SIM Card New Rules: సిమ్‌కార్డ్‌ కొత్త రూల్‌.. ఇక ప్రతిదానికి లెక్క తప్పదు..!

Sim Card New Rules: ఈ రోజుల్లో సిమ్‌ క్లోనింగ్ ద్వారా చాలా మోసాలు జరుగుతున్నాయి.

Update: 2023-08-16 15:30 GMT

Sim Card New Rules: సిమ్‌కార్డ్‌ కొత్త రూల్‌.. ఇక ప్రతిదానికి లెక్క తప్పదు..!

Sim Card New Rules: ఈ రోజుల్లో సిమ్‌ క్లోనింగ్ ద్వారా చాలా మోసాలు జరుగుతున్నాయి. కొంతమంది ఒక ముఠాగా ఏర్పడి ఫేక్‌ ఐడీలు సృష్టించి సిమ్‌లు కొనుగోలు చేసి వాటి ద్వారా మోసాలకి పాల్పడుతున్నారు. అందుకే ప్రభుత్వం సిమ్ కార్డుల సంఖ్యను పరిమితం చేయాలని యోచిస్తోంది. ఇప్పటి వరకు ఒక ఐడీపై 9 సిమ్ కార్డులు తీసుకునేవారు. కానీ కొత్తగ వచ్చే నిబంధనలతో ఒక ఐడీలో 4 మాత్రమే తీసుకోవచ్చు. ఆన్‌లైన్ మోసాలను నిరోధించడానికి ప్రభుత్వం ఈ పనిచేయాలని ప్రయత్నిస్తుంది.

టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్ ఒక ఐడిపై నాలుగు సిమ్ కార్డుల మార్గదర్శకాలను త్వరలో విడుదల చేయనున్నారు. ఇది కాకుండా కస్టమర్ వెరిఫికేషన్ ప్రక్రియను కూడా పూర్తిగా డిజిటలైజ్ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇది మోసాలను అరికట్టడంలో సహాయపడుతుంది. అలాగే ప్రభుత్వం ఒక కొత్త సదుపాయాన్ని ప్రారంభించింది. దీని ద్వారా మీ IDలో ఎన్ని సిమ్ కార్డ్‌లు జారీ చేయవచ్చో మీరు తెలుసుకోవచ్చు. ఈ సమాచారం సంచార్ సాథీ పోర్టల్‌లో అందుబాటులో ఉంటుంది.

మీ నంబర్‌పై మోసపూరిత సిమ్ జారీ అయితే సంచార్ సాథీ పోర్టల్‌కి వెళ్లి దాన్ని కనుగొని బ్లాక్ చేయవచ్చు. ఆన్‌లైన్ మోసాల నుంచి ప్రజలను రక్షించడానికి ఈ పోర్టల్‌ ప్రారంభించారు. ప్రజలు తమ పేరు మీద ఎన్ని సిమ్ కార్డ్‌లు జారీ అయ్యాయో తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. అవాంఛిత కాల్‌లు, మోసపూరిత కాలింగ్‌లను ఆపడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. AI ఫిల్టర్‌లను సెటప్ చేస్తుంది. ఇవి తెలియని కాల్‌లు, మెస్సేజ్‌లని గుర్తించి బ్లాక్ చేస్తాయి. ఇది మోసపూరిత కాలింగ్‌ల నుంచి ప్రజలను రక్షించడంలో సహాయపడుతుంది. ఈ చర్యల వల్ల ఫ్రాడ్ కాలింగ్‌లు తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తోంది.

Tags:    

Similar News