస్తుతనీటి మట్టం:885 అడుగులు
- పూర్తి స్థాయి నీటి మట్టం:885 అడుగులు
- ప్రస్తుత నీటి నిల్వ సామర్ధ్యం:215.8070 టీఎంసీలు
- పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్ధ్యం:215.8070 టీఎంసీలు
- ఇన్ ఫ్లో:55,232క్యూసెక్కులు
- ఔట్ ఫ్లో:37,750 క్యూసెక్కులు
- 4 Sep 2020 2:01 AM GMT
Weather updates: ఈరోజు వాతావరణం
- ఏపీలో ఈరోజు అక్కడక్కడా వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ వెల్లడించింది.
- దక్షిణ చత్తీస్ ఘడ్ మరియు దాని పరిసర ప్రాంతాలలో 3.1 km నుండి 4.5 km ఎత్తు మధ్య ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.
- దీని కారణంగా కోస్తా ఆంధ్ర, రాయలసీమ లో అక్కడ అక్కడ తేలికపాటి వర్షాలు
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire