Lava Blaze X 5G: తక్కువ బడ్జెట్‌లో ఊహకందని ఫీచర్స్‌.. అవేంటో తెలిస్తే వెంటనే కొనేస్తారు.

Lava Blaze X 5G: లావా బ్లేజ్‌ ఎక్స్‌ (Blaze X)పేరుతో లాంచ్‌ చేసిన ఈ ఫోన్‌లో ఊహకందని ఫీచర్లను అందించారు. తక్కువ బడ్జెట్‌లో ఇలాంటి ఫీచర్లు ఉండడం విశేషంగా చెప్పొచ్చు.

Update: 2024-07-11 16:19 GMT

Lava Blaze X 5G 

Lava Blaze X 5G: ప్రస్తుతం మార్కెట్లో రోజుకో కొత్త ఫోన్‌ హల్చల్‌ చేస్తోంది. అధునాతన ఫీచర్లతో కూడిన కొంగొత్త ఫోన్‌లను కంపెనీలు మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. మరీ ముఖ్యంగా కంపెనీల మధ్య నెలకొన్న పోటీ నేపథ్యంలో తక్కువ బడ్జెట్‌లో కళ్లు చెదిరే ఫీచర్లతో ఫోన్‌లను వస్తున్నాయి.

ఈ క్రమంలోనే తాజాగా భారత దేశానికి చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం లావా మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. లావా బ్లేజ్‌ ఎక్స్‌ పేరుతో లాంచ్‌ చేసిన ఈ ఫోన్‌లో ఊహకందని ఫీచర్లను అందించారు. తక్కువ బడ్జెట్‌లో ఇలాంటి ఫీచర్లు ఉండడం విశేషంగా చెప్పొచ్చు. ఇంతకీ ఈ ఫోన్‌ల ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రస్తుతం భారత మార్కెట్లోకి లాంచ్‌ అయిన లావా బ్లేజ్‌ ఎక్స్ స్మార్ట్‌ ఫోన్‌ అమ్మకాలు జులై 20వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. అన్ని ప్రముఖ ఈ కామర్స్‌ సైట్స్‌లో ఈ ఫోన్‌ అందుబాటులోకి రానుంది.

ఇక ధర విషయానికొస్తే ఈ ఫోన్‌ బేస్‌ వేరియంట్‌ ధర అన్ని బ్యాంకు ఆఫర్లు కలుపుకొని రూ. 14 వేలుగా ఉండనుంది. ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.67 ఇంచెస్‌తో కూడిన అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను ఇవ్వనున్నారు. 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్‌ రేట్ ఈ స్క్రీన్‌ సొంతం. ఇక కర్డ్వడ్‌ డిస్‌ప్లే ఇవ్వడం ఈ ఫోన్‌ ప్రత్యేకతగా చెప్పొచ్చు.

కెమెరా విషయానికొస్తే ఈ ఫోన్‌లో 64 మెగాపిక్సెల్స్‌, 2 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరా సెటప్‌ను అందించనున్నారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 16 మెగా పిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను ఇవ్వనున్నారు.

ఇక ఇందులో డ్యూయల్‌ వ్యూ వీడియో, ప్రో వీడియో, స్లో మోషన్‌, హెచ్‌డీఆర్‌, నైట్‌, ఏఐ, పనోరమా, ఏఐ ఎమోజీ వంటి ఫీచర్లను అందిస్తున్నారు. ఈ స్మార్ట్‌ ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 33 వాట్స్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించనున్నారు. తక్కువ బడ్జెట్‌లో ఇన్ని ఫీచర్లతో తీసుకొస్తున్న ఈ ఫోన్‌ బడ్జెట్ మార్కెట్‌లో కొత్త ట్రెండ్ సెట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. 

Tags:    

Similar News