Vande Bharat Sleeper: ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. తొలి వందే భారత్ స్లీపర్ వచ్చేస్తోంది.. రూట్ ఇదే?

India's 1st Vande Bharat Sleeper Train: ఈ ఏడాది చివరి నాటికి తొలి వందే భారత్ స్లీపర్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్) జనరల్ మేనేజర్ యు సుబ్బారావు తెలిపారు.

Update: 2024-08-25 09:32 GMT

Bande Bharat Sleeper: ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. తొలి వందే భారత్ స్లీపర్ వచ్చేస్తోంది.. రూట్ ఇదే?

Vande Bharat Sleeper Train: వందే భారత్ స్లీపర్ కోసం నిరీక్షణకు త్వరలో తెరపడనుంది. దేశంలోనే తొలి వందే భారత్ స్లీపర్ రైలు ఈ ఏడాది చివరి నాటికి అందుబాటులోకి రానుంది. మొదటి వందే భారత్ స్లీపర్ రైలు భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (BEML) బెంగళూరు ప్లాంట్ నుంచి సెప్టెంబర్ 20 నాటికి చెన్నైకి బయలుదేరుతుందని భావిస్తున్నారు. దీని ఫైనల్ టెస్ట్ చెన్నైలో జరగనుంది. దీనికి 15-20 రోజులు పడుతుంది.

మనీ కంట్రోల్ నివేదిక ప్రకారం, వందే భారత్ స్లీపర్ రైలు, వందే భారత్ సిరీస్ మూడవ వెర్షన్. గుజరాత్‌లో మొదటిసారిగా నడపాలని భావిస్తున్నారు. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసిఎఫ్) జనరల్ మేనేజర్ యు సుబ్బారావు మాట్లాడుతూ, ఫైనల్ టెస్ట్ తర్వాత, వందే భారత్ స్లీపర్ మెయిన్‌లైన్ గుండా వెళుతుందని, ఇది లక్నో పర్యవేక్షణలో ఒకటి లేదా రెండు నెలల పాటు కొనసాగుతుందని చెప్పారు. రైలు హై-స్పీడ్ టెస్టింగ్ కోసం నార్త్ వెస్ట్రన్ రైల్వే జోన్‌లో ట్రయల్ రన్ నిర్వహించే అవకాశం ఉంది.

ఈ రైలులో లగ్జరీ సౌకర్యాలు..

16 కోచ్‌లు కలిగిన వందే భారత్ స్లీపర్ రైలులో 823 బెర్త్‌లు ఉంటాయి. ఇందులో 11 3AC కోచ్‌లు (611 బెర్త్‌లు), 4 2AC కోచ్‌లు (188 బెర్త్‌లు), 1 1AC కోచ్ (24 బెర్త్‌లు) ఉన్నాయి. యూరప్‌లోని నైట్‌జెట్ స్లీపర్ రైళ్ల తరహాలో వందే భారత్ స్లీపర్ రైలును నిర్మిస్తున్నారు. ఈ రైలులో, రాత్రిపూట లైట్లు స్విచ్ ఆఫ్ చేస్తే, టాయిలెట్‌కు వెళ్లే ప్రయాణికుల కోసం నేలపై LED స్ట్రిప్స్ వెలుగుతాయి. ఇది కాకుండా, రైలు అటెండెంట్ కోసం ప్రత్యేక బెర్త్ కూడా ఉంటుంది.

మొదటి వందే భారత్ స్లీపర్ రైలును BEML, హైదరాబాద్‌కు చెందిన మేధా సర్వో డ్రైవ్స్ లిమిటెడ్ అభివృద్ధి చేశాయి. పోలాండ్-ఆధారిత యూరోపియన్ రైలు సలహాదారు EC ఇంజనీరింగ్ నుంచి డిజైన్ ఇన్‌పుట్‌లు ఇందులో ఉన్నాయి. ప్రతి స్లీపర్ బెర్త్‌లో రీడింగ్ లైట్, ఛార్జింగ్ సాకెట్, మొబైల్/మ్యాగజైన్ హోల్డర్, స్నాక్ టేబుల్ ఉంటాయి.

Tags:    

Similar News