Mini AC: చల్లదనానికి కేరాఫ్ అడ్రస్.. స్వీచ్ఛ్ ఆన్ చేస్తే మంచు కురవాల్సిందే.. ఇంటికి తెస్తే హిమాలయాల్లో ఉన్నట్లే..!

Portable Cooler: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎండ దంచేస్తుంది.

Update: 2024-04-07 14:31 GMT

Mini AC: చల్లదనానికి కేరాఫ్ అడ్రస్.. స్వీచ్ఛ్ ఆన్ చేస్తే మంచు కురవాల్సిందే.. ఇంటికి తెస్తే హిమాలయాల్లో ఉన్నట్లే

Portable Cooler: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎండ దంచేస్తుంది. ఇంట్లో ఉన్నా.. బయటకు వెళ్లినా వేడి, ఉక్కపోత తట్టుకోలేకపోతున్నారు. దీంతో ఇంట్లో, ఆఫీసుల్లో ఏసీల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. అయితే, ఏసీలు కొనడం, వాడడం కూడా ఎంతో ఖరీదుగా మారుతుంది. దీంతో ఎక్కువ మంది వీటిని ఎక్కువమంది కొనలేదు. వాడలేదు. అందుకోసమే మార్కెట్‌లోకి ఎన్నో మినీ ఏసీలు, కూలర్లు అందుబాటులోకి వచ్చాయి. వీటి వాడకంతో అటు కరెంట్ బిల్లు, ఆదాచేసుకోవడమేకాదు.. ఇంటిని, చుట్టుపక్కల వాతావరణాన్ని చల్లగా మార్చుకోవచ్చు.

ఈ క్రమంలో వచ్చిందే న్యూ ఎండీ మినీ ఆర్కిటిక్ ఎయిర్ కూలర్ - 2023 కొత్త ఎడిషన్. ఇది పోర్టబుల్ 3-ఇన్-1 మినీ కూలర్. ఇది కూలర్, హ్యుమిడిఫైయర్, గాలి శుద్ధీకరణిగా ఉపయోగించుకోవచ్చు. ఇది చిన్నదిగా ఉంటుంది. కాబట్టి, మీరు దానిని ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చు - ఇంటిలో, ఆఫీసులో లేదా ప్రయాణంలో కూడా దీనిని వాడుకోవచ్చు.

ఫీచర్లు:

3-ఇన్-1 కూలింగ్: ఇది చల్లని గాలిని పంపిస్తుంది. గాలిలో తేమను కలుపుతుంది. గాలిని శుభ్రపరుస్తుంది.

పర్యావరణ అనుకూలం: ఇది ఫ్రియోన్ ఆధారంగా చేసిన ఎయిర్ కండీషనర్ల కంటే 90% పైగా విద్యుత్‌ని ఆదా చేస్తుంది.

3 స్పీడ్స్: మీకు కావలసినంత చల్లని గాలి కోసం 3 స్పీడ్ కంట్రోల్స్ ఉన్నాయి.

USB పవర్డ్: USB పోర్ట్‌తో ఆపరేట్ చేయవచ్చు. దీంతో జర్నీలో ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

NEW MD మినీ ఆర్కిటిక్ ఎయిర్ కూలర్ ఈ వేసవిని చల్లగా, ఆహ్లాదకరంగా మార్చడానికి సరైన పరిష్కారం. అయితే, ఇది పెద్ద స్థలాలను చల్లబరచడానికి కాదు కేవలం వ్యక్తిగత వినియోగం కోసమే అని గుర్తించాలి.

ఇది ఎక్కడ దొరుకుతుంది?

అమెజాన్‌లో దీనిని కొనుగోలు చేయవచ్చు. అసలు ధర రూ. 1999లుగా ఉంది. అయితే, 63 శాతం తగ్గింపుతో దీనిని రూ. 744లకే కొనుగోలు చేయవచ్చు.

Tags:    

Similar News