Smart Watch: అదిరే ఫీచర్లు.. సరసమైన ధర.. సరికొత్త బ్లూటూత్ కాలింగ్ వాచ్‌..!

Smart Watch: ఈ రోజుల్లో స్మార్ట్‌వాచ్‌ ట్రెండ్‌ విపరీతంగా పెరిగిపోయింది.

Update: 2023-05-20 09:29 GMT

Smart Watch: అదిరే ఫీచర్లు.. సరసమైన ధర.. సరికొత్త బ్లూటూత్ కాలింగ్ వాచ్‌..!

Smart Watch: ఈ రోజుల్లో స్మార్ట్‌వాచ్‌ ట్రెండ్‌ విపరీతంగా పెరిగిపోయింది. అయితే చాలామంది తక్కువ ధరలో బ్లూటూత్ కాలింగ్ వాచ్‌ను కోరుకుంటున్నారు. ఇలాంటి డిమాండ్‌ని గ్రహించి పలు కంపెనీలు సరికొత్త స్మార్ట్‌ వాచ్‌లని తయారుచేస్తున్నాయి. తాజాగా నాయిస్‌ బ్రాండ్‌ నాయిస్ కలర్ ఫిట్ క్యూబ్ 2ను విడుదల చేసింది. ఇందులో ఆరోగ్యం, ఫిట్‌నెస్‌ కాకుండా ఇంకా చాలా ఫీచర్లు ఉన్నాయి. ధర కూడా తక్కువగానే ఉంది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

మీ బడ్జెట్ రూ. 1500 వరకు ఉంటే ఈ వాచ్‌ని సులువుగా కొనుగోలు చేయవచ్చు. దీనికోసం రూ. 1 వేల 599 వెచ్చించాల్సి ఉంటుంది. కంపెనీ అధికారిక సైట్ కాకుండా ఫ్లిప్‌కార్ట్ నుంచి ఈ వాచ్‌ని కొనుగోలు చేయవచ్చు. ఈ వాచ్‌ ఐదు రంగులలో లభిస్తుంది. జెట్ బ్లాక్, రాయల్ బ్లూ, రోజ్ పింక్, డీప్ వైన్, సిల్వర్ గ్రే రంగులలో అందుబాటులో ఉంది. ఈ వాచ్‌లో 1.96-అంగుళాల TFT డిస్‌ప్లే ఉంటుంది. ఇది 450 నిట్స్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన ఈ వాచ్‌లో డయల్ ప్యాడ్, ఇటీవలి కాల్‌లు, ఎనిమిది మంది వ్యక్తుల కాంటాక్ట్ నంబర్‌లను సేవ్ చేసే సదుపాయాన్ని పొందుతారు.

కనెక్టివిటీ కోసం ఈ తాజా వాచ్‌లో బ్లూటూత్ వెర్షన్ 5.1 ఉంటుంది. 100 కంటే ఎక్కువ మోడ్‌లు, 220 కంటే ఎక్కువ క్లౌడ్-ఆధారిత వాచ్ ఫేస్‌లు అందుబాటులో ఉంటాయి. ఈ వాచ్ నీరు, ధూళి నిరోధకత కోసం IP67 రేటింగ్‌ను కలిగి ఉంది. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే ఏడు రోజుల పాటు సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ కాలింగ్‌తో కూడిన ఈ వాచ్‌లో మీరు ఇన్‌బిల్ట్ మైక్, స్పీకర్ సౌకర్యాన్ని పొందుతారు. అంతేకాకుండా ఇందులో బిల్ట్ గేమ్‌లు కూడా అందించారు. ఇతర ఫీచర్‌ల గురించి మాట్లాడినట్లయితే స్మార్ట్ DND, వాతావరణ వివరాలు, రిమోట్ కెమెరా కంట్రోల్, టైమర్, రిమైండర్, రైజ్ టు వేక్ వంటి ఫీచర్‌లను చూడవచ్చు.

Tags:    

Similar News