ఈ తప్పు చేసి డబ్బులు పోగొట్టుకోవద్దు.. అలర్ట్‌గా ఉండకుంటే అంతే సంగతులు..!

Unknown Calls: టెక్నాలజీ పెరగడంతో పాటు అంతే మొత్తంలో ఆన్‌లైన్‌ స్కామ్‌లు కూడా పెరుగుతున్నాయి.

Update: 2023-10-29 04:30 GMT

ఈ తప్పు చేసి డబ్బులు పోగొట్టుకోవద్దు.. అలర్ట్‌గా ఉండకుంటే అంతే సంగతులు..

Unknown Calls: టెక్నాలజీ పెరగడంతో పాటు అంతే మొత్తంలో ఆన్‌లైన్‌ స్కామ్‌లు కూడా పెరుగుతున్నాయి. చాలామంది వీటి బారినపడి పెద్ద మొత్తంలో డబ్బులు పోగొట్టుకుంటున్నారు. పెరిగిన టెక్నాలజీ వల్ల ప్రజలకు అన్ని పనులు సులభంగా జరుగుతున్నాయి. కానీ సైబర్‌ నేరగాళ్లు మాత్రం ఈ టెక్నాలజీని వాడుకొని మోసాలకు పాల్పడుతున్నారు. అమాయక జనాలను టార్గెట్‌ చేసి పర్సనల్‌ విషయాలు తెలుసుకొని డబ్బులు కొట్టేస్తున్నారు.

ఫిషింగ్ ఈ మెయిల్‌ల నుంచి నకిలీ ఉద్యోగ ఆఫర్‌లు, క్రిప్టోకరెన్సీ స్కామ్‌ల వరకు ఆన్‌లైన్ మోసాలు ప్రతిరోజు ఎక్కడో ఒకచోట జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల మహారాష్ట్రలోని థానే పట్టణానికి చెందిన ఓ మహిళ ఫేక్‌ కాల్స్‌ బారిన పడి రూ. 5.24 లక్షలు కోల్పోయింది. బ్యాంక్ ఉద్యోగిగా చెప్పుకొని ఒక వ్యక్తి ఆమెతో ఒక యాప్‌ డౌన్‌లోడ్‌ చేయించి పర్సనల్‌ వివరాలు దొంగిలించి డబ్బు దోచేశాడు.

విషయం ఇది..

థానేకు చెందిన 24 ఏళ్ల మహిళకు ముందుగా తెలియని నంబర్ నుంచి కాల్ వచ్చింది. అవతలి వ్యక్తి ప్రముఖ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నట్లు చెప్పాడు. తాను బ్యాంక్ క్రెడిట్ కార్డ్ విభాగంలో భాగమని ఆరోగ్య బీమా చెల్లింపు బకాయి ఉందని తెలిపాడు. తర్వాత మహిళ అది ఎలా చెల్లించాలో చెప్పమని అడిగింది. దానికి అతను షేర్ చేసిన APK ఫైల్ ద్వారా యాప్‌ను డౌన్‌లోడ్ చేయమని అడిగాడు. సదరు మహిళ ఫైల్ డౌన్‌లోడ్ చేయగానే ఆమె ఖాతా నుంచి రూ.5.24 లక్షలు డ్రా అయినట్లు మెసేజ్ వచ్చింది.

ఇటువంటి మోసాల నుంచి సురక్షితంగా ఉండాలంటే ప్రజలు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. మొదటిది తెలియని ఈ మెయిల్‌లు, ఫోన్ కాల్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వ్యక్తిగత సమాచారం లేదా ఆర్థిక వివరాలను అడిగుతున్నట్లయితే కాల్ కట్‌ చేసి పోలీసులకు సమాచారం అందించాలి. లేదంటే నంబర్‌ను బ్లాక్ చేయడం ఉత్తమం. స్కామర్లు యాప్స్‌ ద్వారా వ్యక్తిగత సమాచారాన్ని పొందుతున్నారని పోలీసులు తెలిపారు.

Tags:    

Similar News