ట్యాప్‌లో అమర్చే వాటర్ హీటర్.. అతి తక్కువ ధరలో వేడినీరు..!
Electric Water Heater: రోజురోజుకు చలి పెరుగుతోంది.
Electric Water Heater: రోజురోజుకు చలి పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో చల్లటి నీటిని వినియోగించాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఇంటి పనులు చేయాలన్నా, ఆఫీసు నుంచి ఇంటికి వచ్చిన తర్వాత చేతులు, ముఖం కడుక్కోవాలన్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయితే ఈ రోజు మినీ వాటర్ హీటర్ గురించి తెలుసుకుందాం. దీనిని మీ ఇంటిలోని ఏ ట్యాప్‌లోనైనా అమర్చవచ్చు. ఈ హీటర్ చిటికెలో నీటిని వేడి చేస్తుంది. ఖరీదు కూడా చాలా తక్కువే.
ఈ వాటర్ హీటర్ ఎలా పనిచేస్తుంది..?
దీనిపేరు MR వరల్డ్‌షాప్ డిజిటల్ ఇన్‌స్టంట్ ఎలక్ట్రిక్ వాటర్ హీటర్. ఇది చిటికెలో నీటిని వేడి చేస్తుంది. గీజర్‌తో పోలిస్తే చాలా తక్కువ సమయం పడుతుంది. ఈ హీటర్ ట్యాప్‌లోనే అమర్చబడి ఉంటుంది. తద్వారా నీరు ట్యాప్ గుండా వచ్చినప్పుడు వేడిగా వస్తాయి. మీరు ఈ హీటర్‌ను వంటగదిలో ఉపయోగించవచ్చు. ఇది గీజర్ కంటే తక్కువ విద్యుత్తును వినియోగిస్తుంది.
ఈ వాటర్ హీటర్ ఫీచర్స్
ఈ మినీ వాటర్ హీటర్‌ను ఎటువంటి ఇబ్బంది లేకుండా అతి తక్కువ సమయంలో అమర్చవచ్చు. ట్యాప్‌లో ఇన్‌స్టాల్ చేసిన ఈ హీటర్‌ని స్టెయిన్‌లెస్ స్టీల్‌తో తయారు చేశారు. ఎలక్ట్రిక్ కార్డ్ సహాయంతో ఆపరేట్ చేయవచ్చు. ఈ వాటర్ హీటర్ లో ఉన్న మరో ప్రత్యేకత ఇందులో డిస్ ప్లే ఇచ్చారు. ఈ స్టైలిష్ వాటర్ హీటర్‌లో మీరు నీటి ఉష్ణోగ్రతను చెక్ చేయవచ్చు. ఈ వాటర్ హీటర్ ధర రూ.3,999 అయినప్పటికీ అమెజాన్ నుంచి 55% భారీ తగ్గింపు ఉంది. దీన్ని కేవలం రూ.1,797కే ఇంటికి తీసుకెళ్లవచ్చు.