iQOO 13: ఐక్యూ సూపర్ ఫోన్.. దేశంలోకి ఎప్పుడంటే?
iQOO 13: ఐక్యూ బ్రాండ్ ఇటీవలే తన తాజా స్మార్ట్‌ఫోన్ iQOO 13ని విడుదల చేసింది.
iQOO 13: ఐక్యూ బ్రాండ్ ఇటీవలే తన తాజా స్మార్ట్‌ఫోన్ iQOO 13ని విడుదల చేసింది. కంపెనీ ఇప్పుడు ఈ ఫోన్‌ను భారతదేశంతో సహా గ్లోబల్ మార్కెట్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది. కంపెనీ సోషల్ మీడియా హ్యాండిల్ X లో iQOO ఇండియా పోస్ట్‌ను షేర్ చేసింది. ఈ పోస్ట్ ద్వారా,భారతీయ మార్కెట్లో ఈ సరికొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ టైమ్‌లైన్‌ను కంపెనీ ధృవీకరించింది. అదనంగా అమెజాన్‌లోని ల్యాండింగ్ పేజీ, అధికారిక వెబ్‌సైట్ ద్వారా స్మార్ట్‌ఫోన్ కలర్ ఆప్షన్లను తెలుసుకోవచ్చు.
ఐక్యూ షేర్ చేసిన పోస్ట్ ప్రకారం బ్రాండ్ iQOO 13 ఫోన్‌ను డిసెంబర్‌లో భారతీయ మార్కెట్లో లాంచ్ చేస్తుంది. అయితే దీని ముందు నివేదికలు డిసెంబర్ 3, డిసెంబర్ 5, డిసెంబర్ 13 వంటి తేదీలను సూచించాయి. అయితే బ్రాండ్ ఇంకా ఖచ్చితమైన ప్రారంభ తేదీని ధృవీకరించలేదు.
iQOO 13 Features
ప్రస్తుతం అమెజాన్‌లోని iQOO 13 ల్యాండింగ్ పేజీలో దాని కొన్ని స్పెసిఫికేషన్‌లు వెల్లడవుతున్నాయి. ఇది స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్, 144fps గేమ్ ఫ్రేమ్ ఇంటర్‌పోలేషన్ మరియు 2K సూపర్ రిజల్యూషన్ కోసం Q2 సూపర్‌కంప్యూటింగ్ చిప్, 144Hz రిఫ్రెష్ రేట్‌తో 2K LTPO AMOLED స్క్రీన్‌ను కలిగి ఉంది.ఈ స్మార్ట్‌ఫోన్ చైనాలో నాలుగు కలర్స్‌లో అందుబాటులో ఉంది. ఇందులో వైట్, గ్రీన్, బ్లాక్, గ్రే కలర్స్ ఉంటాయి. హ్యాండ్‌సెట్ భారతదేశంలో లెజెండ్ ఎడిషన్ అని పిలువబడే వైట్, గ్రే కలర్స్‌లో అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది.
స్పెసిఫికేషన్ల పరంగా భారతదేశానికి వస్తున్న iQOO 13 దాని చైనీస్ వెర్షన్‌ను పోలి ఉంటుంది. ఫోన్ 6.82-అంగుళాల BOE Q10 ఫ్లాట్ స్క్రీన్‌ను 4,500నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, LPDDR5x అల్ట్రా ర్యామ్, UFS 4.0 స్టోరేజ్‌తో కలిగి ఉంది.
ఇది FunTouch OS 15-ఆధారిత Android 15లో రన్ అవుతుంది. అల్ట్రాసోనిక్ ఇన్-స్క్రీన్ ఫింగర్‌ప్రింట్ స్కానర్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ముందు భాగంలో ఐక్యూ 32-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. దీని వెనుక కెమెరా సెటప్‌లో 50-మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్, 2x ఆప్టికల్ జూమ్‌తో కూడిన 50-మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా ఉన్నాయి.