Battery: ఫోన్‌ బ్యాటరీలో mAh అంటే ఏంటో తెలుసా.? దీన్ని ఎలా లెక్కిస్తారంటే..!

Battery: స్మార్ట్‌ఫోన్‌.. ప్రస్తుతం మనిషి జీవితంలో ఒక నిత్యవసర వస్తువుగా మారిపోయింది. ఉదయం నిద్రలేచింది మొదలు రాత్రి పడుకునే వరకు స్మార్ట్ ఫోన్‌ లేకపోతే రోజు గడవని పరిస్థితి వచ్చింది.

Update: 2024-06-08 02:30 GMT

Battery: ఫోన్‌ బ్యాటరీలో mAh అంటే ఏంటో తెలుసా.? దీన్ని ఎలా లెక్కిస్తారంటే..!

Battery: స్మార్ట్‌ఫోన్‌.. ప్రస్తుతం మనిషి జీవితంలో ఒక నిత్యవసర వస్తువుగా మారిపోయింది. ఉదయం నిద్రలేచింది మొదలు రాత్రి పడుకునే వరకు స్మార్ట్ ఫోన్‌ లేకపోతే రోజు గడవని పరిస్థితి వచ్చింది. మరీ ముఖ్యంగా స్మార్ట్‌ ఫోన్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇది మరింత ఎక్కువైపోయింది.

ప్రతీ చిన్న పనికి స్మార్ట్ ఫోన్‌ ఉండాల్సిందే. ఇక సాధారణంగా స్మార్ట్ ఫోన్‌ కొనుగోలు చేసే ముందు మనలో చాలా మంది తొలుత కెమెరా క్లారిటీ గురించి చూస్తే.. ఆ తర్వాత బ్యాటరీ గురించి ఆలోచిస్తారు. బ్యాటరీ కెపాసిటీ ఆధారంగా స్మార్ట్ ఫోన్‌ కొనుగోలు చేసే వారు చాలా మంది ఉంటారు. ఇంటర్నెట్ వినియోగం పెరగడం, గేమింగ్, వీడియో స్ట్రీమింగ్ వంటి వాటితో ఛార్జింగ్‌ ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. దీంతో ఎక్కువ పవర్‌ ఉన్న బ్యాటరీని కొనుగోలు చేయడానికి మొగ్గు చూపుతున్నారు.

ఇక బ్యాటరీ అనగానే మనకు గుర్తొచ్చేది ఎమ్‌ఏహెచ్‌. బ్యాటరీలో ఉండే ఈ ఎమ్‌ఏహెచ్‌ అంటే ఏంటి.? అసలు దీనిని ఎలా లెక్కిస్తారు ఇప్పుడు తెలుసుకుందాం. ఎమ్‌ఏహెచ్‌ ఫుల్‌ ఫామ్‌ విషయానికొస్తే 'మిల్లీ అంపియర్‌ హవర్‌'గా పిలుస్తారు. ఇందులో మిల్లీ సైజ్‌ను సూచిస్తుంది, అంపియర్‌ విద్యుత్‌ను సూచించే యూనిట్‌, ఇక చివరిది హవర్‌ అంటే సమయాన్ని సూచిస్తుంది. ఒక్క అంపియర్‌లో 1000 మిల్లీ అంపిరయర్‌లు ఉంటాయి.

ఉదాహరణకు మీ ఫోన్‌ బ్యాటరీ సామర్థ్యం 4000 ఎమ్‌ఏహెచ్‌ అనుకుందాం అంటే.. మీ ఫోన్‌ బ్యాటరీ ఒక గంటలో 4000 మిల్లీ అంపియర్స్‌ పవర్‌ను అందిస్తుంది. అయితే మీ ఫోన్‌ ఎంత బ్యాటరీని వినియోగిస్తుంది అనేది మీరు ఫోన్‌ వాడే విధానంపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు మీరు గంటకు 400 ఎమ్‌ఏహెచ్‌ను ఖర్చు చేస్తే మీ బ్యాటరీ బ్యాకప్‌ 10 గంటలు వస్తుందని అర్థం. ఇదండి మనం ఉపయోగించే స్మార్ట్‌ ఫోన్‌లోని బ్యాటరీ వెనకాల ఉన్న అసలు కథ. ఎంత ఎక్కువ కెపాసిటీ ఉన్న బ్యాటరీ అంత ఎక్కువ సేపు ఛార్జింగ్‌ ఇస్తుంది.

Tags:    

Similar News