Old Smartphone: పాత స్మార్ట్‌ఫోన్‌ను పక్కన పడేయకండి.. ఇలా క్యాష్‌ చేసుకోండి..!

Old Smartphone: కొంతమంది తరచుగా ఫోన్లు మారుస్తుంటారు. మార్కెట్‌లోకి ఏది కొత్తగా వస్తే దానిని కొనుగోలు చేస్తారు. ఈ సమయంలో పాతవాటిని పక్కన పడేస్తుంటారు.

Update: 2023-10-01 14:30 GMT

Old Smartphone: పాత స్మార్ట్‌ఫోన్‌ను పక్కన పడేయకండి.. ఇలా క్యాష్‌ చేసుకోండి..!

Old Smartphone: కొంతమంది తరచుగా ఫోన్లు మారుస్తుంటారు. మార్కెట్‌లోకి ఏది కొత్తగా వస్తే దానిని కొనుగోలు చేస్తారు. ఈ సమయంలో పాతవాటిని పక్కన పడేస్తుంటారు. ఇలాంటి తప్పు చేయకుండా వాటిద్వారా ఎంతోకొంత మనీ సంపాదించే అవకాశం ఉంది. దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. ఈ సమాచారం తెలుసుకుంటే సులువుగా మనీ సంపాదిస్తారు. పాత స్మార్ట్‌ఫోన్ ఏ విధంగా అమ్మాలో ఈ రోజు తెలుసుకుందాం.

ఈ వెబ్‌సైట్‌ని సందర్శించండి

ఇంట్లో ఉండే పాత స్మార్ట్‌ఫోన్‌లను విక్రయించాలంటే Cashify.com గొప్ప ఎంపికని చెప్పవచ్చు. అయితే ఇందులో ఫోన్‌కు బదులుగా నగదు మాత్రమే చెల్లిస్తారు. ఈ పరిస్థితిలో ఎంతో కొంత డబ్బు అందుతుంది. కానీ దానికి ముందు మీరు అనుసరించాల్సిన చిన్న ప్రక్రియ ఉంటుంది. దీనిని అనుసరించడం వల్ల పాత స్మార్ట్‌ఫోన్లను సులువుగా అమ్మవచ్చు.

పాత ఫోన్‌ విక్రయించే ప్రక్రియ

ముందుగా మీరు Cashify.com వెబ్‌సైట్‌కి వెళ్లి లొకేషన్ ఇవ్వాలి. తర్వాత అందులో మీ స్మార్ట్‌ఫోన్ మోడల్‌ను వెతకాలి. అది కనిపించిన వెంటనే ఎంతకు అమ్మవచ్చో తెలుస్తుంది. ఈ మొత్తాన్ని అంగీకరించిన తర్వాత స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ వర్కింగ్ కండిషన్‌లో ఉందా లేదా, స్మార్ట్ ఫోన్ నుంచి కాల్స్ చేయగలరా లేదా అనే సమాచారాన్ని అందివ్వాలి. చివరగా స్మార్ట్‌ఫోన్‌లో ఉన్న లోపాలు, స్మార్ట్‌ఫోన్ వయస్సును చెప్పాలి. తర్వాత మొబైల్ నంబర్, ఈ మెయిల్ ఐడిని ఎంటర్‌ చేయాలి. ఈ ప్రక్రియను పూర్తి చేసిన వెంటనే మీ స్మార్ట్‌ఫోన్ కోసం ఇవ్వాల్సిన మొత్తం స్క్రీన్‌పై కనిపిస్తుంది.

Tags:    

Similar News