Fridge Temperature: వర్షాకాలం ఫ్రిజ్‌ టెంపరేచర్‌ ఎంత ఉండాలి.. తేడా వస్తే పదార్థాలు పాడైపోయినట్లే..!

Fridge Temperature: సీజన్స్‌ని బట్టి ఫ్రిడ్జి టెంపరేచర్‌ని మెయింటెన్‌ చేయాలి. లేదంటే ఆహార పదార్థాలు పాడైపోతాయి.

Update: 2023-08-12 16:00 GMT

Fridge Temperature: వర్షాకాలం ఫ్రిజ్‌ టెంపరేచర్‌ ఎంత ఉండాలి.. తేడా వస్తే పదార్థాలు పాడైపోయినట్లే..!

Fridge Temperature: సీజన్స్‌ని బట్టి ఫ్రిడ్జి టెంపరేచర్‌ని మెయింటెన్‌ చేయాలి. లేదంటే ఆహార పదార్థాలు పాడైపోతాయి. వాస్తవానికి ఫ్రిజ్‌లో పెట్టిన ఐటమ్స్‌ ఎక్కువ కాలం తాజాగా ఉండాలంటే ఫ్రిజ్‌ టెంపరేచర్‌ సెట్టింగ్‌ చేయడం అవసరం. వేసవిలో అధిక వేడి ఆహార పదార్థాలను పాడు చేస్తుంది. వర్షాకాలం తేమతో కూడిన వాతావరణం వల్ల ఆహార పదార్థాలు పాడవుతాయి. శీతాకాలంలో చల్లదనం వల్ల ఆహార పదార్థాలు భిన్న ప్రభావాలకి గురవుతాయి. వీటి నుంచి ఆహార పదార్థాలను రక్షించడానికి తాజాగా ఉంచడానికి టెంపరేచర్‌ సెట్టింగ్ చాలా ముఖ్యం.

వర్షాకాలం ప్రభావం

వర్షాకాలంలో తేమ కారణంగా ఆహార పదార్థాలు పాడైపోయే అవకాశం ఉంది. అధిక తేమ ఆహార పదార్థాల నాణ్యతను దెబ్బతీస్తుంది. ఇవి కాకుండా వర్షాకాలంలో జెర్మ్స్, పరాన్నజీవుల అభివృద్ధి కూడా గరిష్టంగా ఉంటుంది. అంతే కాదు వర్షాకాలంలో ఆహార పదార్థాలను క్రమపద్ధతిలో స్టోర్‌ చేయకపోతే చాలా నష్టం జరుగుతుంది. తాజాదనం, రుచిలో తేడాలు వస్తాయి. ఆహార పదార్థాల్లో పోషక విలువల నాణ్యత తగ్గిపోతుంది.

వర్షాకాలంలో ఫ్రిజ్ ఉష్ణోగ్రత

వర్షాకాలంలో ఫ్రిడ్జి టెంపరేచర్ నియంత్రించడం చాలా ముఖ్యం. తద్వారా ఆహార పదార్థాలు సురక్షితంగా ఉంటాయి. వాటి నాణ్యత దెబ్బతినకుండా ఉంటుంది. వర్షాకాలంలో ఫ్రిజ్ ఉష్ణోగ్రతను చల్లగా ఉంచాలి. సాధారణంగా రిఫ్రిజిరేటర్ ఉష్ణోగ్రత 0°C (32°F) లేదా కొంచెం తక్కువగా ఉండటం మంచిది. ఇది ఆహారాన్ని తాజాగా ఉంచడానికి సహాయపడుతుంది. ఆహారం చెడిపోకుండా ఉంటుంది. ఆరోగ్యానికి ఎటువంటి ప్రమాదం ఉండదు.

Tags:    

Similar News