LCD vs LED: ఎల్‌సిడీ, ఎల్‌ఈడీల మధ్య తేడాలు ఇవే..!

LCD vs LED: వినోదానికి అతిపెద్ద సాధనం టీవీ. ఇప్పుడు మార్కెట్లో రకరకాల టీవీలు అందుబాటులో ఉన్నాయి.

Update: 2022-09-27 06:47 GMT

LCD vs LED: ఎల్‌సిడీ, ఎల్‌ఈడీల మధ్య తేడాలు ఇవే..!

LCD vs LED: వినోదానికి అతిపెద్ద సాధనం టీవీ. ఇప్పుడు మార్కెట్లో రకరకాల టీవీలు అందుబాటులో ఉన్నాయి. ఎల్‌సిడి టీవీలు, ఎల్‌ఈడీ టీవీలు ఎక్కువగా కోరుకునే వస్తువులు. గతంలో సాధారణ టీవీలు మార్కెట్లో అందుబాటులో ఉండేవి. ఆ తరువాత ఎల్‌సిడి టీవీలు, ఎల్‌ఈడీ టీవీలు, స్మార్ట్ టీవీలను మార్కెట్‌లో ప్రవేశపెట్టారు. మార్కెట్లో మొదటిది సాధారణ టీవీ. కానీ ఈ టీవీ చాలా భారీ పరిమాణంలో ఉండేది. అలాగే ఇది చాలా విద్యుత్తును వినియోగిస్తోంది.

చాలా నవీకరణల తర్వాత LCD (లిక్విడ్-క్రిస్టల్ డిస్ప్లే) టీవీలను మార్కెట్లో ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి ఈ ఎల్‌సిడి టివిలకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. దీని తరువాత మరిన్ని నవీకరణలు మొదలయ్యాయి. తర్వాత ఎల్‌ఈడీ టీవీలను మార్కెట్‌లో ప్రవేశపెట్టారు. ఇప్పుడు ఎల్‌ఈడీ (లైట్-ఎమిటింగ్ డయోడ్) టీవీలకు మార్కెట్లో అధిక డిమాండ్ ఉంది. అయితే ఎల్‌సీడీ, ఎల్‌ఈడీ టీవీల మధ్య తేడా ఏంటో చూద్దాం.

ఎల్‌సిడి టివి స్క్రీన్‌లు 1 అంగుళాల వరకు మందంగా ఉండగా, ఎల్‌ఇడి టివి స్క్రీన్లు 1 అంగుళాల కన్నా తక్కువ మందంగా ఉంటాయి. ఎల్‌సిడి టీవీలు ఎక్కువ శక్తిని వినియోగిస్తుండగా, ఎల్‌ఈడీ టీవీలు తక్కువ శక్తిని వినియోగిస్తాయి. ఎల్‌సిడీ టీవీలు ఎల్‌ఈడీ టీవీల కన్నా కొంచెం చౌకగా ఉండగా, ఎల్‌ఈడీ టీవీలు కాస్త ఖరీదైనవి. ఎల్‌ఈడీ టీవీలు ఎల్‌సీడీల కంటే ప్రకాశవంతంగా ఉంటాయి.

ఎల్‌ఈడీ టీవీలు ఎక్కువ రంగులు కలిగి ఉంటాయి. ఎల్‌సిడి టీవీలను 165 డిగ్రీల వరకు కోణాల్లో చూడవచ్చు. అంటే ఎల్‌సిడి టివి స్క్రీన్‌పై ఉన్న చిత్రాలు ఇంటి అన్ని మూలల్లోనూ స్పష్టంగా కనిపించవు. టివి ముందు ఒక నిర్దిష్ట స్థలంలో కూర్చుంటే మాత్రమే కనిపిస్తుంది. ఎల్‌ఈడీ టీవీలు 180 డిగ్రీల వీక్షణలను అందిస్తున్నాయి. కనుక మీరు ఇంటి ఏ మూలన కూర్చున్న టీవీ తెరపై చిత్రాన్ని స్పష్టంగా చూడవచ్చు.

Tags:    

Similar News