Vivo Y58 5G: కళ్లు చెదిరే ఫీచర్లతో వివో బడ్జెట్‌ ఫోన్‌.. ధర ఎంతో తెలుసా.?

Vivo Y58 5G: ప్రస్తుతం దేశంలో 5జీ సేవలు విస్తరిస్తున్నాయి. చిన్న చిన్న పట్టణాల్లో కూడా 5జీ సేవలు అందుబాటులోకి వస్తున్నాయి.

Update: 2024-06-21 10:30 GMT

Vivo Y58 5G: కళ్లు చెదిరే ఫీచర్లతో వివో బడ్జెట్‌ ఫోన్‌.. ధర ఎంతో తెలుసా.?

Vivo Y58 5G: ప్రస్తుతం దేశంలో 5జీ సేవలు విస్తరిస్తున్నాయి. చిన్న చిన్న పట్టణాల్లో కూడా 5జీ సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. దీంతో స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థలు సైతం 5జీ ఫోన్‌లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. కంపెనీల మధ్య నెలకొన్న పోటీ నేపథ్యంలో 5జీ ఫోన్‌ల ధరలు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం వివో భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఇంతకీ ఏంటా ఫోన్‌.? ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు మీకోసం.

చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం వివో భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. వివో వై58 పేరుతో 5జీ ఫోన్‌ను తీసుకొచ్చింది. తక్కువ బడ్జెట్‌లో మంచి ఫీచర్లతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. వివో వై58 స్మార్ట్‌ ఫోన్‌ను హిమాలయన్‌ బ్లూ, సుందర్బన్స్‌ గ్రీన్‌ కలర్స్‌లో లాంచ్‌ చేశారు. ఫీచర్ల విషయానికొస్తే ఈ ఫోన్‌ 6.72 ఇంచెస్‌తో కూడిన ఎల్‌సీడీ స్క్రీన్‌ను అందించారు. 120Hz రీఫ్రెష్‌ రేట్‌ ఈ స్క్రీన్ సొంతం. ఇక ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.

ఇందులో ఆక్టాకోర్‌ స్నాప్‌డ్రాగన్‌ 4 జెన్‌ 2 ప్రాసెసర్‌ను అందించారు. 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ను అందించారు. ర్యామ్‌ను వర్చువల్‌గా 8 జీబీ వరకు, స్టోరేజ్‌ కెపాసిటీని 1 టీబీ వరకు పెంచుకోవచ్చు. ఇక ఇందులో 44 వాట్స్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 6000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు. కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అదించారు. అలాగే సెల్ఫీలు వీడియో కాల్స్‌ కోసం 8 ఎంపీతో కూడిన ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు.

కనెక్టివిటీ విషయానికొస్తే ఇందులో వైఫై, బ్లూటూత్‌ 5, యూఎస్‌బీ టైప్‌ సి వంటి ఫీచర్లను అందించారు. ఇక ఈ ఫోన్ ధర గురించి చూస్తే.. రూ. 19,499గా నిర్ణయించారు. యెస్ బ్యాంక్‌, ఎస్‌బీఐ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌, ఇండస్‌ఇండ్ వంటి బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే రూ. 1500 వరకు ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్‌ లభించనుంది. అంతేకాదండోయ్‌ రోజుకు కేవలం రూ. 35 చెల్లించి కూడా ఈఎమ్‌ఐ విధానంలో ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. 

Tags:    

Similar News