Jio Book Laptop: త్వరలోనే మార్కెట్లోకి జియో బుక్ ల్యాప్ టాప్స్..?
Jio Book Laptop: త్వరలోనే మార్కెట్లోకి జియో బుక్ ల్యాప్ టాప్స్..?
JioBook Laptop: ప్రముఖ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో కస్టమర్లకి ఎలక్ట్రానికి ఉత్పత్తులను అందిచడంలో తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తుంది. ఇప్పటికే జియో ఫోన్, ౪గ్ స్మార్ట్ ఫోన్స్ ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు 5G స్మార్ట్ ఫోన్ ను తయారు చేసే పనిలో ఉంది. కొన్ని వార్తా నివేదికల ప్రకారం రిలయన్స్ జియో సొంత ల్యాప్ టాప్ పేరిట జియో బుక్ (Jio Book) ను మార్కెట్లోకి తీసుకొస్తుందని తెలుస్తోంది. ఈ ల్యాప్ టాప్ ను తక్కువ ధరకు విక్రయించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆ ల్యాప్ టాప్ కు సంబంధించిన వివరాలను తెలుసుకుందాం.
టెలికాం సంస్థ జియో ఇప్పుడు సొంత ల్యాప్ టాప్ ను మార్కెట్లోకి ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. JioBook పేరుతో ల్యాప్ టాప్ కు హార్డ్ వేర్ ఆమోదపత్రం ఇటీవలే లభించింది. అయితే ఈ ల్యాప్ టాప్‌ని Emdoor Digital Technology Co Ltd అనే సంస్థ తయారు చేస్తోంది. ఆ కంపెనీతో జియో చేతులు కలిపి తమ బ్రాండ్‌తో మార్కెట్లోకి లాంఛ్ చేయనున్నారు. జియో ల్యాప్ టాప్ విండోస్ 10 అవుట్ ఆఫ్ ది బాక్స్ పేరుతో మార్కెట్లోకి రానుంది.
దీన్ని విండోస్ 11కి అప్ గ్రేడ్ చేసుకునే సదుపాయం ఉంది. JioPhone Next లాగా, జియోబుక్ ల్యాప్‌టాప్ కూడా అతి తక్కువ ధరలో కస్టమర్లకు అందుబాటులో రానుంది. ఈ ల్యాప్‌టాప్ AMDలేదా ఇంటెల్ x86 ప్రాసెసర్‌లతో వినియోగంలోకి వస్తుందని తెలిపింది. అయితే ప్రస్తుతం అందిన సమాచారం ప్రకారం.. JioBook ల్యాప్ టాప్ గురించి ఎక్కువ సమాచారం బయటకు రాలేదు. కానీ JioBook Android 11లో పని చేయనుందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. ఈ ల్యాప్‌టాప్ MediaTek MT8788 ప్రాసెసర్, 2GB వరకు RAM తో అందుబాటులోకి రావొచ్చు. అయితే వీటిపై అధికారిక ప్రకటన రావాల్సిఉంది.