HYDRA: హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఫోకస్

HYDRA: అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతోన్న హైడ్రా

Update: 2024-08-31 09:32 GMT

HYDRA: హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఫోకస్

HYDRA: హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా టీమ్ ఉక్కుపాదం మోపుతోంది. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్స్‌ పరిధిలో అక్రమ నిర్మాణాలపై కేసులు నమోదు చేసింది. ఇరిగేషన్ శాఖ ఇచ్చిన ఫిర్యాదులతో పోలీసులు FIR రిజిస్టర్ చేశారు. మదీనాగూడ ఎర్ల చెరువులో అక్రమ నిర్మాణాలు చేపట్టారని స్వర్ణలత, కృష్ణ కిషోర్‌లపై అధికారులు ఫిర్యాదు చేశారు. దీంతో మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు.

నిజాంపేట్ ఎర్రకుంటలో అక్రమ నిర్మాణాలు చేపట్టారంటూ మ్యాప్స్ ఇన్‌ఫ్రా ఎండీ సుధాకర్‌రెడ్డిపై ఇరిగేషన్ అధికారులు కంప్లయింట్ చేశారు. దీంతో ఆయనపై బాచుపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు రిజిస్టర్ చేశారు. అయితే వీరు చేపట్టిన నిర్మాణాలను ఇప్పటికే హైడ్రా అధికారులు కూల్చివేశారు.

Tags:    

Similar News