Sim Cards: మీ ఐడీపై ఎన్ని సిమ్‌కార్డులు రన్‌ అవుతున్నాయో తెలుసా..?

* ఆన్‌లైన్ మోసాలపై ప్రజలకి ఎంత అవగాహన కల్పించినా ప్రతిరోజు ఎక్కడో ఒకచోట ఇలాంటి మోసాలు జరుగుతూనే ఉన్నాయి

Update: 2022-11-16 06:11 GMT

Sim Cards: మీ ఐడీపై ఎన్ని సిమ్‌కార్డులు రన్‌ అవుతున్నాయో తెలుసా..?

Sim Cards: ఆన్‌లైన్ మోసాలపై ప్రజలకి ఎంత అవగాహన కల్పించినా ప్రతిరోజు ఎక్కడో ఒకచోట ఇలాంటి మోసాలు జరుగుతూనే ఉన్నాయి. నేరగాళ్లు నకిలీ సిమ్‌ల సాయంతో లక్షల రూపాయలను కొల్లగొడుతున్నారు. ఇందుకోసం ప్రతిసారీ కొత్త సిమ్‌ ఉపయోగిస్తున్నారు. అయితే వారు ఇలాంటి నకిలి సిమ్‌లని ఎలా పొందుతారానేదే ప్రశ్న. నిజానికి మీరు కొత్త సిమ్‌ని తీసుకునేటప్పుడు మీ ID సహాయంతో కొందరు నకిలీ సిమ్‌లని తీసుకుంటారు. కానీ ఈ విషయం మీకు తెలియదు. ఇది అంత సులభం కానప్పటికీ వారు చేస్తారు. అయితే మీ IDపై ఎన్ని సిమ్‌లు నడుస్తున్నాయో సులభంగా తెలుసుకోవచ్చు.

నకిలీ సిమ్‌ను ఎలా కనుగొనాలి..?

1. మీ ID (ఆధార్ కార్డ్)లో ఎన్ని సిమ్‌లు నడుస్తున్నాయో చాలామందికి తెలియదు. దీని కోసం అధికారిక వెబ్‌సైట్ ( https://tafcop.dgtelecom.gov.in/) సందర్శిస్తే తెలిసిపోతుంది. ముందుగా మీరు ఈ వెబ్‌సైట్‌కి వెళ్లి మొబైల్ నంబర్‌ను ఎంటర్‌ చేయాలి. తర్వాత మీ ఫోన్‌కి OTP వస్తుంది అది వెబ్‌సైట్‌లో నమోదు చేయాలి.

2. తర్వాత మీరు స్క్రీన్‌పై జాబితాను చూస్తారు. లింక్ చేయబడిన SIM కార్డ్ వివరాలు కనిపిస్తాయి. ఈ జాబితాలో ఏదైనా ఇతర సంఖ్య ఉంటే దాన్ని చెక్ చేయవచ్చు. ఏదైనా అనుమానాస్పద నంబర్ కనిపిస్తే దాన్ని బ్లాక్ చేసే అవకాశం ఉంటుంది.

3. అనుమానాస్పద నంబర్‌ను బ్లాక్ చేసిన తర్వాత మీకు ట్రాకింగ్ ID వస్తుంది. దీని ఆధారంగా అక్రమ నంబర్‌ను గుర్తించి సదరు ఆపరేటర్‌పై చర్యలు తీసుకోవచ్చు. ఏదైనా ఒక IDలో 9 సిమ్‌లు మాత్రమే యాక్టివేట్ అవుతాయని గుర్తుంచుకోండి. అయితే జమ్మూ-కాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల IDలో 6 సిమ్‌లు మాత్రమే రన్‌ అవుతాయి.

Tags:    

Similar News