Portable Fan: ఇదేం ఫ్యాన్ భయ్యా.. మండుటెండనైనా కరిగించేలా ఉందిగా.. రూ.900లలోపే

Air Cooling Portable Fan: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. ఏప్రిల్‌, మే నెలల్లో మాడు పగిలే ఎండలు కొట్టడం ఖాయమని చెబుతున్నారు.

Update: 2024-04-16 07:30 GMT

Portable Fan: ఇదేం ఫ్యాన్ భయ్యా.. మండుటెండనైనా కరిగించేలా ఉందిగా.. రూ.900లలోపే

Air Cooling Portable Fan: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. ఏప్రిల్‌, మే నెలల్లో మాడు పగిలే ఎండలు కొట్టడం ఖాయమని చెబుతున్నారు. ఈక్రమంలో ఇప్పటికే కొన్ని చోట్లు 40 డిగ్రీలు కూడా దాటినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ప్రతీ ఇంట్లో కూలర్లు, ఏసీలకు డిమాండ్‌ పెరిగింది. అయితే.. స్ల్పిట్‌, విండో ఎయిర్ కండిషనర్లు కొంచెం ఖరీదుగా ఉన్నాయి. వీటి వాడకం కూడా ఖర్చుతో కూడుకున్నదే. కానీ పోర్టబుల్ ఎయిర్ కండిషనర్లు మాత్రం చాలా తక్కువ ధరకే మన ఇంటిని చల్లగా మారుస్తుంటాయి. అలాగే, మార్కెట్‌లో పోర్టబుల్ ఫ్యాన్స్ కూడా లభిస్తున్నాయి. వీటిని వాడడం ఎంతో తేలికైనది. చాలా చవకగా లభిస్తున్నాయి. ఈ క్రమంలో వచ్చిందే కీకోస్ ఫ్యాన్.

కీకోస్ ఫ్యాన్ ఇప్పుడు మార్కెట్లో లభించే చిన్న, పోర్టబుల్ ఎయిర్ కూలర్లలో ఒకటిగా పేరుగాంచింది. ఇది ఎండా కాలం వేడిని తట్టుకునేందుకు చాలా సహాయపడుతుంది. ఈ ఫ్యాన్ ఛార్జింగ్‌పై నడుస్తుంది. కాబట్టి, దీనిని ఎక్కడైనా ఉపయోగించవచ్చు.

కీకోస్ ఫ్యాన్ ప్రత్యేకతలు..

పోర్టబుల్, చిన్నది - ఈ ఫ్యాన్ చాలా చిన్నది. లైట్ వెయిట్ కాబట్టి, దీనిని ఎక్కడికైనా తీసుకెళ్లడం చాలా సులభం.

ఛార్జింగ్‌తో పని మొదలు- ఈ ఫ్యాన్ బ్యాటరీతో నడుస్తుంది. దీనిని యూఎస్‌బీ (USB) పోర్ట్ ద్వారా ఛార్జ్ చేయవచ్చు.

స్టాండింగ్ ఫ్యాన్ - ఈ ఫ్యాన్‌ను టేబుల్‌పై ఉంచి డెస్క్‌టాప్ ఫ్యాన్ లాగా కూడా ఉపయోగించవచ్చు. అలాగే, ఇది నిలకడగా ఉండే స్టాండ్ కలిగి ఉంటుంది.

3 స్పీడ్ కంట్రోల్స్ - ఈ ఫ్యాన్‌లో 3 స్పీడ్ కంట్రోల్స్ సెట్టింగ్‌లు ఉన్నాయి. తక్కువ గాలి లేదా ఎక్కువ గాలి కావాలంటే మీరు వీటిని మార్చుకోవచ్చు.

ఎవరికి ఉపయోగపడుతుంది?

వేసవిలో బయట తిరిగే వారు

ఆఫీసులో పనిచేసే వారు

వంటలు చేసే వారు

రోడ్డు‌పై పనిచేసే వారు

కీకోస్ ఫ్యాన్ ఎక్కడ దొరుకుతుంది?

కీకోస్ ఫ్యాన్ ఆన్‌లైన్‌లో, ఎలక్ట్రానిక్స్ దుకాణాలలో లభిస్తుంది .

కీకోస్ ఫ్యాన్ ఫ్లిప్ కార్ట్‌లో కొనుగోలు చేయవచ్చు. దీని అసలు ధర రూ.2,599లుగా నిలిచింది. అయితే, 66 శాతం డిస్కౌంట్‌తో కేవలం రూ.879లకే కొనుగోలు చేయవచ్చు.

గమనిక: ఇక్కడ అందించిన వివరాలు ఈ ప్రోడక్స్‌ను పరిచయం చేయడం గురించి మాత్రమే. మీకు నచ్చితే రివ్యూలు చదువుకొని, నిశితంగా పరిశీలించి కొనుగోలు చేయవచ్చు.

Tags:    

Similar News