Phone Storage: మీ ఫోన్ స్టోరేజీ తక్కువగా ఉందా.. అయితే ఈ ట్రిక్ ప్లే చేయండి..!
Phone Storage: ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్లకు రోజురోజుకూ డిమాండ్ పెరుగుతోంది. కెమెరా ఉపయోగించడం వల్ల ఫోన్ స్టోరేజ్ త్వరగా నిండిపోతుంది.
Phone Storage: ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్లకు రోజురోజుకూ డిమాండ్ పెరుగుతోంది. కెమెరా ఉపయోగించడం వల్ల ఫోన్ స్టోరేజ్ త్వరగా నిండిపోతుంది. అలాగే ఇప్పుడు ముఖ్యమైన పత్రాలను ఫోన్‌లోనే స్టోర్ చేసుకోవడం ప్రారంభించాం. తద్వారా అవసరమైనప్పుడు వాటిని ఎక్కడైనా ఉపయోగించుకునే వీలుంటుంది. వినియోగదారుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని కంపెనీలు కూడా గరిష్టంగా 1 TB స్టోరేజ్‌ని అందిస్తున్నాయి. అయితే ఫోన్ స్టోరేజ్ కేవలం మన డేటాకే కాదు, ఫోన్ అందులో ఉన్న యాప్‌ల అప్‌డేట్ల కోసం కూడా అవసరమవుతుంది.
స్టోరేజ్ ఫుల్ అయినప్పుడు ఫోటోలను, ఫైల్స్‌ను సేవ్ చేయలేరు. ఒక పాప్ అప్ మళ్లీ మళ్లీ కనిపిస్తుంటుంది. స్టోరేజ్ నిండినట్లు చూపుతుంది. ఈ పరిస్థితిలో ప్రజలు కొత్త ఫోన్ కొనాలని ఆలోచిస్తారు. అయితే దీనివల్ల టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒక ట్రిక్ ప్లే చేసి సులువుగా ఫోన్‌లో స్టోరేజ్‌ని తిరిగి పొందవచ్చు. దాని గురించి ఈరోజు తెలుసుకుందాం.
గూగుల్ బ్యాకప్ సహాయం
మీరు Google ఫోటోలతో బ్యాకప్ చేస్తే ఫోన్ లేదా టాబ్లెట్‌లోని ఫోటోలను డిలీట్ చేయవచ్చు. మీ ఫోన్ ఇంటర్నెట్‌కి కనెక్ట్ అయినప్పుడు యాప్‌లో బ్యాకప్ చేసిన ఫోటోలను వీక్షించవచ్చు. ఇది కాకుండా ఏదైనా ఫోటో ఉపయోగపడలేదని మీకు అనిపిస్తే వెంటనే దాన్ని ఫోన్ నుంచి డిలీట్ చేయవచ్చు.
మీరు మీ ఫోన్‌లో సినిమాని డౌన్‌లోడ్ చేసుకుంటే దాన్ని చూసిన తర్వాత డిలీట్ చేయడం మర్చిపోతారు. ఇది స్టోరేజ్‌పై ప్రెషర్‌ని పెంచుతుంది. ఏదైనా పెద్ద ఫైల్‌ని డౌన్‌లోడ్ చేసి ఉంటే, ఫైల్ మేనేజర్‌కి వెళ్లి దాన్ని చెక్ చేయాలి. అవసరం లేదనుకుంటే డిలీట్ చేయాలి. సాధారణంగా యాప్‌లు క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఏదైనా యాప్ రన్ కానట్లయితే దానిని ఉపయోగించకుంటే డిలీట్ చేయడం ఉత్తమం.