Harish Rao: హైడ్రా కూల్చివేతలపై హరీష్‌రావు కీలక వ్యాఖ్యలు

Harish Rao: హైదరాబాద్ బ్రాండ్‌ను దెబ్బ తీస్తున్నారు

Update: 2024-08-29 10:42 GMT

Harish Rao

Harish Rao: హైడ్రా కూల్చివేతలపై మాజీమంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్‌రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది కూలకొట్టుడు సర్కార్ అని, హైదరాబాద్ బ్రాండ్‌ను దెబ్బ తీస్తున్నారని మీడియాతో చేసిన చిట్ చాట్‌లో హరీష్‌ రావు విమర్శలు గుప్పించారు. హైడ్రా కార్యాలయం కూడా నాలాపైనే ఉందన్నారు.‌ హుస్సేన్ సాగర్ చుట్టూ ఉన్న నిర్మాణాలను కూడా కూల్చుతారా..? అని ప్రశ్నించారు. కవిత బెయిల్‌పై దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పునకు వక్రభాష్యం చెప్పడం సరికాదన్నారు హరీష్ రావు. ఓటుకు నోటు కేసులో టీడీపీ-బీజేపీ దోస్తాన్‌తోనే రేవంత్‌కు బెయిల్ వచ్చిందా.? అని గుర్తు చేశారు. రుణమాఫి చేయకుండా సీఎం ప్రజల్ని మోసం చేశారని ధ్వజమెత్తారు. సీఎం సొంత గ్రామం కొండారెడ్డి పల్లిలోనే మాఫీ పూర్తిగా కాలేదని హరీష్‌ రావు దుయ్యబట్టారు.

Tags:    

Similar News